చైనా దురహంకారం : 5 కి.మీ మేర భారత భూభాగాన్ని ఆక్రమించిన చైనా సైన్యం - సమర్థ వంతంగా త్రిప్పి కొట్టిన భారత్
లడఖ్ , 20/03/2014 : మళ్ళి చైనా తన దురహంకార బుద్దిని చూపింది తేది 16/03/2014 నాడు ప్రజా విప్లవ సైన్యం ( చైనా సైన్యం ) లడఖ్ సెక్టార్ లోనికి అక్రమంగా చొచ్చుకుని వచ్చే ప్రయత్నం చేసింది, ఈ దాడిని భారత సైన్యం మరియు ఇండో టిబెటన్ పొలిసు దళం సంయుక్తంగా సమర్థవంతగా త్రిప్పికొట్టాయి.
పిటిఐ కథనం ప్రకారం చైనా దళాలు లెఖ్ ప్రాంతానికి 300 కి.మీ తూర్పున ఉన్న చుమార్ సెక్టార్ లోనికి చోచ్చుకురావడానికి ప్రయత్నించాయి, ఆదివారం ఉదయం 07:00 గంటలకు ప్రజా విప్లవ సైన్యానికి చెందిన సుమారు తొమ్మిది మంది సైనికులు సరిహద్దు దగ్గరికి చేరుకుని అక్కడ బ్యానర్ డ్రిల్ చేయడం మొదలు పెట్టారు, ఇంతలోనే మరో పది మంది చైనా సైనికులు గుర్రాల పై వచ్చి వారిని చేరుకున్నారు తర్వాత ఆ మొత్తం బృందం భారత భూభాగాన్ని ఆక్రమించడానికి ప్రయత్నించారు. చైనా దళాలు ఎప్పటికప్పుడు ఎక్కువ సంఖ్యలో సైనికులను జత చేసుకుంటూ దాదాపు 5 కి.మీ వరకు భారత భూభాగంలోనికి గిరిజన ప్రాంతాలకు చోచ్సుకోచ్చారు.
ఈ సంఘటనలను గమనించిన భారత సైన్యం ప్రజా విప్లవ సైన్యం ( చైనా సైన్యం ) ఉన్నతాధికారులకు ఇట్టి దురాక్రమణ విషయాన్ని తెలియపరిచి, భారత సైన్యం మరియు ఇండో టిబెటన్ పోర్స్ సైనికులు సంయుక్తంగా చైనా సైన్యాన్నిత్రిప్పి పంపిచడం జరిగింది.
మూలం : న్యూస్ భారతి
చైనా దురహంకారం : 5 కి.మీ మేర భారత భూభాగాన్ని ఆక్రమించిన చైనా సైన్యం - సమర్థ వంతంగా త్రిప్పి కొట్టిన భారత్
Reviewed by JAGARANA
on
8:03 AM
Rating:
No comments: