"హిందుత్వమే ఈ జాతి జీవనాధారం" జగిత్యాల్ జిల్లా సిరికొండ శాఖా వార్షికోత్సవంలో శ్రీ డా శంకర్ జిల్లా సంఘ చాలక్
![]() |
డా శంకర్ గారి ప్రసంగం |
జగిత్యాల్ జిల్లా సిరికొండ గ్రామం లో తేది 20.1.2013 న శాఖా వార్షికోత్సవం జరిగింది .
ఇట్టి కార్యక్రమ వివరాలు ఇలా ఉన్నాయి .
- ఇట్టి కార్యక్రమం లో 121 మంది స్వయంసేవకులు పాల్గొన్నారు . అందులో శిశు 9 బాల 30 తరుణ 82 ఉన్నారు . అలాగే మాతలు 35 ఇతరులు 165 మంది పాల్గొన్నారు .
- ఈ కార్యక్రమానికి శ్రీ పోతని ప్రవీణ్ గారు prbm జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ గారు ముఖ్య అథితి గా విచ్చేశారు . అలాగే శ్రీ భీమనాతిని శంకర్ గారు మాన్య జిల్లా సంఘ చాలకులు వక్త గా వచ్చారు అలాగే జిల్లా కార్యవాహ శ్రీ గోనే భూమయ్య గారు వేదిక పై ఉన్నారు .
- ముందుగా గ్రామం లో పథ సంచలన్ జరిగింది . గ్రామం లోని యువజన సంఘాలు అన్నీ కలిసి గ్రామాన్ని ధ్వజాలతో ఫ్లెక్షి లతో మావిడాకులతో అందంగా అలంకరించారు .
- అనంతరం జరిగిన కార్యక్రమం లో ప్రవీణ్ గారు మాట్లాడుతూ ప్రస్తుతం హిందూ సమాజం జరుగుతున్న దాడుల పై ఆవేదన వ్యక్తం చేశారు . సరిహద్దు ల్లో పాక్ హత్యలకు పాల్పడుతున్నా చూస్తూ ఊరుకోవాల్సి వస్తుందన్నారు . ఇదంతా పాలకుల చేతగాని తనం వల్ల వస్తున్నాదని అన్నారు . కావున పాలుకుల విషయం లో ఆలోచించాలని చెప్పారు .
- అనంతరం డా . శంకర్ గారు మాట్లాడుతూ
- ఈ దేశం కు నిజమైన వారసులు హిందువు లె అని అన్నారు . అలాగే ఈ దేశాని కి కష్టం విపత్తు వచ్చినపుడు స్పందించేది బాధ ను వ్యక్తం చేసేది కూడా హిందువులే అని అన్నారు.
- సంఘం లో కుల వర్గ మత బేధాలు ఉండవని అన్నారు .
- శాఖ కార్యం చిన్నదే కాని శాఖ నుండి సంస్కార వంట మైన వ్యక్తులు ప్రకర దేశ భక్తులు నిర్మాణం అవుతారని అన్నారు . వ్యక్తీ నిర్మాణం ద్వారా సంఘం సమాజ నిర్మాణం చేస్తున్నదని తెలిపారు.
- 30 కోట్ల యువత జాగరుకులు అయ్యి ఉంటె దేశ స్థితి గతులే మారుతాయని అన్నారు . పిడికెడు చైతన్య వంతులైన యువకులు కావాలి దేశ తల రాతనే మార్చుతానని వివేకానంద అన్నారని తెలిపారు.
- మూడు అంశాల తో సంఘం పని చేస్తున్నాడని తెలిపారు అవి వ్యక్తీ నిర్మాణం , సంఘటన , వైభవస్థితి .
- కార్యక్రమ అనంతరం కార్యకర్తల ను ఇళ్ళల్లో కలవడం జరిగింది .
- ఈ కార్యక్రమం లో రాసుగంటి సాయి , హరీష్ , కోడిపెల్లి రవి , సృజన్ , గోడికే రవి , జిల్లా బౌద్దిక్ ప్రముఖ్ గోల్కొండ నాగరాజు , జిల్లా శారీరక్ ప్రముఖ్ గుంటుకుల రమేష్ పాల్గొన్నారు .
![]() |
శారీరక ప్రదర్శనలు |
"హిందుత్వమే ఈ జాతి జీవనాధారం" జగిత్యాల్ జిల్లా సిరికొండ శాఖా వార్షికోత్సవంలో శ్రీ డా శంకర్ జిల్లా సంఘ చాలక్
Reviewed by JAGARANA
on
1:04 PM
Rating:

Post Comment
No comments: