అనుసంధానమే అసలు సమస్య
నోటిలోన కోరలున్న
నిశాచరులు ‘జిహాదీ’లు..
కరచి కరచి భరతమాత
స్వరూపాన్ని విరిచినారు,
నిలువెల్లా కోరులున్న
నిశాసురులు ‘తెల్ల’వారు..
తరచి తరచి భరతజాతి
స్వభావాన్ని చెరచినారు!
మన దేశంనుండి ఆంగ్లేయ దురాక్రమణదారులు నిష్క్రమించిన తరువాత దాదాపు ఏడు
దశాబ్దులు గడిచినప్పటికీ ఆలనలో, పాలనలో, బోధనలో, నిత్యజీవన వ్యవహారంలో
పాశ్చాత్య భావజాలం నిరంతరం పెరుగుతూనే ఉంది!
వాణిజ్య ‘ప్రపంచీకరణ’- గ్లోబలైజేషన్- వ్యవస్థీకృతం అయిపోయిన తరువాత భారతీయ
భావజాలం మరింతగా ఐరోపీకరణకు గురి అవుతుండడం నడుస్తున్న వైపరీత్యం!
భాగ్యనగరంలోని ఒక ‘గల్లీ’లో నడిచిపోతున్న నిర్మాణ కార్మికుల కుటుంబాలవారు
అధునాతన వస్తువుల ధరలను గురించి ముచ్చటించుకుంటున్న ‘దృశ్యం’ ఒకటి
ఆవిష్కృతమైంది. ‘‘ఇంతకూ దాని విలువ ఎంత??’ అన్నది అమ్మవేసిన ప్రశ్న...
గబగబా నడిచిపోతూనే! వెనుక నుంచి పరుగుతీస్తున్నట్టు నడుస్తుండిన పాప
‘‘్థజండ్ రుపీస్’’అని సమాధానం చెప్పింది! పాప ‘ఎల్‌కెజి’ ముగించి
‘యుకెజి’కి వచ్చేసింది మరి. ‘జూన్’రాగానే ‘్ఫస్ట్‌క్లాస్’కు కూడ
వచ్చేస్తుంది. ‘‘్థజండ్ అంటే ఎంతో?’’అని మళ్లీ ప్రశ్నించి తల తిప్పకుండానే
తల్లి నడచిపోతోంది. ‘‘వెయ్యి రూపాయలు’’ అని అని పాప పక్కనే నడుస్తున్న
‘నాన్న’ ముందు వెడుతున్న భార్యకు వినబడేలా అరుస్తున్నాడు! ‘‘్థజండ్
రుపీస్’’అన్న మాటలు అక్షరాస్యతకు ప్రతీకలు... ‘‘వెయ్యి రూపాయలు’’అన్న పదాలు
అజ్ఞానానికి చదువులేని తనానికి పతాకలు! ఇది పెరుగుతున్న ఐరోపీయ
ప్రభావానికి ఒక్క ఉదాహరణ మాత్రమే! నిత్యజీవనంలో అసంఖ్యాక ఉదాహరణలు...
‘ప్రపంచీకరణ’ ప్రచ్ఛన్న రూపంలోని ‘ఐరోపీకరణ’! కర్నాటక రాష్ట్ర శాసనసభ వారు
ఇటీవల ఆమోదించిన రెండు ‘బిల్లులు’ ఈ ఐరోపీకరణను పాక్షికంగా
ప్రతిఘటించడానికి దోహదం చేయగలవు. కానీ భారతదేశమంతటా ఈ ‘ప్రతిఘటన’
మొదలుకావాలంటే కేంద్ర ప్రభు త్వం పూనుకోవాలి!!
మౌలిక స్వభావాన్ని ప్రభావితం చేసేది విద్య! ‘విద్యార్జన’ విద్యార్థి దశకు,
విద్యారంగానికి పరిమితమైన అంశంకాదు. విద్యార్థి దశ విద్యావంతుని వంద ఏళ్ల
జీవనప్రస్థాన క్రమానికి భూమిక! ఈ సంగతి ప్రతి ఒక్కరూ చెబుతున్నారు,
విన్నవారు ‘‘ఔను, ఔను...’’ అని అంగీకార సూచకంగా తలలను ఊగిస్తున్నారు. కానీ
‘‘ఔరా ఒరీ...!’’ అని అంటున్న వారిలో అధికాధికులు తమ పిల్లలకు మాత్రం భారతీయ
భాషామాధ్యమంగా విద్యను బోధించడానికి ఇష్టపడడం లేదు. జాతీయతా నిష్ఠతో,
సాంస్కృతిక వ్రతదీక్షాపరులు స్థాపించిన స్వచ్ఛంద విద్యాసంస్థలవారు
దశాబ్దులపాటు ప్రాథమిక మాథ్యమిక ఉన్నత పాఠశాల విద్యను భారతీయ భాషలలో
బోధించారు! ఇలా బోధించిన సమయంలో ఆయా విద్యాసంస్థలలో పనిచేసే ‘అయ్యవార్లు’,
‘అయ్యవారమ్మ’లలో అత్యధికులు తమ కొడుకులకు, దుహిత(కుమార్తె)లకు మాత్రం
మాతృభాషా మాధ్యమ విద్య ను మప్పలేదు. వారిని తాము పనిచేసే మాతృభాషా మాధ్యమ
పాఠశాలలలోకాక ఇతరచోట్ల ‘ఇంగ్లీష్ మీడియమ్’లో చదివించారు! ఎందుకంటె
‘ఇంగ్లీష్’లో మాట్లాడితేనే సమాజంలో గౌరవం లభిస్తుందని, ఇంగ్లీష్ మీడియమ్‌లో
చదివితేనే ‘ఇంగ్లీష్’లో మాట్లాడడం సాధ్యమని దశాబ్దుల తరబడి స్వతంత్ర
భారతదేశంలో ప్రచారమైంది. ‘‘అమ్మాయి అంతో ఇంతో ఇంగ్లీషు కూడ చదువుకుంది
లెండి...’’వంటి ‘‘డైలాగు’’లు చలనచిత్రాలలో విరివిగా వినిపించాయి. చలన
తెలుగు చిత్ర దర్శకులు బ్రిటిష్‌వారితో పోరాడిన అల్లూరి సీతారామరాజుతో కూడ
ఇంగ్లీష్‌లో మాట్లాడించడం చరిత్ర! యదుకుల కృష్ణుని చేత మాత్రం ఇంగ్లీషు
మాట్లాడించలేదు. ఎందుకంటె కృష్ణుని కాలంనాటికి ‘ఇంగ్లీష్' భాష పుట్టలేదు.
అప్పుడు సంస్కృతంలో మాట్లాడితే గౌరవం. అందువల్ల భారతదేశమంతటా ప్రాథమిక
విద్యను ప్రాంతీయ మాతృభాషలలో నేర్చుకున్నవారు, ఉన్నత విద్యను సంస్కృత
భాషామాధ్యమంగా నేర్చుకున్నారు. సంస్కృతం బోధనాభాష, సం స్కృతం అనుసంధాన భాష,
సంస్కృ తం పాలనాభాష, సంస్కృతం వ్యవహా ర భాష... సహస్రాబ్దుల ఈ భాషామాధ్యమ
విధానం బ్రిటిష్‌వారు మన దేశాన్ని దురాక్రమించిన తరువాత సన్నగిల్లడం,
అంతరించడం చరిత్ర... ఈ చరిత్ర ఇప్పుడు కూడ నడుస్తోంది! రెండేళ్ల పాప
‘‘ద్రాక్ష పళ్లు కావాలి...’’అని అడగదు...‘‘గ్రేప్స్ కా వాలి’’ అని అంటోంది!
ప్రాంతీయ మాతృభాషలలో వ్యవహారం వికసించినప్పటికీ దేశమంతటికీ కలసి ఒక
అనుసంధాన భాష అవసరమన్న జీవన వావ్తవాన్ని గుర్తించడం ‘్భరత జాతి’ సనాతన
విలక్షణ స్వభావం! ఒక దేశంలో ఒకే భాష ఉండడం లేదా ఒకే ప్రధాన భాష ఉండి
రెండుమూడు చిల్లరమల్లర భాషలుండడం ఈ చిన్నాచితకా భాషాజన సముదాయాలవారిని
ప్రధాన భాషవారు దిగమింగడం ప్రపంచంలోని దాదాపు అన్ని దేశాల చరిత్ర! ఒకే
దేశంలో రెండు లేక ఎక్కువ ప్రధాన భాషలు ఏర్పడేసరికి ‘‘సహించని స్వభావం’’
కారణంగా ఆ దేశాలు భాషాప్రాతిపదికన విడిపోవడం, భాషాప్రాతిపదికగా ‘జాతులు’
ఏర్పడడం ఆయా దేశాల చరిత్ర! ఒకే దేశంలో ఒకే భాష, ఒక జాతి ఒకే భాష ‘ఏకరూపత’కు
నిదర్శనం. ఒకే దేశంలో అనేక ప్రధాన భాషలు ఉండడం ఈ భాషా వైవిధ్యాల మధ్య
వైరుధ్యం లేకపోవడం. విభిన్నరూపాల మధ్య అంతర్నిహితమైన సమాన స్వభావానికి
నిదర్శనం! ఈ సమాన స్వభావం సహజమైనది. సృష్టిలో ‘ఏకరూపత’ లేదు, కానీ
వైవిధ్యరూపాల మధ్య అంతర్నిహితమైన సమాన స్వభవాం ఉంది, ఏకాత్మత ఉంది...
ఏకోన్ముఖ నిరంతర ప్రగతి ఉంది! ఇదంతా అనాది అనంతం... అంటే ‘సనాతనం’!
సృష్టిగతమైన ఈ సనాతన తత్త్వం భారతదేశంలో సమాజస్థితమైంది! అందువల్లనే భారత
జాతీయ జీవనం సనాతనమైంది! ఆద్యంత రహితమైంది! ఈ ఆద్యంత రహితమైన నిరంతరమైన
సనాతన తత్త్వం భారతదేశానికి మాత్రమేకాదు... అన్ని దేశాలకు అనంత సృష్టికి
వర్తిస్తున్న వాస్తవం! కానీ ఈ వాస్తవాన్ని అనాదిగా భారతదేశంలోని వారు
గుర్తించారు...ఇతర దేశాలవారు గుర్తించలేదు. వైవిధ్యాలను పెంపొందించాలన్న
పరిరక్షించాలన్న ధ్యాస ఉండడం భారతీయత... వేద సంస్కృతి... సనాతన సంస్కృతి...
లేదా హిందూ జాతీయత! వైవిధ్యాలను నష్టం చేయడం, వైవిధ్యాల మధ్య
అంతర్నిహితమైన ఏకాత్మ తత్త్వాన్ని గుర్తించక పోవడం విదేశీయ తత్త్వం, దీనే్న
మన చరిత్రకారులు ‘మ్లేచ్ఛతత్త్వం’ అని అన్నారు!!
భాషావైవిధ్యాలు నిరంతరం వికసించిన చరిత్ర భారతీయులది. ఏకరూపతవల్ల సృష్టి
ధ్వంసవౌతుంది. సమాజవ్యవస్థ ధ్వంసవౌతుంది. ‘ఏకరూపత’వల్ల చెవి ముక్కు నోరు
కన్ను ఒకే రూపం పొంది శరీరం ఓ పెద్ద ‘మాంస ఖండం’గా తయారవుతుంది.
భిన్నరూపమైన అవయవాల మధ్య ఏకాత్మ స్వభావం శరీరానికి అస్తిత్వం, సృష్టిగత
వాస్తవం ఇలా ప్రస్ఫుటించిన భారత జాతీయ సమాజంలో ఏకరూపత లేదు! ‘‘అద్వితీయ
ఆత్మ’’నుంచి అసంఖ్యాక వైవిధ్యాలు ప్రస్ఫుటిస్తున్నాయి. ఒకే సంస్కృతినుంచి
భిన్నమతాలు ఆచారాలురీతులు భాషలు విద్యలు, ఇంకా అనేకానేక వైవిధ్యాలు
రూపొందడం భారతీయ జీవన వాస్తవం! అందుకే ఒక్కటైన ‘సంస్కృత భాష’ ఒక్కటిగా
ఉండిపోలేదు. నిరంతరం ఈ భాషనుంచి అనేక భాషలు పుట్టుకొచ్చాయి. తమిళం
పుట్టింది, తెలుగు పుట్టింది! మరాఠీ పుట్టింది... హిందీ పుట్టింది, ఇంకా
అనేక ప్రాంతీయ భాషలు ఏర్పడినాయి. ఈ ‘వైవిధ్యాల’ మధ్య సమన్వయం సంస్కృత
భాష... సహస్రాబ్దులపాటు భిన్నప్రాంతీయ భాషలవారు ఒకచోట చేరినప్పుడు వారందరూ
పరస్పరం భావవ్యక్తీకరణకు అనుసంధానమైన భాష సంస్కృత భాష... ‘పూర్వయుగం’లో
దమయన్తీదేవి అన్న విదర్భ రాజపుత్రిక వివాహం జరిగినప్పుడు వివిధ భాషా
ప్రాంతాల భారతీయులు అక్కడ చేరారు. ఒకరి ప్రాంతీయ భాష మరొకరికి తెలియదు.
అందువల్ల వారు సంస్కృత భాషలో మాట్లాడుకోవడం చరిత్ర! సంస్కృత భాష అనుసంధాన
భాష కావడం చరిత్ర... ఈ చరిత్రను బ్రిటిష్‌వారు చెరచిపోయారు. సంస్కృత భాషను
‘ఉన్నత విద్యాబోధనా మాధ్యమం’ స్థానంనుండి తొలగించి ఆ స్థానంలో ఇంగ్లీషును
ప్రతిష్ఠించిపోయారు!
ఈ వైపరీత్యం ప్రస్తుతం నడచిపోతున్న ‘మాధ్యమ’ మీమాంసకు నేపథ్యం, అన్ని
భారతీయ భాషలలోను ‘ప్రాథమిక’విద్యను బోధించాలన్నది భారతీయతా పునరుద్ధరణ
ప్రయత్నంలో సగం మాత్రమే, మిగిలిన సగం అనుసంధాన భాష! సంస్కృతం అనుసంధాన
భాషగా భారతీయులలో భారతీయతను నిలబెట్టింది... యుగాలపాటు!! కానీ సంస్కృతాన్ని
తొలగించి ‘అనుసంధాన భాష’గా మననెత్తికెక్కిన ‘ఇంగ్లీషు’ భారతీయులలో
‘‘ఐరోపీయ స్వభావాన్ని’’ అంకురింప చేసింది... అంకురం పల్లవించి
‘‘పరిమళిస్తోంది’’ !! ‘అమరావతి’ అవశేష ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధానిగా
ఏర్పడింది! ఈ చారిత్రక పునరావృత్తిని ఆనందోత్సాహాల మధ్య ఒక దూరదర్శన
కుడ్యం- టెలివిజన్ ఛానల్-లో విశే్లషించిన ఒక మాధ్యమ ప్రతినిధి తెలుగుభాషకు
కొత్త ‘లిపి’ని ఆవిష్కరించాడు. ‘‘అమరావతి అన్న పదంలోని మొదటి అక్షరం
‘ఏ’...ఆంధ్రప్రదేశ్‌లోని మొదటి అక్షరం కూడ ‘ఏ’...... ఈ విధంగా నవ్య
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికీ నూతన రాజధానికీ మధ్య అక్షరస్వామ్యం
కుదిరింది!’’, అని ఆ ‘ప్రతినిధి’ విశే్లషించాడు! ఆంధ్ర భా షలో మొదటి అక్షరం
‘ఏ’అన్నది, ‘ఆం ధ్ర’కూ ‘అమరావతి’కీ ఆంగ్ల అక్షరాల ద్వారా లభించిన పరిగణనకు
పరిణామ స్వరూపం! ‘‘అ ఆ....’’లను మరచిపోయి ‘‘ఏబిసిడి...’’లను మాత్రం
గుర్తుంచుకుంటున్నాము. ‘ఏబిసిడి’ లను నేర్చుకోవచ్చు! కానీ ‘‘అఆ....’’ ధ్యా స
మాసిపోయే విధంగా ‘రోమన్’ లిపిలో తెలు గును భావిస్తుండడమే ‘వాణిజ్య
ప్రపంచీకరణ’ ప్రభావం! ‘‘షివుడు...’’గా మారిన ‘శివు డు’ ‘‘ఎస్‌హెచ్‌ఐ’’అన్న
అక్షరాల సంకర స్వరూపుడు?
ఈ నేపథ్యంలో ‘మార్చి’నెల ముప్పయి ఒకటవ తేదీన కర్నాటక శాసనసభవారు ఆమోదించిన
రెండు ‘బిల్లు’లపై బ్రిటిష్ భావదాస్య ధిషణాధురీణులు వ్యతిరేకతా విషం
వెదజల్లుతున్నారట! మొదటి ‘బిల్లు’ ప్రకారం కర్నాటకలోని పాఠశాలలో ఒకటినుండి
ఐదవ తరగతి వరకు కన్నడ మాధ్యమంగా కాని, ఇతర భారతీయ భాషామాధ్యమంగా కాని
బోధించాలి. అందువల్ల ‘‘మమీడాడీ’’లను మప్పుతున్న ‘కానె్వం టు’లకు పని ఉండదు.
రెండవ ‘బిల్లు’ప్రకారం పదవ తరగతి వరకూ విద్యార్థులు విధిగా కన్నడ భాషను
అభ్యసించాలి!! ప్రతి రాష్ట్రంలో ఇలా మాతృభాషా మాధ్యమవిద్య వ్యవస్థీకృతం
కావాలి! ఇది సగం.... మరో సగం దేశమంతటా ఉన్న ప్రాంతీయ భాషలను అనుసంధానంచేసే
‘్భష’ విదేశీయమైనది కావాలా స్వజాతీయమైనది కావాలా? అన్న ప్రశ్నలకు
సమాధానం.....
అనుసంధానమే అసలు సమస్య
Reviewed by rajakishor
on
12:14 PM
Rating:
No comments: