'భారతంభ సేవకు అంకితమవ్వండి' స్వయం సేవకులకు RSS చీఫ్ మోహన్ జి భగవత్ పిలుపు
కోత , రాజస్తాన్ : రాజస్థాన్ ప్రాంతం లోని కోత విభాగ్ సమ్మేళనం తేది 19/01/2013 నాడు కోత నగరం లోని మహారాజ ఉదయ్ సింగ్ మైదానం లో జరిగింది, భారి సంఖ్య లో పూర్ణ గణవేష్( సంఘ్ యూనిఫాం) ధారులైన స్వయం సేవకులు హాజరయ్యారు, సంఘ్ జేష్ట్య కార్యకర్తలు ఉపస్తితులైనారు ఈ కార్యక్రమానికి రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ సర్ సంఘ్ చాలక్ మన్య శ్రీ మోహన్ జి భగవత్ ప్రధాన వక్త గా హాజరయ్యి మార్గదర్శనం చేసారు .
![]() |
స్వయం సేవకులను ఉద్య్దేసించి ప్రసంగిస్తున్న మోహన్ జి భగవత్ |
మోహన్ జి భగవత్ మాట్లాడుతూ ' మనం స్వయం సేవకులం, తల్లి భారత మాత సేవలో తరించడానికి స్వీయ ప్రేరణతో ద్యేయ పథంమున నడుస్తూ ముందుకొచ్చాం, ఈ పవిత్ర ఈశ్వరీయ కార్యానికి ఆ భగవంతుడు మనల్ని ఎంపిక చేసుకోవడం మన పూర్వ జన్మ సుకృతం, ఆ భగవంతుడు ప్రసాదించిన జీవితాన్ని భారతంబ సేవలో అంకితమివ్వండి.రాజస్థాన్ ఆణువణువూ మహారాణ ప్రతాప్ సింగ్, బప్పా రావల్ వంటి అనేక మంది వీరులను జన్మ నిచ్చింది, మొఘల్ భాదుష గుండెలను అదరగొట్టిన మహా రాణ ప్రతాప్ జన్మ భూమి పై మాట్లాడటం నాకు పులకింతగా ఉంది, ప్రస్తుతం దేశం లో హిందూ వ్యతిరేక వాతావరణం ఒక క్రమ పద్దతిలో, యోజనా బద్దంగా నిర్మాణం అవుతూ ఉంది, ఇలాంటి విపరీత పరిస్థితులలో నెగ్గుకురావడం కోసం సంఘం , సంఘ స్వయం సేవకులు అహర్నిశలు పనిచేయాల్సి ఉంది. ఆ దిశలో తన మన ధన పూర్వకంగా సమర్పితం అవుతారని భావిస్తున్నాను' అని అన్నారు.
![]() |
ప్రదర్శనలు చేస్తున్న స్వయం సేవకులు |
మూలం : విశ్వ సంవాద కేంద్రం
'భారతంభ సేవకు అంకితమవ్వండి' స్వయం సేవకులకు RSS చీఫ్ మోహన్ జి భగవత్ పిలుపు
Reviewed by JAGARANA
on
9:34 AM
Rating:

Post Comment
No comments: