' చిన్న పిల్లలు & పరిపాలన అనుభవహీనులు' ఈ దేశాన్ని నడిపించలేరు : శ్రీ శ్రీ రవి శంకర్ గురూజీ
'చిన్న పిల్లలు' మరియు 'పరిపాలన అనుభవం లేని వారు' ఈ సువిశాల భారత దేశాన్ని నడపలేరు - శ్రీ శ్రీ రవి శంకర్ గురూజీ (ఆర్ట్ ఆఫ్ లివింగ్ )
ఫరూఖాబాద్, 20/03/2014 : ప్రస్తుతం దేశ ప్రధాని పదవి పై రాజకీయ క్షేత్రంలో మరియు జన భాహుల్యంలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది, ఒక వైపు భాజపా ప్రధాని అభ్యర్థి శ్రీ నరేంద్ర మోడీ పరిపాలన అనుభవం, సామర్థ్యం పై ప్రజలు పెద్ద ఎత్తున విశ్వాసాన్ని చూపుతుండగా కాంగ్రెస్ యువరాజు రాహుల్ గాంధీ మరియు కేజ్రివాల్ సామర్థ్యాలు జనాలకు దృగ్విషయాలే ప్రముఖ ఆధ్యాత్మిక గురువు శ్రీ శ్రీ రవి శంకర్ గురూజీ ఎవ్వరి పేర్లు ప్రస్తావించాకుండానే " చిన్న పిల్లలు " మరియు పరిపాలన అనుభవం లేని వారు " ఈ సువిశాల భారత దేశాన్ని నడపలేరు అని అన్నారు.
ఫరూఖాబాద్ లో ఒక ఆధాత్మిక సదస్సులో మార్గదర్శనం చేసిన తర్వాత శ్రీ శ్రీ రవి శంకర్ గురూజీ విలేఖరులతో మాట్లాడుతూ ' ప్రస్తుతం దేశం మార్పును కొరుకుతుంది, కాని ఈ మార్పులో సంయుక్త ప్రభుత్వాలకు తాపు లేదు, సుస్థిర సమర్థ జాతీయవాద నేపథ్యం ఉన్న నాయకుని నేతృత్వంలోనే ప్రభుత్వం ఏర్పడవలసి ఉంది, చిన్నా చితక పార్టీలు ఈ దేశానికి నేతృత్వం వహించలేవు అలా చిన్న పార్టీల గుంపుతో ఏర్పడే ప్రభుత్వం దేశ సార్వభౌమాధికారాన్ని కాపాడలేవు ' అని అన్నారు.
గురూజీ ఎవరి పేరు ప్రస్తావించకుండానే చిన్న పిల్లలను దేశ అత్యున్నత స్థానం పై కుర్చోపెడ్డటం క్షేమదాయకం కాదని అన్నారు, అరవింద్ కేజ్రివాల్ పై విలేఖరులు అడిగిన ప్రశ్నకు బదులిస్తూ ' ఒకటో తరగతి లో ఫెయిల్ అయిన విద్యార్థి నేడు పదో తరగతి పరీక్షా రాస్తాను అంటున్నారు' అని అన్నారు.
విదేశాలలో మూలుగుతున్న మన దేశ నల్ల ధనాన్ని తిరిగి భారత్ కు తీసుకురాగల్గిలే దేశంలోని ప్రతి ఒక్కరికి తలా మూడు లక్షల రూపాయలను ఇవ్వొచ్చు మరియు వచ్చే 15 సంవత్సరాల వరకు దేశ ప్రజల నుండి ఒక్క పైసా కూడా పన్ను తీసుకోవాల్సిన అవసరం ఉండదని ఈ విషయాన్ని దేశ ప్రజలు గుర్తించి తమ ఓటు హక్కును ఉపయోగించుకోవాలని అయన పేర్కొన్నారు.
మూలం : న్యూస్ భారతి
' చిన్న పిల్లలు & పరిపాలన అనుభవహీనులు' ఈ దేశాన్ని నడిపించలేరు : శ్రీ శ్రీ రవి శంకర్ గురూజీ
Reviewed by JAGARANA
on
8:51 AM
Rating:
No comments: