హిందూ శబ్దం సంకుచితమవ్వడానికి కారణం హిందువులే : RSS చీఫ్ మోహన్ జి భాగవత్
24/02/2014 క్రొత్త డిల్లి : ' హిందూ ' శబ్దం సంకుచితం అవ్వడానికి ఒక రకంగా హిందువులే కారణం అని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ సర్ సంఘ్ చాలక్ మాన్య శ్రీ మోహన్ జి భాగవత్ పేర్కొన్నారు, ప్రస్తుత మన ఈ దుస్థితికి కారణం హిందూ సమాజం ఆత్మవిస్మృతికి లోను కావడమే అని హిందుత్వం ఈ దేశ సాంసృతిక వైభవానికి ప్రతీక అని పునరుద్గటించారు.
వివేకానంద ఇంటర్నేషనల్ ఫౌండేషన్ మాజీ దౌత్యవేత్త ఓం ప్రకాష్ గుప్త గారిచే ఆంగ్లంలో రచించబడిన ' Defining Hindutwa ' ( హిందుత్వానికి నిర్వచనం ) పుస్తవిష్కరణ తదనంతరం పూజ్య సర్ సంఘ్ చాలక్ మోహన్ జి భాగవత్ మాట్లాడుతూ " 'హిందూ' శబ్దం అనిర్వచనీయం హిందుత్వం ఒక జీవన విధానం , పరమ సత్యమైన ఆ భగవంతుడిని చేరుకునే వరకు హిందుత్వ అన్వేషణ ఆగదు, అన్నింటిని తమదే అని భావించడం తర తమ భేదాలకు తావు లేకుండా అందరిని ఆదరించడం అనే భావన కేవలం హిందుత్వానికే సొంతం, అలాంటి హిందూ శబ్దం నేడు ఉపేక్ష కు లోనై సంకుచితమవ్వడం బాధాకరం , హిందుత్వ శబ్ద ఉన్నతని ప్రపంచానికి చాటి చెప్పాల్సిన ఆవశ్యకత మన అందరిపైనా ఉంది అని అన్నారు
హిందూ శబ్దం సంకుచితమవ్వడానికి కారణం హిందువులే : RSS చీఫ్ మోహన్ జి భాగవత్
Reviewed by JAGARANA
on
8:13 PM
Rating:
No comments: