కర్నూల్ : ప్రతి మహిళా ఒక జిజాబాయి కావాలి - విహిప ప్రాంత మహిళా ప్రముఖ్ శ్రీమతి వరలక్ష్మి
14/07/2014, కర్నూల్ : విశ్వ హిందూ పరిషద్ మహిళా విభాగం మాతృమండలి ప్రముఖుల జిల్లా స్థాయి సమావేశం తేది : 13/07/2014 నాడు స్థానిక విశ్వ హిందూ పరిషద్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో జరిగింది, ఈ కార్యక్రమానికి జిల్లా వ్యాప్తంగా సుమారు 50 మంది మాతృమండలి ప్రముఖులు హాజరయ్యారు.
ప్రసంగిస్తున్న శ్రీమతి వరలక్ష్మి గారు |
1000 సంవత్సరాల విధర్మియ దాడుల తర్వాత కూడా ఈ దేశాన్ని నిలబెట్టిన అదృశ్య శక్తి 'అమ్మ' : శ్రీ మతి వరలక్ష్మి
ఈ కార్యక్రమానికి ముఖ్య అథితి హాజరయిన విశ్వ హిందూ పరిషద్ పశ్చిమాంధ్ర ప్రాంత మాతృమండలి ప్రముఖ్ శ్రీ మతి వరలక్ష్మి గారు మార్గ దర్శనం చేస్తూ " విహిప స్వర్ణ జయంతి సంవత్సరం రాబోతున్నది దేశ వ్యాప్తంగా హిందూ సంఘటన కార్యం క్రొత్త వేగాలు అందుకుంటున్నది ఆకాశంలో సగమైన మనం, దేశ సేవలోను అగ్రేసరులుగా ఉందాం, అనేక దురాక్రమణభరిత దండయాత్రలు, బౌతిక భౌద్ధిక దాడులు, మెడపై ఎల్లప్పుడూ వేలాడిన విధర్మియ పాలన అయిన ఈ దేశపు ఆత్మ చావలేదు, అందుకే ప్రపంచ దేశాలు వెతుకుతున్నాయి ఈ దేశన్ని నిలబెట్టిన ఆత్మ కోసం, ఆ ఆత్మ, ఆ అంతరంగిక శక్తి " అమ్మా " , ప్రపంచంలో అనేక దేశాలు ఒకే ఒక దండయాత్ర తో మటుమాయం అయ్యాయి, అనేక మతాలూ ఒకే ఒక్క దెబ్బతో మటుమాయం అయ్యాయి, కాని నాదేశం నిలబడింది " జిజాబాయి " లాంటి అమ్మల వలన, కాబట్టి మన మందరు ఆ పౌరుష చరిత్రకు చారిత్రిక వారసులం, మన జీవన క్రమంలో కూడా ఆ సుగుణాలను అలవరుచుకుందాం, మనం మన పిల్లలను ' వీర శివాజిలు'గా మారుద్దాం , మనల్ని మనం జిజాబాయి లుగా మర్చుకుందాం ' అని అన్నారు.
హాజరయిన మాతృమండలి ప్రముఖులు |
ఈ కార్యక్రమంలో ప్రాంత ఉపాధ్యక్షులు శ్రీ వ్యాసరాజ్ గారు, ప్రాంత సంఘటన మంత్రి శ్రీ కేశవరాజు గారు, విభాగ్, జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు.
కర్నూల్ : ప్రతి మహిళా ఒక జిజాబాయి కావాలి - విహిప ప్రాంత మహిళా ప్రముఖ్ శ్రీమతి వరలక్ష్మి
Reviewed by JAGARANA
on
4:22 PM
Rating:
No comments: