Top Ad unit 728 × 90

వార్తా హైందవం

recent

యువతరానికి స్ఫూర్తి... చైతన్య దీప్తి by జయసింహ శర్మ చతుర్వేది


ఒక ఆశయాన్ని ఎంచుకోండి! ఆ ఆశయాన్ని మీ జీవితంగా మార్చుకోండి! దాన్ని గురించే ఆలోచించండి! దాన్ని గురించే కలగనండి! దాని కోసం బతకండి! మీ మెదడు, కండరాలు, నరాలు, శరీరంలోని ప్రతీ అవయవం.. దానితోనే నిండిపోనీయం డి! మిగతా అన్ని ఆశయాల్ని పక్కకు పెట్టేయండి! విజయానికి ఇదే మార్గం....‘విజయ రహస్యం అన్నాడు వివేకానందుడు. అతని జయంతే ..భారతదేశ యువజన దినోత్సవం.కోట్లాదిమంది భారతీయుల్ని దేశసేవకు ప్రేరేపించిన వివేకానందుడు..అమెరికా మొదలు ఇంగ్లాండు వరకూ దేశదేశాలు పర్యటించి ఆయన సుదీర్ఘ కాలం తరువాత మాతృదేశాన్ని చూసి పులకించిపోయాడు! వివేకానందుడు కనిపించని దేవుడి గురించి మాట్లాడలేదు. ఉందో లేదో తెలియని స్వర్గం గురించి చెప్పలేదు. దరిద్ర నారాయణుల గురించి బోధించాడు! దుర్భరస్థితిలో ఉన్న మాతృభూమి శోకాన్ని పొగొట్టమని ప్రబోధించాడు! సాటి భారతీయుల ఆకలి మంటలు చల్లారనంత వరకు.. మనకు మోక్షమెక్కడిదని ప్రశ్నించాడు? ఇదే సామాన్యుల్ని కాదు.. మాన్యుల్ని సైతం స్వాతంత్య్ర సంగ్రామ కురుక్షేవూతంలోకి దూకించింది!


బాలాగంగాధర్ తిలక్, రవీంవూదనాథ్ ఠాగూర్ లాంటి మేధావులే పాదాభివందనాలు చేసిన ఈ ప్రేరణాత్మక ఆధ్యాత్మిక అద్భుతం, కోల్‌కతా నగరంలో జన్మించాడు. సరిగ్గా ఒకటిన్నర శతాబ్దం కింద 1863 జనవరి12న అప్పటి విశ్వనాథ్ దత్తా, భువనేశ్వరీదేవిలకు నరేంవూదనాథ్ దత్తాగా పుట్టాడు. కేవలం భక్తి పారవశ్యమే కాదు.. వివేకానందుడ్ని మిగతా సాధు, సన్యాసులకు భిన్నంగా నిల్చుండబెట్టగలిగే సామాజిక స్పృహ కూడా చిన్ననాటి నుంచే ఉన్నది. అతనిలో అప్పట్లో ధనికుల ఇళ్లల్లో వేరు వేరు హుక్కాలు ఉండటం పరిపాటి. నరేంవూదుని ఇంట్లో కూడా అగ్రకులాల వారికి, తక్కువ కులాల వారి కి, ముస్లింలకు వేరు వేరు హుక్కాలుండేవి! ఓ రోజూ అన్నీ పీల్చి చూసిన ఆయన తండ్రితో అన్ని హుక్కాలూ ఒకేలా ఉన్నాయన్నాడు! ఏది పీల్చినా తన కులం చెక్కుచెదరలేదన్నాడు. సహజంగానే అత్యున్నతస్థాయి మేధస్సు కలిగిన ఆయనకు పుస్తకాల చదువు పెద్దగా ఇబ్బంది కాలేదు! కానీ, ఇంగ్లిషు విద్య వల్ల మస్తిష్కం పదును దేరింది. దాంట్లోని ఆలోచనలు అతడి నమ్మకాల్ని మొదళ్ల తో సహా పెకిలించాయి. దేన్నీ విశ్వసించలేని స్థితి ఏర్పడింది. అప్పుడే సంప్రదాయ హిందుత్వాన్ని వ్యతిరేకించిన బ్రహ్మ సమాజ్ ఎదురైంది! రాజా రామోహన్‌రాయ్ ప్రారంభించిన ఈ ఉద్యమం వివేకవంతుడైన నరేంవూదుని ఆకర్షించింది. విగ్రహారాధన నిరసించి సమాజ సేవ చేయటం ఎంతో కొంత సబబుగా తోచింది. బ్రహ్మ సమాజ్‌లో చేరాడుబహ్మ సమాజ్‌లో కొనసాగినప్పటికీ నరేంవూదుని అసంతృప్తి సద్దుమణగలేదు. 


Click On Iamge to Enlorge
పురాణాలు, ఉపనిషత్తులు, అన్నీ చెబుతున్న సత్యం నేరుగా తెలుసుకోవాలి. దేవుడు, దేవుడన్న వాడు ఎలా ఉంటాడు? కేవలం మాటలు కాదు, సాక్షాత్తుగా దర్శించిన వాడు తనకిప్పుడు కావాలి. ఇదీ నరేన్‌లోని తాపవూతయం. బ్రహ్మ సమాజ్‌లోని అనేకమంది మేధావులైన వారి ఉపన్యాసాలు విన్నా కూడా యువ నరేంవూదుని మనస్సు శాంతించేది కాదు. పైగా అంతకంతకూ మతం, దేవుడి పట్ల అనుమానాలు పెరుగుతుండేవి. ఇంతకీ దేవుడున్నాడా? ఈ ప్రశ్న రోజుల తరబడి నరేంవూదుని వేధించింది. కాని చివరగా, అతడి ప్రశ్నలన్నిటికి సమాధానం లాంటి పేరు చెవిన పడనే పడింది అదే రామకృష్ణ పరమహంస! గంగా నది ఒడ్డున ఉండే దక్షిణేశ్వరంలో ఓ కాళికా ఆలయం. ఆ తల్లిని భక్తితో పూజించే ఓ పుజారి అతనే రామకృష్ణ మొదట నరేంవూదనాథ్ కూడా ఇలాగే అనుకున్నాడు. మామూలుగా దేవాలయ అర్చకుడి వద్దకు వెళ్ళటమా అని సందేహించాడు. కాని, బంధువైన రామచంద్ర దత్తా ఒత్తిడి మేరకు దక్షిణేశ్వరం బయలుదేరాడు. కాళికా మాత దయతో గురు శిష్యుల సంగమం జరిగింది. కాని ఈ అలౌకిక ఆధ్యాత్మిక అనుభవం వారిద్దరి మధ్య సంబంధాన్ని శాశ్వతంగా మార్చేసింది.


‘నేను మళ్లీ మళ్లీ పుట్టినా సరే.. వేలాది దుఃఖాల్ని అనుభవించినా సరే.. నేను మాత్రం ఏ ఒక్క దేవుడైతే నిజంగా ఉన్నాడో.. అతడ్నే ఆరాధిస్తాను. ఆ ఒక్క దేవుడ్నే విశ్వసిస్తాను. అతను ఆత్మలన్నీ ఏకమైన పరమాత్మ! ఆ భగవంతుడు. దుష్టుడు! ఆ భగవంతుడు, దుఃఖితుడు! ఆ భగవంతుడు, అన్ని తెగలు, జాతుల్లోని పేదవాడు! అతనే నా ప్రత్యేక ఆరాధ్య వస్తువు’ ఇలాంటి ధీరమైన పలుకులు స్వామి వివేకానంద పలకటానికి కారణం.. రామకృష్ణుని బోధనలే... మెల్ల మెల్లగా గురు పాదాలకు పూర్ణాంకితుడైన నరేంవూదుడు నిజమైన జ్ఞానాన్ని సముపార్జించాడు. కేవలం ముక్కు మూసుకుని తపస్సులు చేయటాలు, సమాజాన్ని వదిలేసి కొండల్లోకి, గుహల్లోకి వెళ్లిపోవటాలు మతం లక్ష్యం కాదని రామకృష్ణ బోధించారు. మానవసేవే మాధవసేవ అని. మతమంటే ప్రత్యేక్షంగా అనుభూతి చెందేదే తప్ప.. ఒట్టి మాటలు కావని చెప్పారు.యావత్ ప్రపంచానికి ఆధ్యాత్మిక భిక్ష పెట్టగల భారతదేశం. 



స్వామిజీ కాలంలో భౌతిక దారివూద్యంతో తల్లడిల్లింది. అందుకే, ధన, ధాన్య,ఐశ్వర్యాలతో తులతూగుతున్న పాశ్చాత్య ప్రపంచం వేపు అడుగులు వేయాలని ఆయన నిర్ణయించుకున్నాడు. అక్కడి వారికి అలౌకిక సనాతన జ్ఞానాన్ని పంచి భారతీయుల కోసం లౌకిక సాయాన్ని అభ్యర్థించాలనుకున్నాడు. 1893 మే 31న ఈ తొలి భారతదేశ ఆధ్యాత్మిక రాయబారి నౌకనెక్కి పశ్చిమ దిశగా సాగిపోయాడు. ఇక్కడ్నుంచే నరేంవూదుడు వివేకానందుడుగా అవతరించాడు. 



జపాన్ పారిక్షిశామిక ప్రగతిని ప్రత్యక్షంగా దర్శించిన స్వామిజీ అమెరికాకు సాగిపోయాడు. ఎప్పుడు భారత్ జపాన్‌లా ఐశ్వర్యంతో కళకళలాడుతుందని తల్లడిల్లిపోయాడు. చేతిలో పెద్దగా డాలర్లు లేకుండా చికాగోలో దిగిన ఈ భారతీయ సన్యాసి..అనేక ఇబ్బందు లు పడ్డాడు. పూట గడవటం, గూడు దొరకటం గగనమైంది. అయి నా గురుదేవుల కృపా, కటాక్షాలతో మిస్ కేట్ అనే ఓ స్త్రీ మూర్తి ఇంట్లో ఆశ్రయం పొందారు. హార్వర్డ్ యూనివర్సిటీ ప్రొఫెసర్ జాన్ హెన్రీ రైట్ స్వామిజీకి సిఫారసు లెటర్ ఇచ్చారు. ‘పార్లమెంట్ ఆఫ్ రిలీజియన్స్’ సభలో పాల్గొనెందుకు ఉద్దేశించిన ఆ ఉత్తరం.. నిజానికి సిఫారసు కానేకాదు. 




ఓ నిజమైన అమెరికన్ స్వచ్ఛమైన స్పందన ‘ ఈ జ్ఞానవంతుడు మన జ్ఞానవంతులందరికంటే ఎక్కువ జ్ఞానవంతుడు. ఇదీ ప్రొఫెసర్ రైట్ అభివూపాయం.వివేకానందుని అలౌకిక ఆధ్యాత్మిక ప్రభావం కేవలం ప్రొఫెసర్ రైట్‌తోనే ఆగిపోలేదు.1893 సెప్టెంబర్11న యావత్ అమెరికాను కమ్మేసింది. ఆరోజు పార్లమెంట్ ఆఫ్ రిలీజియన్స్ మహాసభలో... స్వామిజీ మొత్తం అమెరికాను గెలిచాడు. ఇక్కడే.. ‘సిస్టర్స్ అండ్ బ్రదర్స్ ఆఫ్ అమెరికా’ అన్న తన చారివూతక పదాల్ని ఉచ్చరించాడు. అవీ అక్కడున్న వేలాదిమంది గుండెల్లో ప్రేమపూరిత పాశుపతాలై గుచ్చుకుపోయాయి. కరతాళ ధ్వనులు భరతమాత గుండెల్ని ఉప్పొంగిస్తూ మర్మోగాయి. పాశ్చాత్య ప్రయాణం ముగించుకుని తిరిగొచ్చిన ఆయన ఎంతో కాలం ఆరోగ్యంగా ఉండలేదు. స్వామిజీ 39 సంవత్సరాలకే చని పోయారు. స్వామి వివేకానంద ఊపిరిపోసిన రామకృష్ణ మిషన్ ఉద్యమం ఈనాటికీ కొనసాగుతూనే ఉన్న ది. భారతీయ పల్లెలు, పట్టణాలు, నగరాలు, మహానగరాలే కాదు.. దేశదేశాల భూభాగాల్లోనూ సనాతన ప్రణవ నాదం మార్మోగుతూనే ఉన్నది.యావత్ భారతదేశం యువజన దినోత్సవం జరుపుకునేలా స్వామి వివేకానంద మనకు ఏం ఇచ్చాడు. ఆయన మాటల్లోనే చెప్పుకుంటే.. ‘దేనికీ భయపడకండి! మీరు అద్భుతాలు సృష్టిస్తారు. ఏ క్షణమైతే బెదిరిపోతారో... ఆ మరుక్షణం మీరు దేనికీ పనికిరాకుం డా పోతారు. భయమే ప్రపంచంలో దుఃఖానికి కారణం! భయమే అన్ని మూఢ నమ్మకాల్లో అతి పెద్దది భయమే మన కష్టాలకు కార ణం... ఇక ధైర్యమే స్వర్గాన్నైనా అమాంతం సాధించిపె అందు కే, లేవండి, మేల్కొనండి, గమ్యం చేరేదాకా విశ్రమించకండి!

sorce: Namasthe Telangana
యువతరానికి స్ఫూర్తి... చైతన్య దీప్తి by జయసింహ శర్మ చతుర్వేది Reviewed by JAGARANA on 8:51 AM Rating: 5

No comments:

All Rights Reserved by రాష్ట్ర చేతన © 2015 - 2016
Designed by JOJOThemes

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.