సగటు పౌరుడు దేశ భక్తుడైనప్పుడే భారత్ కు పరమ వైభవ స్థితి : సంకల్ప్ మహా శిభిర్ ముగింపు లో మోహన్ భగవత్
సంకల్ప్ మహా శిభిర్, జబల్ పూర్ , 05/01/2014 : మహా కోషాల్ ప్రాంత ' సంకల్ప్ మహా శిభిర్ - 2014 ' సమారొహ్ (ముగింపు) , సార్వజనికోత్సవం 05/01/2014 నాడు జబల్ పూర్ లో జరిగింది , కదం కదం కలుపుతూ లక్ష ను పైగా పూర్ణ గణ వేషధారి స్వయం సేవకుల చేసిన పద సంచలన్ పూర్తీ కార్యక్రమానికే ద్రువతార లా మిలిగింది, ఈ సంచలన్ అశేష వీక్షకులకు ఒక అద్భుత అనుభవాన్ని మిగిలించింది.
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సర్ సంఘచాలక్ మాన్య శ్రీ మోహన్ భగవత్ (RSS చీఫ్) మాట్లాడుతూ ' ప్రపంచంలో ఉన్నతి సాధించిన ఎ దేశ చరిత్ర చూసిన మనకు తెలిసే సాధారణ విషయం ఆ దేశ సగటు పౌరుడు దేశ భక్తుడుగా ఉంటూ దేశ అభ్యున్నతికి తోడ్పడడమే, మన దేశంలో కూడా ఇలాంటి సగటు పౌరుడు దేశ భక్తుడుగా ఉన్న సమయంలో మన దేశం ప్రపంచానికి మార్గదర్శం చేసింది, కాని సమాజం లో స్వార్ధం పెరిగిపోయి, జాతీయ శీలం మంటగలసి, సగటు దేశ పౌరునిలో దేశ భక్తీ నశించిన సమయం లో పరమ పూజ్య డాక్టర్ కేశవ్ రావ్ బలిరాం పంత్ హెడ్గెవార్ స్థాపించిన రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ దేశం లోని సగటు పౌరునిలో దేశ భక్తిని నింపే మహాకార్యం గత 88 సంవత్సరాలుగా చేస్తూనే ఉంది ఆ మహత్తర కృషి యొక్క ప్రతి ఫలమే నేడు మన ముందు కనిపిస్తుంది' అని అన్నారు.
మూలం : www.newsbharati.com
సగటు పౌరుడు దేశ భక్తుడైనప్పుడే భారత్ కు పరమ వైభవ స్థితి : సంకల్ప్ మహా శిభిర్ ముగింపు లో మోహన్ భగవత్
Reviewed by JAGARANA
on
10:26 AM
Rating:
మీ వ్యాసాలకు లేదా ప్రకటనలకు శీర్షికలు తగ్గించి పెట్టండి, ఇతర బ్లాగుల శీర్షికలు కనపడకుండా మీరు ఎక్కువ లైన్లు ఆక్రమిస్తే, ఇతర బ్లాగులు డిస్ప్లే ఏరియా నుంచి కనపడకుండా కిందికి వెళ్ళిపోతున్నాయి. గమనించగలరు.
ReplyDelete