RSS ABPS : తొలిరోజు విశేషాలను మీడియా కు వివరించిన మాన్య శ్రీ దత్తాత్రేయ హోసబలె
- సంఘ్ శాఖలు ప్రతి సంవత్సరం 2000-2500 వరకు పెరుగుతున్నాయి.
- యువకులు సంఘ్ తో పని చేయడానికి ఉత్సాహంగా ముందుకొస్తున్నారు.
- సంఘ్ కార్యక్రమాల విస్తరణ కోసం 3 దశలలో ప్రణాళిక రూపొందించుకున్నాం.
- ఈ సంవత్సరం రాణి గైండిన్ల్యు శత జయంతి వేడుకలు నిర్వహిస్తాం.
- మీడియా సమావేశంలో తెలిపిన మాన్య శ్రీ దత్తాత్రేయ హోసబలె సహా సర్ కార్యవాహ
బెంగళూర్, 08/03/2014 : రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అఖిలభారతీయ ప్రతినిధి సభ ( ABPS ) సమావేశాలు లు ప్రారంభం అయ్యాయి. మాననీయ సరసంఘ చాలకులు జ్యోతి ప్రజ్వలన చేయడం తో సభ ప్రారంభం అయ్యింది. ప్రతినిధి సభలు గతం నుండి మూడు మార్లు బెంగళూరు మరియు రెండు మార్లు కర్నాటక లోని పుత్తూరు , మంగళూర్ లలో జరిగాయి. ఈ సమావేశం లో 1385 మంది ప్రతినిధులు పాల్గొంటున్నారు. ఈ సభ గత సంవత్సర కాలం లో సంఘం యొక్క పెరుగుదల మరియు ఇతర కార్యక్రమాలు సమాజం లో అట్టి కార్యక్రమాల ప్రభావం గురించి సమీక్షించి రాబోవు సంవత్సరం కోసం సంఘ కార్యాచరణ ను నిర్ణయిస్తుంది . ఈ సందర్భం లో సమకాలీన జాతీయ స్థితి గతులను పరిగణ లోనికి తీసుకుంటుంది. సభ సంఘ స్వయం సేవకుల శిక్షణా సంబంద విషయాల పై కూడా యోజన చేస్తుంది. శాఖా సంబంద విషయాలే గాక సేవా , సమరసత లాంటి విషయాల పై కూడా చర్చిస్తుంది.
గత మూడు సంవత్సరాల నిరంతర కార్యం లో శాఖలు అదనంగా 2000 నుండి 2500 వరకు పెరిగినాయి. సంఘ పనిని మూడు దశల్లో తీసుకువెళ్ళే ఆలోచన ఒకటి జరిగినది. మొదటిది : 2015 వరకు రెండవది : 2018 వరకు మూడవది : 2025 వరకు సాగుతుంది. ప్రస్తుత సంఘ పని స్థితి ని బట్టి 2015 కల్లా క్షేత్ర స్థాయి పని 10 నుండి 12% వరకు పెరిగే అవకాశం ఉంది . సంఘ యొక్క అన్ని విభాగాల్లో యువత యొక్క భాగస్వామ్యం బాగా పెరిగింది, ముఖ్యంగా సేవా సంబంద కార్యకాలాపాల్లో ఇది ఇంకా అధికంగా ఉంది. జనవరి 2013 నుండి జనవరి 2014 వరకు దేశ వ్యాప్తంగా సంఘం స్వామి వివేకానంద 150 వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించింది. ఈ కార్యక్రమం స్వామీ వివేకానంద కేంద్ర ఆధ్వర్యం లో జరిగినడి. ఈ కార్యక్రమానికి సంఘ స్వయం సేవకులు పూర్తీ సహకారాన్ని అందించారు. ఈ కార్యక్రమం దేశవ్యాప్తంగా ఎంతో మంది యువకుల కు వివేకానంద జీవితం మరియు వారి సందేశాన్ని అందించింది. అంతేగాక ఎంతో మంది యువకులు స్వచ్చందంగా స్పందించి కదిలారు.
అలాంటి స్పందనలో భాగంగా నాగపూర్ లో 15000 మంది కళాశాల విద్యార్థులు గ్రామీణ ప్రాంతం లో గొప్ప సామాజిక కార్యక్రమాలను చేపట్టారు. ఇదే సంవత్సరం లో సమరసత విషయం లో సంఘ కార్యం బాగా పెరిగింది.
గత నవంబర్ మాసం లో విశ్వవిద్యాలయాల ఉపాధ్యక్షుల సమావేశం ఒకటి విశేషంగా జరిగినది. 150 కి పైగా ఉపాధ్యక్షులు ఇట్టి సమావేశం లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమం లో స్వామీజీలు పిలుపునిస్తూ తమ తమ సిలబస్ లలో స్వామీజీ ఇచ్చిన సందేశాన్ని చేర్చాలని తద్వారా విద్యార్థుల్లో సామాజిక దృక్కోణం ఏర్పడుతుందని కోరారు. ప్రతిగా హాజరైన పెద్దలు తప్పక ఆ పని చేస్తామని స్పందించారు.
దేశం లో ప్రస్తుతం మార్పు కు సంబందించిన గమనం ఒకటి సాగుతోంది. ప్రధాన ప్రజాస్వామిక ప్రక్రియ ఒకటి జరగనుంది. ప్రతీ ఒక్కరు ఈ ప్రక్రియ లో చురుగ్గా ఉండాలి. ముఖ్యంగా సంఘ స్వయంసేవక్ లు ప్రాజాస్వామ్యాన్ని గట్టి పరచడం లో ముందుండాలి. సంఘ ఈ సంవత్సరం నాగాలాండ్ రాణి గైడిన్ల్యు యొక్క శతాబ్ది వేడుకలను కూడా నిర్వహిస్తోంది. ఈమె తన 16 వ ఏట నే బ్రిటిష్ పాలన కు వ్యతిరేకంగా పోరాడినది. జైలు లో నిర్భందించ బడినది . ఆమె విడుదల తర్వాత కూడా ఆమె స్థానిక మతమార్పిడులకు వ్యతిరేకంగా పని చేసినది. ఇట్టి విషయమునకు సంబంధించి అలాగే ఇతర విషయాల పై కూడా తిరిగి త్వరలో ప్రకటన చేయబడును .
పత్రికా సమావేశం విడియో ను క్రింద చూడవచ్చు
RSS ABPS : తొలిరోజు విశేషాలను మీడియా కు వివరించిన మాన్య శ్రీ దత్తాత్రేయ హోసబలె
Reviewed by JAGARANA
on
3:02 PM
Rating:
No comments: