ప్రత్యేక వ్యాసం : జిహాది ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపాలి
- గౌరుగారి గంగాధరరెడ్డి
ఫైల్ ఫోటో : ముంబై పై ముష్కరుల దాడి |
ఈనాడు ప్రపంచంలో ఏదో ఒక మూల ఉగ్రవాద నీడ పడుతూనే వుంది. ఎందరో అమాయకులు బలైపోతున్నారు. ఉగ్రవాదులు దాడి జరిపినపుడు మాత్రం యంత్రాంగం మొత్తం అప్రమత్తవౌతుంది. తరువాత కొద్దిరోజులకు షరామామూలే. భారతదేశానికి.. పాక్ జిహాదీ ఉగ్రవాద ముప్పు పొంచి ఉంది. ఈ జిహాదీ ఉగ్రవాదులు ప్రక్కనే పాకిస్తాన్‌లో తయారౌతున్నారని తెలిసినప్పటికీ, మన ప్రభుత్వాలు కిమ్మనకపోవడం బాధాకరమైన విషయం.
గతంలోనికి ఒక్కసారి తొంగి చూస్తే ముస్లింల పరిపాలనా కాలంలో ఎన్నో హిందూ దేవాలయాలు ధ్వంసమైపోయాయ. కొన్నింటికి ఆనవాళ్ళు లేకుండా చేశారు. అంతటి విపత్కర పరిస్థితి ఉన్నప్పటికీ ఆనాటి హిందూ సమాజం సర్దుకుపోయింది. అన్నింటినీ ఆదరించి చేరదీసే విశాల దృక్పథం కలిగినది హిందూ ధర్మం. అటువంటి విశాల దృక్పథం ఉన్న కారణంగా బలవంతంగా మతం మార్పించి, పూర్తిగా సంస్కృతీ వినాశనానికి పాల్పడ్డారు. పరిశోధనల ప్రకారం ఈనాటి సయ్యద్ వంశీయులు అందరూ ఒకానొకప్పుడు నిష్ఠగల బ్రాహ్మణులు. ఈ భారతదేశంలో జీవిస్తున్న వారంతా ముస్లిములు కావచ్చు, క్రైస్తవులు కావచ్చు, ఎవరైనా కావచ్చు డి.ఎన్.ఎ ప్రకారం అంతా హిందువులే అని అర్థం చేసుకోవాలి. ఈ దేశంలోని ముస్లిములు బాబర్, గజనీ వారసులు కాదు అని తెలుసుకోవాలి.
దిల్‌సుఖ్‌నగర్ బాంబు పేలుళ్లు జరిగిన సమయంలో అనుమానితులుగా భావించినవారిని ఇంటరాగేట్ చేసిన సమయంలో బుద్ధగయలో కూడా రెక్కీ నిర్వహించామని చెప్పారు. వారు చెప్పిన కొన్ని నెలలకే బాంబు పేలుళ్లు జరగడం గమనార్హం. ప్రపంచానికి బుద్ధుడు శాంతిని బోధించిన పరమ పవిత్ర స్థలంలో ఇటువంటి హింసాత్మక సంఘటనలు చోటుచేసుకోవడం చాలా బాధాకరం.ఇస్లాం అంటే శాంతిని ప్రబోధిస్తుందని చెబుతుంటారు. అందరినీ ప్రేమించాలి అని చెబుతుంటారు. ప్రపంచాన్ని అశాంతికి గురిచేయటమేనా ఇస్లాం లక్ష్యం? ఉగ్రవాద చర్యలు జరుగుతున్నప్పటికీ ఇస్లాం మత పెద్దలు ఏమాత్రం ఖండించకపోవడం చాలా బాధాకరం.
ఉగ్రవాదానికి మూలాన్ని అనే్వషించాలి. జిహాదీ ఉగ్రవాదులకు మూలాన్ని, వారి లక్ష్యాలను ఛేదించాలి. వారికి ఆసరా కల్పించే శక్తులను ఎంతటివారినైనా ఏరివేయాలి. ఉగ్రవాదులు పట్టుబడినపుడు వారిని వెంటనే ఉరితీయాలి. కఠినమైన శిక్షను అమలుపరచాలి.
కొద్దిమంది రాజకీయ నాయకులు తమ స్వార్థపు రాజకీయాల కొరకు ఇటువంటి శక్తులను ఎవరికీ కనబడకుండా పెంచి పోషిస్తుంటారు. అటువంటి శక్తులను గుర్తించి, వారిని పూర్తిగా వెలివేయాలి. యువత దారి తప్పకుండా దేశభక్తిమీద అవగాహన కల్పించాలి. ఇది అందరి కర్తవ్యం. గతంలో అనేకమార్లు ఉగ్రవాదులు పంజా విసిరి పట్టుబడ్డప్పటికీ, సరైన శిక్షలు పడకపోవడంవల్ల బయటికి వచ్చి అదే పనిని మళ్ళీ చేస్తున్నారు. ఇది అంతా ఒక పథకం ప్రకారం జరుగుతూ ఉంది. దీనిని పోలీసు యంత్రాంగం కూడా అంగీకరించింది.
అమెరికా ఆనాడు వారి దేశంమీద ఉగ్రవాద దాడి జరిగినపుడు ఎటువంటి చర్య తీసుకుందో, వెంటనే అటువంటి చర్యను తీసికోవలసిన అవసరం వుంది. ఎందుకంటే, మనలను మనం కాపాడుకోవటం అవసరం. అందుకోసం ఉగ్రవాద ముష్కరులకు గట్టిగా బుద్ధి చెప్పాలి. భారత సైనకుల సాహసాలు చాలా గొప్పవి. మనకున్నటువంటి సాంకేతిక పరిజ్ఞానం చాలా గొప్పది. మన మేధస్సు ఎవరికీ తలవంచదు. ఈ విషయం మన ప్రక్కనే ఉన్న చైనాకు కూడా తెలుసు. వాస్తవానికి మనం ఎంతో శక్తివంతులమైనప్పటికీ, పాకిస్తాన్‌లు అప్పుడప్పుడు నియమాలను ఉల్లంఘించి కవ్వింపు చర్యలు పాల్పడుతున్నప్పటికీ, వౌనంగా ఉండిపోతున్నాం. అందుకే అవి మళ్ళీ మళ్ళీ ఇటువంటి కార్యకలాపాలకు పాల్పడుతున్నాయ.
నేపాల్‌ను కూడా మన నుంచి దూరంగా చేసేందుకు చైనా ప్రయత్నం చేస్తున్నది. మన దేశంలోని వస్తు ఉత్పత్తిని దెబ్బతీసేందుకు కూడా చైనా ఒక పథకం ప్రకారం ప్రయత్నం చేస్తున్నది. మొత్తం మన వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేయడానికి చైనా వ్యూహాత్మకంగా వ్యవహరి స్తోంది. కాబట్టి మన భారతీయులు చైనా వస్తువులు కొనకుండా అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
సమీప భవిష్యత్తులో ప్రపంచంలో భారత్ శక్తివంతం అవుతుందని తెలుసు. దాన్ని నిరోధించడానికి మన ఆర్థిక వ్యవస్థను ఛిన్నాభిన్నం చేయడానికి చైనా, పాకిస్తాన్‌లు శాయశక్తులా ప్రయత్నాలు చేస్తున్నాయ. ఇటువంటివి జరుగకుండా ఉండాలంటే ముందు సరిహద్దులను అప్రమత్తం చేయాలి. దేశ సరిహద్దు గ్రామాలలోను, పట్టణాలలోని యువత పక్కదారి పట్టకుండా అక్కడి సమాజాన్ని శక్తివంతం చేయాలి. అక్కడ దేశభక్తిని నిర్మాణం చేయాలి. అప్పుడే మనం ఆశించిన ఫలితాన్ని పొందగలం.
అన్ని రాజకీయ పార్టీలవారు ఓటు బ్యాంకు రాజకీయాల కొరకు కాకుండా దేశ హితం కొరకు ఆలోచించాలి. ఉగ్రవాదులు పట్టుబడినపుడు వెంటనే ఉగ్రవాదులకు ప్రత్యేక న్యాయస్థానం ద్వారా ఉరిశిక్ష పటేటట్లు చేయాలి. సరైన సమయంలో శిక్షలు పడని కారణంగా, జాప్యం జరుగుతున్న కారణంగా వారు తప్పించుకుంటున్నారు. కఠినమైన శిక్షలు అమలుకానంతవరకు ఇటువంటివి పునరావృతం అవుతుంటాయి. ఎందరో అమాయకులు ఈ శక్తులకు బలవుతుంటారు. అందువల్ల మనదేశం ఉదార విధానాలను విడనాడి కఠిన నిర్ణయాలు తీసుకోవడం చాలా అవసరం.
మూలం : ఆంధ్రభూమి
ప్రత్యేక వ్యాసం : జిహాది ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపాలి
Reviewed by JAGARANA
on
8:45 AM
Rating:
No comments: