RSS ప్రతినిధి సభలో రాజకీయ చర్చలకు తావులేదు : డా మన్మోహన్ వైద్య స్పష్టీకరణ
బెంగళూరు 05/03/2014 : రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అఖిల భారతీయ ప్రతినితి సభ - 2014 (ABPS-2014) సమావేశాలు తేది 07/03/2014 నుండి 09/03/2014 వరకు బెంగళూరు 'రాష్ట్రోత్తాన విద్యా కేంద్ర' లో జరగనున్న సందర్భంలో జరిగిన విలేకరుల సమావేశంలో డా|| మన్మోహన్ వైద్య ( అఖిల భారతీయ ప్రచార ప్రముఖ్) గారు మాట్లాడారు.
మీడియా సమావేశంలో మాట్లాడుతున్న శ్రీ మన్మోహన్ వైద్య |
డా|| మన్మోహన్ వైద్య గారు మాట్లాడుతూ 'సంఘ్ యొక్క అత్యున్నత స్థాయిలో సంఘ, సంఘ్ పరివార్ క్షేత్రల సంవత్సరం పాటుగా జరిగిన కార్యక్రమాల సమీక్షా, రాబోవు కార్యక్రమాల యోజన, దేశ శ్రేయస్సు కోసం జాతీయ స్థాయిలో జరగాల్సిన కార్యాల విషయం లో చర్చల కోసం ప్రతి సంవత్సరం జరిగే సమావేశాలను ' అఖిల భారతీయ ప్రతినిధి సభ ' గా పిలవడం జరుగుతుంది. సంఘ్ విభజన దృశ్య దేశంలోని 41 ప్రాంతా(రాష్ట్ర)ల నుండి ప్రాంత స్థాయి సంఘ్ చాలక్ లు, ప్రాంత కార్యవాహలు, ప్రాంత ప్రచారక్ లతో పాటు, సంఘ్ పరివార్ సంస్థల జాతీయ స్థాయి నేతలు, దేశం లోని నలుమూలల నుండి సామజిక కార్యకర్తలు సుమారు 1400 మంది ఈ సమావేశాలలో పాల్గొననున్నారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ప్రాంత స్థాయి పదాధికారులకు మార్చ్ 6 న జరిగే సమావేశంతోనే ఈ సమావేశాలు ప్రారంభం అవుతాయి' అని అన్నారు.
రాజకీయ చర్చలకు తావులేదు : RSS స్పష్టీకరణ
ఒక మీడియా మిత్రుడు అడిగిన ప్రశ్నకు సమాదానం గా డా. మన్మోహన్ వైద్య మాట్లాడుతూ 'ఈ సమావేశాలు కేవలం సంఘ్ పనిని సమీక్షించుకోవడానికి మాత్రమే నిర్ధరితమైనవి, వీటిలో ఏ విధమైన రాజకీయ చర్చలకు తావులేదు, దేశ ప్రజాస్వామ్యన్ని సుదృడం చేసే క్రమం లో ఎన్నికలలో ఓట్ల శాతం పెరిగి 100% పోలింగ్ జరగాలని సంఘ్ కోరుకుంటుంది కాబట్టి అదే దృష్టితో సంఘ్ కార్యకర్తలు ఓటర్ల నమోదు, పోలింగ్ తేది నాడు ఓటు హక్కు వినియోగించుకునే విషయంలో భారత దేశం లోని అన్ని ప్రాంతాలలో అవగాహన కార్యక్రమాలు చేస్తూ ఉంటారు' అని అన్నారు.
ఈ మీడియా సమావేశంలో డా|| మన్మోహన్ వైద్య గారితో పాటు కర్ణాటక ప్రాంత కార్యవాహ శ్రీ వెంకటరాము, ప్రాంత ప్రచార ప్రాముఖ్ శ్రీ వాదిరాజ్, బెంగళూరు నగర్ కార్యదర్శి శ్రీ శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.
మూలం : విశ్వ సంవాద కేంద్రం - కర్ణాటక
మూలం : విశ్వ సంవాద కేంద్రం - కర్ణాటక
RSS ప్రతినిధి సభలో రాజకీయ చర్చలకు తావులేదు : డా మన్మోహన్ వైద్య స్పష్టీకరణ
Reviewed by JAGARANA
on
9:47 AM
Rating:
No comments: