స్వామి వివేకుని మాటే - సంఘం బాట - కల్పగూరు శాఖా వార్షికోత్సవంలో శ్రీ నల్లాన్ చక్రవర్తుల రామకృష్ణ
Reported By: శ్రీ ఎడ్ల సురేందర్ రెడ్డి ( పటాన్ చేరు గ్రామిణం ) - రాష్ట్ర చేతన ప్రతినిధి
![]() |
వక్త మార్గదర్శన దృశ్యం |
పటాన్ చేరు గ్రామిణం , 02-Mar-2013 , : పాటన్ చేరు గ్రామీణ ఖండ పల్పగూరు శాఖా వర్స్గికోత్సవం తేది 02-Mar-2013 సాయ్నత్రం 6:00 గంటలకి ప్రభుత్వ పాటశాల ఆవరణలో నిర్వహించబడినది , ముందుగా గ్రామంలో ఘోష్స్వ ఘణతో కూడిన స్వయంసేవకుల పథ సంచలన్ గ్రామస్తులను విశేషంగా ఆకర్షించడం జరిగింది , ఈ కార్యక్రంలో లో 40 మంది గణవేశదారి స్వయంసేవకులు మరియు దాదాపు 100 మంది గ్రామస్తులు పాల్గొన్నారు , ప్రారంభంలో స్వయం సేవకులు దండ మరియు సాముహిక సూర్య నమస్కారాలు ప్రదర్శించారు ,
శ్రీ వెంకన్న గారు శాఖా వార్షిక నివేదిక మరియు శాఖా కేంద్రంగా జరిగితున్న సేవ ప్రకల్పాలను వివరించారు , ముఖ్య అదితి గా పాల్గొన్న శ్రీ జనుముల రాములు గారు మాట్లాడుతూ ప్రక్రుతి వైపరీత్యాల సమయంలో , దేశ ఆంతరంగిక భద్రతా ఇత్యాది విషయాలలో సంఘం, స్వయం సేవకులు స్పందించే తీరు అనన్యసామాన్యం అని అన్నారు ,
కార్యక్రమ ప్రధాన వక్త శ్రీ నల్లాన్ చక్రవర్తుల రామకృష్ణ ( జిల్లా సంఘ్ చాలక్ ) మార్గనిర్దేశం చేస్తూ స్వామీ వివేకానందుని మాటే రాష్ట్రీయ స్వయం సేవక సంఘం బాట అని , ఆయన స్పూర్తితో సంఘ స్వయంసేవకులు దేశ వ్యాప్తంగా లక్షలాది సేవ ప్రకల్పాలలో నిమగ్నమై దారిద్ర నారయడున్ని కొలుస్తున్నారు , చిన్న చిన్న అంశాల ద్వారా సంఘం లో నిర్మితమైన స్వయంసేవకులు వివిధ రంగాలలో వివిధ రూపాలలో పనిచేస్తూ భారతాంభిక పునర్వైభవ ప్రాప్తి కై అహర్నిశలు కృషి చేస్తున్నారని మన తల్లి తిరిగి విశ్వ గురువుగా విరసిల్లె రోజు ఎంతో దూరంలో లేదని దానికై మనం మరింత తీవ్రంగా కృషి చేయాలని పిలుపునిచ్చారు ,
ఈ కార్యక్రమంలో శ్రీ కృష్ణ జిల్లా శారిరాక్ ప్రాముఖ్ , శ్రీ నర్సింలు సంగారెడ్డి నగర కార్యవాహ , శ్రీ శేకర్ సంగారెడ్డి నగర సహా కార్యవాహ , మరియు గ్రామ పెద్దలు పాల్గొన్నారు .
స్వామి వివేకుని మాటే - సంఘం బాట - కల్పగూరు శాఖా వార్షికోత్సవంలో శ్రీ నల్లాన్ చక్రవర్తుల రామకృష్ణ
Reviewed by JAGARANA
on
10:26 AM
Rating:

nice effective varshikostav .... we also planning to do some more varsikostavs !
ReplyDelete