Top Ad unit 728 × 90

రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ పై 14 నిరాధారా ఆరోపణలు - ఒక సమీక్ష : కిరణ్ కుమార్

వ్యాసకర్త : శ్రీ కిరణ్ కుమార్ , బెంగళూరు .
సామాజిక అనుసందాన వేదికలు ( సోషల్ మీడియా ) ద్వారా రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ కి వ్యతిరేకంగా నిరాధారా ఆరోపణలు, అపోహల వ్యాప్తి కి జరుగుతున్న ముమ్మర ప్రయత్నాన్ని చూసి వాటికి సంబందిచి అసలైన జవాబులను మీ ముందు ఉంచే చిన్న ప్రయత్నం చేస్తున్నాను.

అపోహ 1 : సంఘం జాతిపిత మహాత్మా గాంధీని చంపింది 

ఇదీ నిజం: 1948 లో నాతురాం గాడ్సే మహాత్మా గాంధీని హత్య చేసాడు, కాని 1930 లలోనే తను సంఘ్ కార్యపద్దతికి సమ్మతించక బయటకి వెళ్ళి పోయాడు , ఇదే విషయాన్ని సంఘ్ అనేక సార్లు స్పష్టం చేస్తూనే ఉంది , ఈ మధ్యనే శ్రీ రామ్ మాధవ్ గారు కోర్టు లో నాతురాం గాడ్సే ఇచ్చిన బాయన్ ను ఆధారాలతో మీడియా ముందు ఉంచారు, ' మహాత్మా గాంధీ హత్యతో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ కి ఎలాంటి సంబధం లేదు ' అని జస్టీస్ కపార్ కమిషన్ దర్యాప్తు అనంతరం స్పష్టం చేసింది. అయినప్పటికీ సంఘాన్ని గాంధీ హత్యతో ముడి వేయడం అంటే ముస్లీం లీగ్ చేసిన హత్య ఖండను కాంగ్రెస్ కి అంటగట్టటం అవుతుంది, ఎందుకంటే మహమ్మద్ జిన్నా 1920 లోనే కాంగ్రెస్ ను వీడాడు , మరి ప్రత్యక్ష కార్యాచరణ రోజున జరిగిన దాదాపు 1000 మందికి పైగా అమాయక హిందువుల హత్యకు కాంగ్రెస్ బాధ్యత వహిస్తుందా ? 

అపోహ 2 : సర్దార్ వల్లభాయి పటేల్ సంఘాన్ని విమర్శించే వారు 

ఇదీ నిజం: 1948 లో మహాత్మా గాంధీ హత్య అనంతరం కుహాన లౌకికవాద నాయకుడు నెహ్రు మరియు అతని మంది మాగాదాల ఒత్తిడి వల్లనే  రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ పై తాను నిషేధం విధించవలసి వచ్చిందని సర్దార్ పటేల్ స్వయంగా నిషేధం ఎత్తివేసిన అనతరం సంఘ్ అప్పటి సర్ సంఘ్ చాలక్ పూజ్య శ్రీ గురూజీ కి రాసిన ఉత్తరం లో పేర్కొన్నారు , అంటే కాక ఒక జాతీయవాద సంస్థ పై నిషేదాన్ని ఎత్తివేయడం లో అందరికంటే ఎక్కువగా ఆనంద పడ్డ వ్యక్తినీ తనే అని పేర్కొన్నారు . మరో సందర్భంలో నెహ్రు కు రాసిన లేఖలో 'గాంధీజీ హత్య పరిశోధనలో జరుగుతున్న ప్రగతి గురించి నేను ప్రతిదినం పరిశీలిస్తున్నాను. నేరస్తులందరూ తమ కదలికల గురించి విస్తృత వివరణలు ఇచ్చారు. వారిచ్చిన సమాచారాల ద్వారా ఈ మొత్తంలో సంఘానికి (ఆర్ ఎస్ ఎస్) ఏ మాత్రం సంబంధం లేదని తేలింది. ప్రభుత్వానికి న్యాయశుద్ది ఉన్నట్లయితే సంఘానికి పట్టిన గ్రహణం గాంధీజీ మాసిక శ్రాద్ధం లోగా తొలగిపోగలదు' అని పేర్కొన్నారు .

   

అపోహ 3 : సంఘం జాతి వ్యతిరేక సంస్థ 

ఇదీ నిజం: రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ దేశంలోనే అతిపెద్ద , నిజమైన, ఓటు బ్యాంకు రాజకీయాలను తీవ్రంగా వ్యతిరేకించే జాతీయవాద సంస్థ. సంఘాన్ని తీవ్రంగా వ్యతిరేకించే మన ప్రధాని జవహర్ లాల్ నెహ్రు కూడా  ఈ విషయాన్ని గుర్తించే 1963 గణతంత్ర వేడుకలలో పల్గోవాల్సింది కోరారు, మరేఇరత సంస్థలకు లభించని కేవలం సంఘానికి లభించిన అరుదైన గౌరవం అది , 3500 మంది పూర్ణ గణవేశధారులైన స్వయం సేవకులు సైన్యనికి ఏమాత్రం తగ్గకుండా చేసిన మార్చ్ఫాస్ట్ ( పథ సంచలన్) ఒక అపురూప ఘట్టం , 1962 లో భారత్ పై చైనా చేసిన దురాక్రమణ భరిత యుద్ధం లో భారత సైన్యానికి మద్దత్తు గా సంఘ స్వయం సేవకులు చేసిన సాహసోపేత పనికి గౌరవ సూచకంగా నెహ్రు చేసిన ఆహ్వానం అది. నాకు తెలిసి ఈ దేశ ప్రధాని సేక్యులరిసం కి ప్రతీక అయిన  నెహ్రు ఒక జాతి వ్యతీరేక సంస్థకి ఈ దేశ సైన్యం తో కలసి మార్చ్ చేసే అవకాశం ఇవ్వడం జరగదు. 1965 లో పాకిస్తాన్ మన పై దండెత్తిన సందర్భంలో కూడా అప్పటి ప్రధాని శాస్తి గారు డిల్లి పొలిసు సిబ్బంది యుద్ధ పనులలో నిమగ్నమై ఉండటంతో డిల్లిలోని ట్రాఫిక్ ను నియంత్రించే పనికి సంఘానికే అప్పజెప్పారు, అదే సమయంలో పాకిస్తాన్ జమ్మూ కాశ్మీర్ పై పైచేయి సంధించే ప్రయత్నం చేసినప్పుడు అప్పటికప్పుడు దాదాపు 1500 మంది స్వయం సేవకులు 3 రోజుల పాటు అహర్నిశలు శ్రమించి ఎయిర్ పోర్ట్ లోని మంచును శుభ్రం చేసి మన సైన్యం ఆ యుద్ధం లో గెలవడంలో కీలక పాత్ర పోషించారు, ఇప్పటికి సంఘం ఒక జాతి వ్యతిరేక సంస్థ ? 

అపోహ 4 : సంఘం ఒక మతవాద సంస్థ 

ఇదీ నిజం: సంఘం దేశానికి, హిందుత్వానికి అనుకూలంగా వ్యవరించే సంస్థ, సంఘం సిద్హ్దంతం దృశ్య ఈ దేశం లో రెండు రకాలైన హిందువులు ఉంటున్నారు, ఒకరు ప్రస్తుతం హిందువులుగా జీవిస్తున్నవారు, మరో రకం గతంలో హిందువులుగా జీవించిన వారు, దీని అర్థం ఈ  దేశం (అఖండ భారతం ) లో జీవిస్తున్నప్రతి ఒక్కరు వారి పూర్వీకుల వారసత్వం, సాంసృతిక, సాంప్రదాయిక వారసత్వం కారణంగా హిందువులుగానే పరిగనించబడతారు. సంఘం మతమార్పిడ్లలో విశ్వాసం ఉంచదు, దేశం లోని అందరికి సమానమైన పౌరస్మ్రుతి ఉండాలని పెళ్ళి, విడాకులు, వారసత్వం లాంటి విషయాలలో చట్టం అందరికి సమానంగా ఉండాలని కోరుకుంటుంది, ఈ దేశం లో పుట్టిన వారంతా భారత మాతను తల్లిగా భావించాలి లేకపొతే వారికి ఈ దేశంలో ఉండే హక్కు లేదు అనటడం మతతత్వమా ?

అపోహ 5 : సంఘం నియంతృత్వ ఆలోచన కలిగిన తీవ్రవాద సంస్థ 

ఇదీ నిజం: రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఎప్పుడు కూడా హింస లో విశ్వాసం ఉంచలేదు తన శాఖలలో హింసాయుత విధానానికి అనుకూలంగా సిద్ధాంతాన్ని బోదించదు, సంఘం కేవలం తన జాతీ సనాతన వారసత్వాన్ని గూర్చి ఈ దేశం యొక్క పరమ వైభవ స్థితిని గూర్చి మాత్రమె భోదిస్తుంది, జిహాది లు , క్రైస్తవ విషనరిలు చేసినట్లు బలవంతపు మతమార్పుడ్లు సంఘం చేయదు, మతఘర్షణలు జరిగిన సందర్భంలో సంఘం ఎన్నడు కూడా దాన్ని రాజకీయం చేయాలనీ చూడలేదు కాని చట్టం దృష్టిలో సమానంగా ఎవరైనా చట్ట వ్యతిరేకంగా వ్యవహరిస్తే శిక్షార్హులు అని నమ్ముతుంది. హిందు(కాషాయ)తీవ్రవాదం అనే పేరుతొ సంఘానికి తీవ్రవాద కార్యకలాపాలకు ముడిపెట్టాలని ప్రయత్నించిన కాంగ్రేసు నాయకులు నాలుకలు కరచుకోవడం మనకు ద్రుగ్రిషయమే . 

అపోహ 6 :సంఘంలోనికి కేవలం హిందూ యువకులకు మాత్రమే ప్రవేశం 

ఇదీ నిజం: కేవలం సంఘం పట్ల సరైన అవగాహనా లేని అజ్ఞాన కుహాన స్త్రీ వాదులు  మాత్రమే ఈ విధమైన ఆరోపణలు చేస్తారు, నిజానికి సంఘం రెండు విభాగాలుగా పనిచేస్తుంది ఒకటి రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ యువకుల కోసం , రాష్ట్ర సేవికా సమితి యువతుల కోసం, ఈ రెండూ పథ సంచలన్ చేస్తాయి, శస్త్ర ప్రదర్శనలు జాతీయ వాద కార్యక్రమాలు చేస్తాయి.

అపోహ 7 : సంఘం ముస్లీం, క్రైస్తవులకు వ్యతిరేకం   

ఇదీ నిజం: రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఒక కుల, మత, భాష, జాతులకు అతీతంగా ఈ దేశాన్ని తమ మాతృభూమి గా భావించి వందనం తెలిపే అందరికోసం , కాబట్టే సంఘం లో ప్రత్యేక ఇస్లాం శాఖా , క్రైస్తవ శాఖా లు ఉండవు , అంతేకాని సంఘం అన్య ఆరాధనా అవలంబీకులకు వ్యతిరేకంగా పని చేస్తుంది అనడం సుద్దా అవాస్తవం , ' RSS హిందువుకాని వారికి వ్యతిరేకంగా పని చేయని రాజకీయేతర సాంసృతిక సంస్థ ' అని రంగానాదాచార్య కేసులో కర్ణాటక హై కోర్టు స్పష్టం చేసింది.

అపోహ 8 : సంఘం ఉన్నత కులాల పక్షపాతి  

ఇదీ నిజం: రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఎప్పుడుకూడా కుల వ్యవస్థలో విశ్వాసం ఉంచలేదు, సంఘం స్వయం సేవకుల మధ్య ఎన్నడు కూడా కుల ప్రస్తావన నామ మాత్రంగానైనా రాదు, ఈ విషయాన్ని దాదాపుడు డెబ్బై సంవత్సరాల క్రితమే మహాత్మా గాంధీ, డా అంబేద్కర్ లు చూసి ఆశ్చర్యచకితులయ్యారు. వాత్సల్య పూర్ణ మైన ఈ భూమి బిడ్డలు అందరు ఒక్కటే అందరు కలసి దేశ పునర్వైభవ కార్యంలో మని చేయాలన్నదే సంఘం ఆకాంక్ష .    

అపోహ 9 : 1984 ఘర్షణలో సిక్కులకు వ్యతిరేకంగా పనిచేసింది           

ఇదీ నిజం: ప్రముఖ సిక్కు పాత్రికేయుడు కుష్వంత్ సింగ్ అభిప్రాయం ప్రకారం, 1984 లో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల చే జరిగిన అల్లరలో సిక్కులకు పెద్ద ఎత్తున రక్షణ కల్పించి, పునరావాస కార్యక్రమాలు చేసింది సంఘం మాత్రమే, కాంగ్రెస్ పార్టి నాయకుడు రాజీవ్ గాంధీ ఈ సాముహిక జనహనాన్ని ఆపే ప్రయత్నం కూడా చేయలేదు.

అపోహ 10 : శ్రీ రామ సేన, అభినవ్ భారత్ వంటి సంస్థలు సంఘ్ పరివార్ లో భాగం 

ఇదీ నిజం: శ్రీ రామ సేనా, అభినవ్ భారత్ లకు సంఘానికి ఏవిధమైన సంబంధం లేదని సంఘం అనేక సార్లు విస్పష్టం చేసింది, హిందుత్వం కోసం పని చేస్తున్నాం అని చెప్పే ప్రతి సంస్థ సంఘ్ పరివార్ లో భాగం కాదు, ఏ సంస్థను సంఘ్ పరివార్ లో భాగం చేయాలో , చేయకూడదో సంఘం వద్ద స్పష్టమైన అవగాహన ఉంది , ఇదంతా ఆ సంస్థల యొక్క కార్యపద్దతి పై ఆధారపడి ఉంటుంది. ఆయా సంస్థలు అనేక సందర్భాలలో సంఘాన్ని దూషించి సంఘ నాయకులకు హత్య చేయడానికి ప్రయత్నాలు చేసాయి.

అపోహ 11 : భాజపా సంఘం యొక్క రాజకీయ అభిముఖం   

ఇదీ నిజం: రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఎప్పుడు కూడా ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉండే రాజకీయేతర సాంసృతిక సంస్థ మాత్రమే, దేశ భక్తితో నిండిన యువకుల ద్వార దేశ పునర్వైభవానికి కృషి చేయడమే సంఘం యొక్క ప్రధాన ఉద్ద్యేశం. భాజపా మాతృ సంస్థ జన సంఘ్ కాని సంఘం కాదు, శ్రీ అటల్ బిహారి వాజ్ పాయి , శ్రీ అద్వాని మరియు మోడీ , రాజనాథ్ సింగ్ వంటి  భాజాపా లోని అనేక జాతీయ స్థాయి నేతలకు  సంఘ్ నేపథ్యం ఉన్నమాట వాస్తవమే వారితో పాటు అనేక మంది కాంగ్రెస్ , అం ఆద్మీ పార్టి నేతలకు కూడా సంఘ్ నేపథ్యం ఉంది, జాతి హితం కోసం అనేక అంశాల ప్రాతిపాదికన సంఘ్ కార్యకర్తలు అనేక పార్టీల కార్యకర్తలతో కలసి పనిచేస్తారు, అత్యవసర పరిస్థితికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమించిన, అలాగే ఈ మధ్య జరిగిన జన లోక్ పాల్ బిల్లు ఉద్యమ సమయంలో ప్రజలను ఉద్యమంలో మమేకం చేసిన రాజకీయేతర సంస్థ సంఘం మాత్రమే,  మన రాజకీయ నాయకులలో చాలామందికి NCC నేపథ్యం ఉంది అంతమాత్రాన NCC కి రాజకీయ రంగు పులమడం ఎలాంటిదో  భాజపా రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ రాజకీయ అభిముఖం అనడం అలాంటిదే. సంఘాన్ని తీవ్రంగా వ్యతిరేకించే కాంగ్రెస్ పార్టి నాయకుడు శ్రీ దిగ్విజయ్ సింగ్ అనేక వేదికలను సంఘ్ నాయకులతో పంచుకున్నారు.

అపోహ 12 : సంఘం లో చేరాలంటే పెద్ద సభ్యత్వ నమోదు ప్రక్రియను దాటాల్సి ఉంటుంది

ఇదీ నిజం: ఎవరైతే ఈ దేశం పట్ల మాతృభావన కలిగి స్వయం ప్రేరితంగా ఈ దేశానికి సేవ చేయాలని అనుకుంటున్నారో వారందరూ సంఘంలో చేరవచ్చు దీని కోసం ఎటువంటి సభ్యత్వ నమోదు ప్రక్రియ ఉండదు, స్వయం  సేవక్ అనే పదానికి అర్థం అదే. అలాగే ఇతర సంస్థ ల మాదిరిగా సంఘ స్వయం సేవకులకు గుర్తింపు కార్డులు లాంటి చిహ్నాలు అందిచబడవు. మాతృభూమి పట్ల ప్రేమ ఉంటె సంఘం లో పనిచేయోచ్చు లేదా ఏ నిమిషంలో అయిన వదిలి పోవొచ్చు ఎలాంటి ఆటంకాలు ఉండవు.

అపోహ 13 : సంఘం కేవలం హిందు ఉద్యమాలు మాత్రమే చేస్తుంది 

ఇదీ నిజం: రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఈ దేశం కోసం పని చేస్తుంది ఈ దేశం అంతా ఒకే శరీరం లాంటిది అనే భవతో  ఎక్కడా ఎలాంటి ఆపద వచ్చిన అత్యంత్య తక్కువ సమయంలో ఎటువంటి భేద భావం లేకుండా స్పందిచే సంస్థ సంఘ్ మాత్రమే . దేశం ఎదుర్కొన్న అతిపెద్ద విపత్తుల నష్ట నివారణా , పునరావాస కార్యక్రమాలలో సంఘ స్వయం సేవకులు పేద ఎత్తున పాల్గొన్నారు, 2004 తమిళనాడు సహా దక్షిణ భారతం లో జరిగిన సముద్ర భీభత్సం సునామీలో, 2001 గుజరాత్ భీకర భూకంపంలో, 2009 ఆంద్ర - కర్ణాటక లో వచ్చిన ఘోర వరదలో, 2013 ఉత్తర ఖండ్ వరదలలో తో పాడు దేశం లో ప్రతి నిత్యం జరిగే ఘోర రోడ్డు, రైలు వంటి ప్రమాదాలలో సంఘ్ స్వయం సేవకులు పరుగు పరుగున వెళ్ళి సహాయం చేయడం జగమెరిన సత్యమే, ప్రకృతి విపత్తుల సమయంలోనే కాదు బంగ్లాదేశ్ చొరబాటు దారులచే అస్సాం లో జరిగిన ఘోర కలి వంటి  మనవ కల్పిత, రాజకీయ ప్రేరిత విపత్తులను ఆపడానికి సంఘం పనిచేసింది, 1971 యుద్ధ సమయం లో గాయపడ్డ ఈ దేశ సైనికులకు అవసరమైన రక్తంలో గరిష్ట భాగం సేకరించిన ఘనత సంఘ్ ది . సంఘం దేశవ్యాప్తంగా ప్రాంత, జాతి, కుల, మత భేదభావనలకు అతీతంగా సేవ భారతి మాధ్యమంగా 1,70,000 వేల సేవ కార్యక్రమాలను నిర్వహిస్తుంది, వాటితో పాటు గిరిజన, వనవాసిలకు విద్యనందిచడం కోసం 27041 ఏకోపాధ్యాయ స్కూల్లను నడిపిస్తింది వీటిలో సుమారు 7,60,000 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. ఉత్తర ఖండ్ ప్రళయం సందర్భంలో అక్కడకి ప్రభుత్వ విభాగాల కంటే అతి తక్కువ సమయం లో  చేరుకొని పునరావాసాన కార్యక్రమం ప్రారంబించిన సంస్థ సంఘ్, భారత సైన్యంతో సహా దేశం లోని ప్రతి ఒక్కరిని ఆపదలో ఆదుకునే లక్షలాది మంది అభిమానులు కలిగి 60,000 పైగా కార్యకర్తలతో కూడిన ప్రపంచంలోనే అత్యంత పెద్దదైన రాజకీయేతర స్వచ్చంద సంస్థ రాష్టీయ స్వయం సేవక్ సంఘ్ మాత్రమె. 
ఉత్తర ఖండ్ సేవలను ఈ విడియో చూడొచ్చు :
                      

అపోహ 14 : సంఘం దేశ త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించదు  

ఇదీ నిజం: రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఈ దేశ జాతీయ పతాకాన్ని గౌరవించదు అనే ఆరోపణ సుద్ద అబద్దం, అయేతుకం, సంఘ్ సర్ సంఘ్ చాలక్ ( సంఘం లో అత్యున్నత బాధ్యత కలిగిన వ్యక్తీ ) తో పాడు ప్రతి సంఘ్ కార్యాలయాలలో సంఘ నాయకులు అనేక జాతీయ వేడుకలలో దేశ త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించడం జరుగుతుంది. 
రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ పై ఉన్న నిరాధార ఆరోపణలు , అపోహలకు అంతే లేదు ఒక్క విషయాన్ని గుర్తుంచుకోండి సంఘం అంటే " నిస్వార్థ సేవకు ఎప్పుడు సిద్ధమే " R = Ready For S=Self Less S=Service 
" సత్యమేవ జయతే "
మూలం : www.samvada.org 
రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ పై 14 నిరాధారా ఆరోపణలు - ఒక సమీక్ష : కిరణ్ కుమార్ Reviewed by JAGARANA on 8:58 AM Rating: 5
All Rights Reserved by రాష్ట్ర చేతన © 2015 - 2016
Designed by JOJOThemes

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.