Top Ad unit 728 × 90

ఘనంగా నేరెళ్ళ గ్రామ శాఖ ( జగిత్యాల్ జిల్లా ) వార్షికోత్సవం


తేది : 30.12.2012, ఆదివారం రోజున జగిత్యాల్ జిల్లా నేరెళ్ళ గ్రామ భగత్ సింగ్ ప్రభాత్ శాఖ యొక్క వార్షికోత్సవ కార్యక్రమ వివరాలు .
  • కార్యక్రమం సాయంత్రం 4.30 గంటలకు గ్రామం లోని అన్ని వీధుల గుండాపథ సంచలన తో ప్రారంభమయ్యింది.
  • ఇట్టి కార్యక్రమం లో ఘన వేషధారి స్వయన్సేవకులు  మొత్తం 85 మంది పాల్గొన్నారు . ఇందులో 35 బాల 50 మంది తరుణ పాల్గొన్నారు .
  • ప్రధాన వక్త గా శ్రీ అన్నదానం సుబ్రహమణ్యం గారు ప్రాంత  సహకార్యవాహ అలాగే ముఖ్య అథితి గా శ్రీ మాదాసు రమేష్ బాబు విశ్రాంత sp గారు మరియు జిల్లా సంఘ చాలకులు డా . శంకర్ గారు ఉన్నారు .
  • గ్రామం నుండి గ్రామ అభివృద్ధి సమితి మొత్తం పాల్గొనడమే గాక అధ్యక్షులు మరి కొందరు నిక్కర్ల తో పాల్గొన్నారు .
  • గ్రామం నుండి మహిళలు , యువకులు , పెద్దలు , పిల్లలు అధిక సంఖ్యా లో పాల్గొన్నారు . సంఖ్య సుమారు 400
  • గ్రామాన్ని పూర్తిగా కాషాయ ధ్వజా లతో అలంకరించారు . ఈ క్రమం లో గ్రామ యువజన సంఘాలు స్వామి వివేక నంద 150వ జయంతి పురస్కరించుకుని పెద్ద ఎత్తున ఫ్లెక్షి లు కట్టారు. 
  • గ్రామం లోని పాటశాలలు చౌరస్తాల వద్ద విద్యార్థుల ఛే యోగ చాప్ , కోలాటం వేయించి ఆకట్టుకున్నారు .
  • శాఖా నివేదిక  ను జ్యేష్ట కార్యకర్త శ్రీ శ్రీకాంత్ గారు సమర్పించారు. గ్రామం లో పది సంవత్సరాల నుండి శాఖ నడుస్తోంది దీని కారణంగా గ్రామం లో అంటరాని తనం పూర్తీ గా తొలిగిపోయింది . విద్యార్థుల్లో దేశభక్తి పెరిగింది . గ్రామ యువకులు 2 ఇద్దరు సరిహద్దు కో ప్రణాం కు వెళ్లారు . ప్రాథమిక 40 మంది ప్రథమ వర్ష 4 ద్వితీయ 2 అయ్యారని అన్నారు .
  • అన్నదానం గారు మాట్లాడుతూ శాఖ వ్యక్తుల్లో దేశభక్తి ని నింపుతుంది . దేశం లో హిందూ ధర్మం ఉంటేనే దేశం రక్షించబడుతుంది. శాఖా ఆధారంగానే సమాజం లోని మూడాచారాలు దూరమవుతాయని అన్నారు .
  • అనంతరం  ఒక రైతు సంఘ పెద్దలను తన ఇంటికి స్వయంగా ఆహ్వానించితాము పండించిన ధాన్యాలతో వండిన  పదార్థాలు వడ్డింఛి భోజనంచేయించారు  . వారు కాంగ్రెస్ నాయకులు అయినప్పటికి సంఘం మా గ్రామం లోకి వచ్చినప్పటి నుండి మా గ్రామానికి మంచి పేరు వచ్చిందన్నారు .
  • అత్యంత  ఉత్సాహం తో కార్యకర్తలు ఇళ్లల్లోకి వెళ్లారు .ఆనంద భరితంగాకార్యక్రమం నడవడం తో ఆనందానికి అవధులు లేవు .
గ్రామంలో పథ సంచలన్ 

ప్రదర్శనలు 

నియుద్డ 

జగిత్యాల్ నుండి శ్రీ గోల్కొండ నాగరాజు ( రాష్ట్ర చేతన ) 

మీరు మన దగ్గరలో జరిగే సంఘ్ , హిందుత్వ , జాతీయవాద  కార్యక్రమాల వివరాలు rastrachethana@gmail.com కి మెయిల్ చేయండి 

ఘనంగా నేరెళ్ళ గ్రామ శాఖ ( జగిత్యాల్ జిల్లా ) వార్షికోత్సవం Reviewed by JAGARANA on 7:46 AM Rating: 5
All Rights Reserved by రాష్ట్ర చేతన © 2015 - 2016
Designed by JOJOThemes

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.