డిల్లి: కాశ్మీర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన ప్రశాంత్ భూషణ్ ను వెంటనే అరెస్టు చేయాలి : భజరంగ్ దళ్
క్రొత్త డిల్లి 08/01/2014 : భజరంగ్ దళ్ డిల్లి శాఖా అధ్వర్యంలో డిల్లిలోని జంతర్ మంతర్ వద్ద కాశ్మీర్ పై అం ఆద్మీ పార్టి నేత ప్రశాంత్ భూషణ్ అనుచిత , వివాదాస్పద , దేశ సార్వభౌమత్వనికి ఆటంకం కలిగించే వ్యాఖ్యలకు నిరసనగా భారి ఎత్తున ధర్నా, నిరసన ప్రదర్శన నిర్వహించడం జరిగింది.
నిరసన కార్యక్రమంలో ప్రసంగిస్తున్న శ్రీ శివ కుమార్ |
ఈ నిరసన కార్యక్రమానికి నాయకత్వం వహించిన శ్రీ శివ కుమార్ గారు మాట్లాడుతూ ' భారత దేశానికి మకుటాయమానం అయిన జమ్మూ కాశ్మీర్ ను రక్షించడం ప్రతీ భారతీయుని యొక్క పరమ కర్తవ్యం , ఎవరైనా ఈ విషయం లో అనుచితంగా వ్యవహరిస్తే వారికి ఈ దేశంలో ఉండే హక్కు లేదు, కాశ్మీర్ పై ఈ విధమైన ప్రశ్నను లేవనెత్తడం అంటే అది దేశ సార్వభౌమాధికారాన్ని దిక్కరించడమే అవుతుంది , ఈ విధమైన దుస్సాహసానికి ఒడిగట్టిన అం ఆద్మీ పార్టి నేత ప్రశాంత్ భూషణ్ ను వెంటనే అరెస్టు చేయాలి, లేని యడల తర్వాత జరిగే పరిణామాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి వస్తుంది ' అని అన్నారు
డిల్లి: కాశ్మీర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన ప్రశాంత్ భూషణ్ ను వెంటనే అరెస్టు చేయాలి : భజరంగ్ దళ్
Reviewed by JAGARANA
on
9:47 AM
Rating:
No comments: