"పాక్, చైనా, బాంగ్లా ల అక్రమ చొరబాట్లను ఆపలేరా ?" విశాఖ లో మాన్య భయ్యాజి జ్యోషి
- చైనా ఇప్పటికే 43 వేల చదరపు కి.మీ లను ఆక్రమించింది
- అరుణాచల్ ప్రదేశ్ నుండి వీసా లేకుండా ప్రవేశాన్ని కల్పిస్తుంది
- దేశ సరిహద్దులు ఏమాత్రం సురక్షితంగా లేవు
- ఈ ఆక్రమ చొరబాట్లను ఆమలేమా ? ప్రభుత్వం నిస్చేజం గా ఉంది
- సశక్తి యుత సంఘటిత హిందూ సమాజం ఈ సమశ్యలకు సమాదానం
- విశాఖలో భయ్యాజి జ్యోషి
విశాఖ పట్టణం, 01/02/2014 : గత మూడు రోజులుగా విశాఖ పట్టణం లోని విజ్ఞాన కేంద్రం లో జరుగుతున్న రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ప్రాంత స్థాయి సమావేశాల ముగింపు నిన్న సాయంత్రం ఆళ్వార్ దాస్ మైదానం లో జరిగింది, ఈ కార్యక్రమంలో మాన్య శ్రీ సురేష్ (భయ్యా)జి రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ సర్ కార్యవాహ ( అఖిల భారత ప్రధాన కార్యదర్శి ) మాట్లాడుతూ ' ఈ ప్రభుత్వం నిశ్చేతన అవస్థలో ఉంది దేశం చుట్ట ప్రక్కల నుండి పాకిస్తాన్ , చైనా , బంగ్లాదేశ్ లు అక్రమ చొరబాట్లు చేస్తూ , దేశం యొక్క భూఆక్రమణకు ఓడిగడుతుంటే, ఇప్పటికే చైనా 43 వేల చదరపు కిలో మీటర్ల వైశాల్యాన్ని ఆక్రమించుకుని తన భుభాగంగా ప్రకటించుకుని తన దేశ పటంలో చూపుతుంది, రుణాచలప్రదేశ్‌లోకి చొచ్చుకొచ్చిన చైనా భారతీయుల్లో అభద్రతాభావాన్ని పెంచుతోంది , చైనా వెళ్లాలంటే వీసా వంటివి ఏమీ అవసరం లేదంటూ చైనా బహిరంగంగా ఆహ్వానిస్తోందంటే ఎంత దురహంకారంగా వ్యవహరిస్తోందో అర్థం చేసుకోవాలి, తీవ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న సరిహద్దు రాష్ట్రాలు దేశంలో కల్లోల్లాన్ని సృష్టించేందుకు వెనుకాడటం లేదు, ఇక పక్కనున్న అతిచిన్న దేశం బంగ్లాదేశ్ నుంచి సుమారు 3.5కోట్ల మంది మనదేశంలోకి అక్రమంగా ప్రవేశించి నిర్భయంగా జీవిస్తున్నారు, కనీసం వీరికి వీసా, పాస్‌పోర్టు వంటివి లేవని అయినా మన పాలకులు మాత్రం వీరిపట్ల ఎంతో ఉదాశీనంగా వ్యవహరించడం చేతగాని తనంగా భావించాల్సి వస్తోంది,ఇక చైనా తమ ఉత్పత్తులను కారుచౌకగా భారత్‌లోకి ప్రోత్సహిస్తున్న చైనా ఆర్థికంగా లబ్ధి పొందుతోంది దేశం ఆర్థికంగా బలహీనమైతే విదేశాలకు మార్గం సులభమవుతుంది, చైనా ఉత్పత్తులను విసర్జించడం అంటే అది మన జాతీయతను నిలుపుకున్న్నట్లే అని భావించాలి, హిందూ సమాజం సశక్తి యుతంగా సంఘటితం అవ్వడం వలన మాత్రమె మన హిందూ దేశాన్ని ఉన్నత స్థానం లో నిలుపగలం " అని అన్నారు.
"పాక్, చైనా, బాంగ్లా ల అక్రమ చొరబాట్లను ఆపలేరా ?" విశాఖ లో మాన్య భయ్యాజి జ్యోషి
Reviewed by JAGARANA
on
11:29 AM
Rating:
No comments: