Top Ad unit 728 × 90

వార్తా హైందవం

recent

ఆర్.ఎస్.ఎస్ పై ' కారవాన్ ' దుష్ప్రచారాన్ని నిరసిస్తూ జంతర్ మంతర్ వద్ద ముస్లీం సంస్థల ధర్నా

క్రొత్త డిల్లి , 14/02/2014 : జాతీయవాద నేతలు , రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ పై ' కారవాన్' పత్రిక చేసిన దుష్ప్రచారాన్ని నిరసిస్తూ తేది 14/02/2014 న డిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ముస్లీం రాష్ట్రీయ మంచ్, జమాతే ఉలేమా హింద్ తదిరత ముస్లీం సంస్థలు నిరసన ప్రదర్శన, ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించాయి.

ముస్లీం రాష్ట్రీయ మంచ్ డిల్లి ప్రాంత సంయోజకులు శ్రీ ముషీర్ ఖాన్ నేతృత్వం లో జరిగిన ఈ కార్యక్రమం లో సంస్థ హర్యానా ప్రాంత సంయోజకులు ఖుర్దీష్ అహ్మద్ రజ ఖ మాట్లాడుతూ ' కాంగ్రెస్ పార్టీ 'కారవాన్' పత్రికను జాతీయ వాద సంస్థ అయిన రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అధినాయకులకు వ్యతిరేకంగా కల్పిత దుష్ప్రచారాని వొడిగట్టి తన నీతిమాలిన రాజకీయ వ్యూహాలను బయట పెట్టుకుంది. దీన్ని ఈ దేశం లోని ఏ ఒక్క ముస్లీం ఒప్పుకోరు' అని అన్నారు , ఇదే సమావేశంలో హర్యానా రాష్ట్ర మాజీ హోం మంత్రి హసన్ మహమ్మద్ మాట్లాడుతూ 'కాంగ్రెస్ తన ఓటు బ్యాంకు రాజకీయాల కోసం ఏ స్థాయి కైనా దిగజారడానికి సిద్దంగా ఉంటుంది, అధికార దాహం ఆ పార్టి చేత అనైతిక కార్యాలు చేయిస్తుంది, మతం పేరుతొ ఈ దేశంలో విభజన రాజకీయాన్ని కాంగ్రేసే ప్రారంభించింది' అని అన్నారు .ప్రధాన వక్త గా హాజరైన ముస్లీం రాష్ట్రీయ మంచ్ సంస్థాగత కార్యదర్శి శ్రీ గేరీష్ జునాల్ మాట్లాడుతూ ' దేశం లోని కాంగ్రెస్ తో సహా అన్ని రాజకీయ పార్టిలు ముస్లీంలకు ఆర్ ఎస్ ఎస్ ను ఒక బూచిగా చూపెడుతూ తమ రాజకీయ పబ్బం గడుపుకుంటున్నాయి, ఈ విషయాన్ని దేశం లోని ముస్లీం ఇప్పుడుప్పుడే అర్థం చేసుకుంటున్నారు, సంఘం ఏ మతానికి వ్యతిరేకంగా ఏనాడు వ్యవహరించలేదు' అని అన్నారు.
ఈ ధర్నాలో సంస్థ జాతీయ సంయోజకులు మహమ్మద్ అఫ్జల్, ఇమ్రాన్ చౌతరి, శ్రీమతి షహనాజ్ అఫ్జల్, మౌలానా మఝార్ ఇమాం బరేలి, జమాతే ఉలేమా హింద్ సంస్థ అధ్యక్షులు మౌలానా సుహేష్ ఖస్మి, శ్రీమతి శమా ఖాన్, శ్రీమతి అర్మాన్ బేగం, ఇర్ఫాన్ మిర్చ్ తదితరులు పాల్గొన్నారు.        

ఆర్.ఎస్.ఎస్ పై ' కారవాన్ ' దుష్ప్రచారాన్ని నిరసిస్తూ జంతర్ మంతర్ వద్ద ముస్లీం సంస్థల ధర్నా Reviewed by JAGARANA on 9:29 AM Rating: 5

No comments:

All Rights Reserved by రాష్ట్ర చేతన © 2015 - 2016
Designed by JOJOThemes

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.