నల్గొండ : తిరిగి హిందుత్వాన్ని స్వీకరించిన 34 కుటుంబాలు - సత్యం జి మార్గదర్శనం
నల్గొండ,16/02/2014 : నల్గొండ జిల్లాలో జరిగిన రెండు వేరు వేరు పునరాగమణ కార్యక్రమాలలో గతంలో మతం మారిన 34 కుటుంబాలు తిరిగి తమ మాతృజీవన స్రవంతి అయిన హిందూ ధర్మాన్ని స్వీకరించాయి. ఈ నెల 13 న చందం పేట్ లో జరిగిన కార్యక్రమం లో నాలుగు కుటుంబాలు, 14 న జరిగిన కార్యక్రమం లో 30 కుటుంబాలు పునరాగమణ పాల్గొన్నాయి.
ఈ రెండు కార్యక్రమాల్లోనూ మాన్య శ్రీ గుమ్మాల సత్యం గారు విశ్వ హిందూ పరిషద్ జాతీయ కార్యదర్శి మార్గదర్శనం చేస్తూ ' హిందుత్వం నరుడిని నారాయణునితో ప్రత్యక్షంగా మార్గదర్శనం చేయించే దర్మం, పరోపకారార్థ మిదం శరీరం అంటూ పరుల సేవలోనే తన ఆనందాన్ని వెతుక్కో అని తెలిపే దర్మం కేవలం హిందుత్వం, ఏ రూపంలో నీవు భగవంతుడుని పూజించినా నీకు మోక్షం లభిస్తుంది అని చెపుతూ ప్రకృతిలోని ప్రతిదానిలో భగవంతుడుని చూడగలిగే ఏకైక దర్మం హిందుత్వం, ఇలాంటి ధర్మం లో ఆ భగవంతుడు మనలని జన్మ ఇవ్వడం మనం ఏ జన్మ లో చేసుకున్న సుక్రుతమో , స్వామి వివేకుని మార్గదర్శనం లో సోదరి నివేదితగా మరీన మర్గానేట్ నోబుల్ లాంటి వారితో పాటు అనేక మంది విదేశీయులు కనీసం వచ్చే జన్మలోనైనా ఈ పుణ్యభూమి భారత్ లో హిందువుగా జన్మించాలనే ఉద్ద్యేశంతో తమ తుది శ్వాస ను ఇక్కడే విడవాలని కలలు కంటూ ఉంటారు, అలాంటి దర్మం లో పుట్టిన మనం అనేక ప్రలోబాలకు లోనై విదేశీ మతాలలోకి మారినా తిరిగి తాము కోల్పోయిన అమ్మ ప్రేమను వెతుక్కుంటూ తిరిగి రావడం ఏంతో ఆనందంగా ఉంది, మీ అందరి స్పూర్తితో మతం మారిన మన సహోదరులకు తిరిగి అమ్మ ప్రేమ చూపెడదాం' అని అన్నారు.
యజ్ఞ కార్యక్రమము ద్వార జరిగిన పునరాగమణ తర్వాత సాముహిక బోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది, అందరికి శ్రీ రాముని చిత్ర పటాలు బహుమతిగా ఇవ్వబడ్డాయి.
నల్గొండ : తిరిగి హిందుత్వాన్ని స్వీకరించిన 34 కుటుంబాలు - సత్యం జి మార్గదర్శనం
Reviewed by JAGARANA
on
9:21 AM
Rating:
No comments: