తరతరాల చరిత్ర పిలుపిది మరువబోకుము సోదరా - Vijaya Vipanchi
తరతరాల చరిత్ర పిలుపిది మరువబోకుము సోదరా
నరనరాన స్వదేశ భక్తియే పరుగులెత్తగనిమ్మురా
రామరాజ్యము ధర్మరాజ్యము సకల జన సుఖ శాంతి మూలము
దివ్య జీవన మొసగు రాజ్యము దేశ ప్రజలకు తెల్పునేమన
రాక్షసత్వము రుపుమాపుట లక్ష్యముగు గ్రహియింప తగునని || తరతరాల ||
శరధి గట్టిన మనవేంద్రుడు స్వర్ణలంకను గొన్న వీరుడు
దాశరధి శ్రీరామచంద్రుని చరిత తెలిపెడి సారమేమన
జన్మభూమికి స్వర్గమైనను సాటిరాదని చాటినాడని || తరతరాల ||
సింధు నది తీరాన యవనులు హిందు వీరుల ఖడ్గ ధాటికి
కదనభూమిని వదలిపారిన కథలు తెలిపెడి సారమేమన
క్షాత్రవీర్యము బ్రహ్మతేజము కలసియుండిన కలదు జయమని || తరతరాల ||
అడవులే ఆశ్రయములైనను ఆకులలములే అన్నమైనను
మొగలు పాదుష గుండెలదరగా జీవితాంతము పోరుసల్పిన
వీర రాణా తెల్పునేమని జాతి శ్రేయమే ధ్యేయమౌనని || తరతరాల ||
ఆలయమ్ములు ఆలమందలు ఆడబిడ్డల కొరకు పోరిన
ఆర్త హిందు స్పూర్తి కేంద్రము ఛత్రపతి బోధించునేమని
హైందవము ఈ దేశ జీవము అంత్య విజయము మనదేయవునని || తరతరాల ||
Powerd by Vijaya Vipanchi.org
తరతరాల చరిత్ర పిలుపిది మరువబోకుము సోదరా - Vijaya Vipanchi
Reviewed by JAGARANA
on
7:21 AM
Rating:
No comments: