గీథ్ : భరత జనని ఘన విభవము - భూ నభముల ప్రభవించగ
Click Here to Download |
భరత జనని ఘన విభవము - భూ నభముల ప్రభవించగ (2)
శుభ మంగళ జయ ఘోషల
గళము గళము కలుపుదాం - పదము పదము కదుపుదాం (2)
రుద్ర రౌద్ర భద్ర హస్త ఢమరుక నాదమ్ముగా
శంభు శిఖా దిగ్భందిత గంగ ఝరీ భంగముగా
దక్ష యజ్ఞ ధ్వంస భూత భద్రుని హుంకారముగా (2)
ఫణవ నాద ధ్వంకారం దశదిశలా మ్రోగగా
||గళము||
కురు రణ నిష్కర్మణాన్త ఫల్గుణ కృత బాణముగా
జలది లంఘనోత్సాహిత హనుమ సింహ నాదముగా
ధర్మ రక్ష దీక్ష మాన్య పాంచజన్య రావముగా (2)
విజయ శంఖ స్వర నాదము వినువీధుల నినదించగ
||గళము||
రిపు గళ శోణిత శోభిత శివ ఖడ్గ ప్రహేళిగా
రుద్ర రాణి రణ విరచిత కరవాలపు హేలగా
వన జన సమరపు ప్రేరక రామరాజ ధనువుగా (2)
ఆనక తంకార ధ్వనులు లోకమంత వ్యాపించగ
||గళము||
గీథ్ : భరత జనని ఘన విభవము - భూ నభముల ప్రభవించగ
Reviewed by JAGARANA
on
8:32 AM
Rating:
No comments: