భారతీయ కుటుంబ జీవనంలోనే అన్ని సమశ్యలకు పరిష్కారం : మోహన్ జి భాగవత్
జైపూర్, 13/09/2015 : భారతీయ ఉమ్మడి కుటుంబ వ్యవస్థ ద్వారా మాత్రమే నేడు సమాజం ఎదుర్కొంటున్న అన్ని సమశ్యలకు పరిష్కారం లభించగలదని, హిందు ధర్మం స్త్రీ పురుషులను సామాజిక ధర్మాచరణ కోసం ఏర్పడ్డ దైవం యొక్క రెండు విభిన్న రూపాలుగానే పరిగనిస్తుందని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ పూజ్య సర్ సంఘ్ చాలక్ మాన్య శ్రీ మోహన్ రావ్ భాగవత్ అభిప్రాయపడ్డారు, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ప్రచార విభాగం ఆధ్వర్యంలో సెప్టెంబర్ 11, 12 శని ఆదివారాలలో జైపూర్ లో జరిగిన పత్రికా కాలమిస్ట్ సమావేశం ముగింపులో ఆయన మార్గదర్శనం చేసారు.
ఈ సందర్భంలో మోహన్ జి మాట్లాడుతూ ' నేడు ప్రాశ్చాత్య పోకడల వలన ఉత్పన్నం అవుతున్న అనేక సామజిక, సంస్కృతిక సమశ్యలకు మూలం భారతీయ సమాజం హిందుత్వం చూపిన కుటుంబ విలువలను మర్చిపోవడమే, హిందు జీవన విధానం లో కృన్వంతో విశ్వమార్యం, లోకా సమస్త సుఖినో భవంతు అంటూ ప్రతి జీవిలోనూ ఉండే జీవశక్తి ఆ భగవంతుని ప్రతి రూపమే అని భావించే గుణం ఈ అన్ని సమస్యలకు పరిష్కారం చూపగలదు, భారత దేశ శక్తి అయిన ఈ కుటుంబ వ్యవస్థను నాశనం చేయాలని చూస్తున్న విధర్మియ దుర్నీతిని అడ్డుకుని తీరాలి" అని అన్నారు.
భారతీయ కుటుంబ జీవనంలోనే అన్ని సమశ్యలకు పరిష్కారం : మోహన్ జి భాగవత్
Reviewed by JAGARANA
on
3:33 PM
Rating:

Post Comment
No comments: