Top Ad unit 728 × 90

వార్తా హైందవం

recent

భాగ్యనగర్ : సామాన్యులకు ఉచిత మెరుగైన వైద్యం ఒక్క ఫోన్ కాల్ దూరంలో 'ధన్వంతరి హెల్త్ సెల్' ప్రారంభించిన ప్రవీణ్ భాయి తొగాడియా

భాగ్యనగర్ , 16/02/2014 : దేశం లోని పేదలు, అభాగ్యుల ల వైద్య అవసరాలను తీర్చే ' ధన్వంతరి హెల్త్ సెల్ ' - ఇండియా హెల్త్ లైన్ నేడు మాన్య శ్రీ ప్రవీణ్ భాయి తొగాడియా (వి హెచ్ పి అంతర్జాతీయ కార్యద్యక్షులు ) చే హైదరాబాద్ లో ప్రారంబించబడినది . ఇక పై దేశం లోని ఏమూల నుండైన ఒకే ఒక్క ఫోన్ కాల్ తో పేదలు మెరుగైన వైద్య సహాయం పొందొచ్చు  " 18602333666 " అనే నంబర్ ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుంది. దేశం లోని ప్రముఖ ఆసుపత్రులను, వైద్యులను, పాథాలజీ ల్యాబ్ లను ఈ నెట్వర్క్ తో అనుసందానం చేస్తూ జరిగిన బృహత్తర ప్రయత్నం ఇండియా హెల్త్ లైన్ లా రూపుదిద్దుకుంది.
ఈ కార్యక్రమ ప్రారంభంలో మాన్య ప్రవీణ్ భాయి తొగాడియ మాట్లాడుతూ ' చాలా వరకు ప్రాథమిక వ్యాది నిర్దారణ అనతరం ఆ వ్యాధికి చెందిన నిపుణుడైన వైద్యున్ని సంప్రదించకపోవడమే అనేక సార్లు వ్యాది నయం కాకపోవడానికి కారణం అవుతుంది, ఈ కాలంలో పెరిగిపోయిన వైద్య ఖర్చులు, పేదరికం , వ్యాది తీవ్రత పై సరైన అవగాహణ లేకపోవడం వంటి కారణాలు మృత్యువుకు దారి తీస్తున్నాయి, వైద్య ఖర్చులు ఎక్కువగా ఉండటం మూలాన అనేక మంది వ్యాది పట్ల నిర్లక్ష్యం వహిస్తూ ఉన్నారు, ఇదీ వ్యాది ప్రభావాన్ని మరింతంగా పెంచుతుంది, ఆ వైద్య ఖర్చుల కోసం  ఎక్కువ గంటలు, రోజులు పని చేయడం తద్వారా మరితంగా ఆరోగ్యం క్షీణించడం జరుగుతుంది, ఇదీ వ్యాదిగ్రస్తుడి కుటుంబం పై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది, భారత దేశం లోని బీద, మధ్య తరగతి, ఉన్నత మధ్య తరగతి ప్రజలు ఈ సమస్య మూలాన అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, సామాన్యులకు మంచి వైద్యం అందే క్రమంలో ఉన్న ఈ రుగ్మతలను దూరం చేయడానికే " ధన్వంతరి సెల్ - ఇండియా హెల్త్ లైన్ " ను ప్రారంబించడం జరిగింది, ఈ దేశం లోని వైద్యులు ఎంతో సేవా గుణం కలిగిన వారు సంపూర్ణ ఆరోగ్య భారతం సాదించే కలలో వారు ముఖ్యమైన భాగస్వామ్యలు , ధన్వంతరి సెల్ - ఇండియా హెల్త్ లైన్ అలాంటి వారికి ఒక మంచి వేదికను ఏర్పర్చుతుంది. ఇప్పటికే జాతీయ స్థాయిలో ప్రముఖ కాన్సర్ సర్జన్ లు , న్యూరో సర్జన్ లు , గుండె వైద్య నిపుణులు, స్త్రీ వైద్య నిపుణులు, ముత్ర పిండ వైద్య నిపుణులు, నేఫ్రలజిస్ట్ లు, లతో పాటు అనేక మంది వైద్య నిపుణులు   ఇండియా హెల్త్ లైన్ తో కలసి పనిచేయడానికి సిద్ద పడ్డారు, వీరు ఇండియా హెల్త్ లైన్ కార్యకర్తల ద్వారా తెలుపబడిన రోగులకు ఉచిత సలహా , వైద్యం అందిస్తారు. అనేక పాథాలజీ సెంటర్ లు , ఎక్ష్ - రే / ఎం ఆర్ ఐ సెంటర్లు , మందుల దుకాణాలు, రక్త నిధి బ్యాంకులు పేదవానికి వైద్య సహాయం అందిచే ఈ దేశ భక్త ' ధన్వంతరి సెల్ - ఇండియా హెల్త్ లైన్ ' పనిలో అధిక సంఖ్య లో భాగస్వామ్యం అయ్యాయి' అని అన్నారు,
సంపూర్ణ ఆరోగ్యం తో నిండిన భారతాన్ని నిర్మించడానికి ఏర్పాటైన ' ధన్వంతరి సెల్ - ఇండియా హెల్త్ లైన్ ' తో భారి సంఖ్యలో వైద్యులు , వైద్య సేవలు అందిచే రంగాలు కలసి పేదవానికి, అభాగ్యునికి మెరుగైన వైద్యం అందిచే ఈశ్వరీయ కార్యంలో చేతులు కలపాలని ప్రవీణ్ భాయి తొగాడియ విజ్ఞప్తి చేసారు .
ఈ కార్యక్రమంలో వి హెచ్ ఫై అంతర్జాతీయ అధ్యక్షులు మాన్య శ్రీ రాఘవ రెడ్డి గారు, ఇండియా హెల్త్ లైన్ జాతీయ సలహాదారులు శ్రీ DR జితేంద్ర పటేల్ గారు, DR గిరీష్ కుమార్ సింగ్ గారు, IHL జాతీయ అధ్యక్షులు శ్రీ ప్రవీణ్ తొగాడియ గారు, ఆంధ్ర ప్రదేశ్ అద్యక్షులు శ్రీ DR మాణిక్యాచారి గారు, DR ఎన్ అప్పా రావు గారు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అధ్యక్షులు, DR ఎం యాదగిరి గారు కార్యదర్శి ఆంద్ర ప్రదేశ్ గారు, ఎం రామ రాజు ప్రాంత అద్యక్షులు విహిప గారు, తదితరులు పాల్గొన్నారు.
భాగ్యనగర్ : సామాన్యులకు ఉచిత మెరుగైన వైద్యం ఒక్క ఫోన్ కాల్ దూరంలో 'ధన్వంతరి హెల్త్ సెల్' ప్రారంభించిన ప్రవీణ్ భాయి తొగాడియా Reviewed by JAGARANA on 7:06 PM Rating: 5

No comments:

All Rights Reserved by రాష్ట్ర చేతన © 2015 - 2016
Designed by JOJOThemes

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.