భాగ్యనగర్ : జాతీయ స్థాయిలో విహెచ్‌పి హెల్త్‌లైన్ - నేడు ప్రవీణ్ భాయి తొగాడియా చేతుల మీదుగా ప్రారంభం
- సామాన్యులకు ఉచితంగా కార్పోరేట్ స్థాయి వైద్యం అందిచే యత్నం
- దేశ వ్యాప్తంగా అందుబాటులోకి రానున్న కాల్ సెంటర్లు
- 1500 పాథాలజీ కేంద్రాలను అనుసందానం చేసే ప్రయత్నం
- ధన్వంతరి సెల్ - ఇండియా హెల్త్ లైన్ గా నామకరణం
- ఈ రోజు ప్రవీణ్ భాయి తొగాడియ చేతుల మీదుగా ప్రారంభం
విజయ శ్రీ భవనం, భాగ్యనగర్,16/02/2014: కోట్లాది భారతీయుల ఆరోగ్య ప్రణాళిక కోసం ఇండియా హెల్త్‌లైన్-్ధన్వంతరిని విశ్వహిందూ పరిషత్ అంతర్జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు డాక్టర్ ప్రవీణ్‌భాయ్ తొగాడియా ఆదివారం హైదరాబాద్‌లో ప్రారంభిస్తారు. నిపుణులైన డాక్టర్లచే ఖరీదైన వైద్య చికిత్స అతిసామన్య నిస్సహాయ బాధితులకు కూడా అందుబాటులోకి తీసుకురావడానికి ఈ ప్రణాళిక ఉపయోగపడుతుంది. అభాగ్యులకు, వైద్య శిఖామణులతో ఒక అనుసంధానాన్ని ఏర్పాటు చేసి సామాన్యులకు సైతం దీనిని అందుబాటులోకి తెస్తున్నారు. దేశమంతటా ధన్వంతరి- ఇండియా హెల్త్‌లైన్ కార్యకర్తలు కూడా అందుబాటులో ఉంటారు. ఉచితంగా లేదా అతి చౌకగా పరీక్షించే స్పెషలిస్టు డాక్టర్ వద్ద సమయం తీసుకుని ఈ కార్యకర్త రోగికి హెల్త్‌లైన్ పత్రాన్ని అందిస్తారు. అలాగే అతి దగ్గరలో ఉన్న వైద్యుడి వివరాలు కూడా రోగికి ఇస్తారు. వీరు మామూలు రోగులకు వీలైనంత త్వరలో మార్గదర్శనం లేదా చికిత్స చేస్తారు. దేశం నలుమూలల కాల్ సెంటర్లు అందుబాటులోకి వస్తాయి. మొత్తం మీద ఇదో అద్భుతమైన సేవాప్రకల్పమని ఇండియా హెల్త్‌లైన్ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ మాణిక్యాచారి, పరిషత్ అధ్యక్షుడు యం రామరాజు, మహానగర్ ప్రచార ప్రముఖ్ భరత్ వంశీ పేర్కొన్నారు. పరీక్ష, చికిత్స కూడా ముగించే విధంగా ఈవ్యవస్థ ఏర్పాటైందని చెప్పారు. పాథాలజీ ల్యాబ్‌లు, ఎక్స్‌రే కేంద్రాలు, ఎంఆర్‌ఐ కేంద్రాలు, సిటి స్కాన్ కేంద్రాలు అన్నీ అందుబాటులో ఉంటాయని వివరించారు. ఇండియా హెల్త్‌లైన్ 16499977036281 అని వారు తెలిపారు. ఈ ప్రణాళికను సికిందరాబాద్ బాలంరాయ్ పెరకి ప్యాలస్ ఫంక్షన్ హాలులో ప్రవీణ్‌భాయ్ తొగాడియా ప్రారంభిస్తారని వారు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఐఎంఎ అధ్యక్షుడు ఎన్ అప్పారావు, ఎం యాదగిరి, కె. సత్యనారాయణ తదితరులు పాల్గొంటారని అన్నారు.
భాగ్యనగర్ : జాతీయ స్థాయిలో విహెచ్‌పి హెల్త్‌లైన్ - నేడు ప్రవీణ్ భాయి తొగాడియా చేతుల మీదుగా ప్రారంభం
Reviewed by JAGARANA
on
8:53 AM
Rating:
No comments: