ఘర్ వాపసిని వేగవంతం చేయాలి : VHP ధర్మ ప్రసార్ వర్గ పిలుపు
దక్షిణ తమిళ నాడు, 16/08/2015 : దక్షిణ తమిళ నాడు ప్రాంత స్థాయిలో విశ్వ హిందు పరిషద్ ధర్మ ప్రసార్ విభాగానికి చెందిన శిక్షణా కార్యక్రమం తేది 14/08/2015 నుండి 16/08/2015 నిర్వహించబడుతుంది, ఈ శిక్షణ కార్యక్రమంలో దక్షిణ తమిళనాడు ప్రాంతానికి చెందిన అన్ని జిల్లాల ధర్మ ప్రసార్ ముఖ్య కార్యకర్తలు హాజరయ్యారు. ఈ వర్గకు మాన్య శ్రీ గుమ్ముల సత్యం విహిప కేంద్రీయ సహా కార్యదర్శి (ధర్మ ప్రసార్) గారు మూడు రోజుల పాటు అక్కడే ఉండి మార్గదర్శనం చేయనున్నాను.
ఈ సందర్భంలో సత్యం జి మార్గదర్శనం చేస్తూ ' మన దేశం పై అనేక వేల సంవత్సరాల పాటుగా జరిగిన విజాతీయ, విధర్మియ దురాగతాలు అన్ని ఇన్ని కావు, మన దేశం పై దండెత్తి మన మన చిహ్నాలను రూపుమాపి, మన దేశ సంపదను కొల్లకోట్టడమే కాకా తమ మతాన్ని ఈ దేశం నిండా విస్తరించాలనే దురాలోచన తోనే దురాక్రమణ భరిత దండయాత్రలు జరిగాయి, అనేక చోట్ల హిందు ధర్మ వీరులు ఆ దండయాత్రలను అడ్డుకోవడంలో సఫలీకృతం అయిన కొన్ని చోట్ల ఓటమి చవిచూడక తప్పలేదు, ఆ సమయంలో సామ,దాన,భేద,దండోపాయాలను ఉపయోగించి తమ మతాన్ని విస్తరించుకోవడంలో విధర్మీయులు విజయం సాధించారు, అలా గతంలో మతం మారిన మన సోదరులను తిరికి తమ తల్లి ఒడికి చేర్చాలి, దాని కోసం ఘర్ వాపసి వేగవంతం కావాలి' అని అన్నారు
ఘర్ వాపసిని వేగవంతం చేయాలి : VHP ధర్మ ప్రసార్ వర్గ పిలుపు
Reviewed by JAGARANA
on
8:18 AM
Rating:

Post Comment
No comments: