దేశం కోసం జీవించడం నేర్చుకోవాలి : స్వాసంత్ర్య దినోత్సవ వేడులకల్లో RSS చీఫ్ మోహన్ భాగవత్
సూరత్, గుజరాత్, 16/08/2015 : రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అధ్వర్యంలో RSS ప్రధాన కార్యాలయం డా హెడ్గెవార్ భవన్, మొహితే వాడ నాగపూర్ తో సహా దేశ వ్యాప్తంగా అనేక చోట్ల స్వాసంత్ర్య దినోత్సవ వేడుకలు జరిగాయి, వివిధ స్థాయిలలో ఉన్న RSS నాయకులు జాతీయ పతాకావిష్కరణ చేసి, పతకానికి సెల్యూట్ చేసారు, దేశ వ్యాప్తంగా అనేక వేల మంది RSS స్వయం సేవకులు స్వాసంత్ర్య దినోత్సవ వేడుకలలో పాల్గొన్నారు.
![]() |
సూరత్ డా బిఆర్ అంబేద్కర్ వనవాసి కళ్యాణ్ ట్రస్ట్ లో మార్గదర్శనం చేస్తున్న పూజ్య సర్ సంఘ్ చాలక్ మోహన్ రావ్ భాగవత్ |
డా బిఆర్ అంబేద్కర్ వనవాసి కళ్యాణ్ ట్రస్ట్, సూరత్, గుజరాత్ లో జరిగిన స్వాసంత్ర్య వేడుకలలో మాన్య శ్రీ మోహన్ రావ్ భాగవత్ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ సర్ సంఘ్ చాలక్ గారు త్రివర్ణ పతాకని ఆవిష్కరించి సెల్యూట్ చేసారు.
![]() |
మోహన్ జి పతాకావిష్కరణ |
త్రిపుర రాష్ట్రము అగర్తల లోని సేవా ధాం పరిసరాలలో జరిగిన వేడుకలలో RSS సర్ కార్యవాహ (ప్రధాన కార్యదర్శి) మాన్య శ్రీ సురేష్ (భయ్యాజి ) జ్యోషి పతాకావిష్కరణ చేసారు, మాన్య శ్రీ దత్తాత్రేయ హోసబాలే సహా సర్ కార్యవాహ, మాన్య శ్రీ డా కృష్ణ గోపాల్ లు కూడా ఇక్కడే వేడుకలలో పాల్గొన్నారు.
![]() |
అగర్తల లో భయ్యాజి జ్యోషి |
దేశంలోని ప్రతి పౌరుడు దేశం కోసం జీవించడం నేర్చుకోవాలి : మోహన్ జి భాగవత్
గుజరాత్ రాష్ట్రం సూరత్ లో డా బిఆర్ అంబేద్కర్ వనవాసి కళ్యాన్ ట్రస్ట్ ప్రాంగణంలో జరిగిన వేడుకల్లో పాల్గొన్న పూజ్య సర్ సంఘ్ చాలక్ మాన్య మోహన్ జి భాగవత్ మాట్లాడుతూ ' దేశం కోసం తమ జీవన సర్వస్వాన్ని, తమ తనువూ, మనస్సు, ధనం తో పాటు తమ ప్రాణాన్ని చిరునవ్వుతో దేశ మాత చరణాలకు సమర్పణ చేసిన త్యాగధనుల ఆశయాలను కలలను నిజం చేయడం ఈ దేశంలోని ప్రతి పౌరుడి కర్తవ్యం, దేశం కోసం ప్రాణం ఇవ్వాల్సిన అదృష్టం, అవసరం ఇప్పటి పరిస్థితిలో చాలా తక్కువ మందికే వస్తుంది, కాని ఈ దేశం కోసం జీవించే అవకాశం, అదృష్టం రెండు అందరికి ఉన్నాయి, ఈ దేశం కోసం జీవించడం మన దేశ పౌరులు నేర్చుకోవాలి' అని అన్నారు.
![]() |
RSS కేంద్ర కార్యలయం నాగపూర్ లో |
దేశం కోసం జీవించడం నేర్చుకోవాలి : స్వాసంత్ర్య దినోత్సవ వేడులకల్లో RSS చీఫ్ మోహన్ భాగవత్
Reviewed by JAGARANA
on
8:19 AM
Rating:

Post Comment
No comments: