నెల్లూరు పర్యటనలో కంచి స్వామి శ్రీ జయేంద్ర సరస్వతికి తీవ్ర అస్వస్థత
కంచి కామకోటి పీఠాధిపతి జయేంద్ర సరస్వతి స్వామి ఆదివారం సాయంత్రం తీవ్ర అస్వస్థత గురికావడంతో చికిత్స నిమిత్తం నెల్లూరు నగరంలోని జయభారత్ హాస్పిటల్‌కు తరలించారు. నెల్లూరులోని మూలాపేటలోని కంచికామకోటి ఆశ్రమంలో కామాక్షి సమేత చంద్రవౌళిశ్వర ఆలయంలో నూతన విగ్రహ ప్రతిష్ఠ, విఘ్నేశ్వర, సుబ్రహ్మణ్యేశ్వర నవగ్రహ దంపత సమేత విగ్రహ ప్రతిష్ఠల కోసం ఆయన నెల్లూరు వచ్చారు. ఈ కార్యక్రమం అనంతరం జయేంద్ర సరస్వతి నగరంలోని పలు కార్యక్రమంలో పాల్గొని జొన్నవాడ కామాక్షితాయి అమ్మవారిని దర్శించుకోడానికి వెళ్తుండగా మార్గ మధ్యంలో షుగర్ లెవల్, బిపి తగ్గి పోయి తీవ్ర అస్వస్థతకు గురికావడంతో హుటహుటిన హాస్పిటల్‌కు చేర్చారు. అత్యవసర చికిత్స చేశారు. వెంటిలేటర్ అమర్చారు. అయితే ప్రాణాపాయంలేదని వైద్యులు చెప్పారు. ఈ విషయం తెలుసుకున్న భక్తులు వేల సంఖ్యలో హాస్పిటల్ దగ్గరకు చేరుకున్నారు. ఉద్విగ్నతకు గురై స్వామికి ఏమీ కాకూడదంటూ భగవంతుడ్ని వేడుకోవడం కన్పించింది. స్వామి వెంటిలేటర్‌లో చూసి భక్తులు వచ్చిన దుఖాన్ని పంటిబిగువన ఆపుకుని స్వామికి స్వస్థత చేకూరాలని భగవంతుడ్ని వేడుకోవడం కన్పించింది. నగరంలోని పలు కార్యక్రమాలకు హాజరుకావడంతో తీవ్ర అలసట వల్ల అస్వస్థతకు గురయ్యారని, దానికి తోడు జయేంద్ర సరస్వతి (82) సంవత్సరాల పైన ఉండటంతో అనారోగ్యానికి గురైనట్లు డాక్టర్లు చెపుతున్నారు.
స్వామి ఆరోగ్యం త్వరగా కుదుటపడి తిరిగి హిందూ ధర్మానికి మార్గదర్శనం చేయలని ఆ భగవంతుడుని రాష్ట్ర చేతనా బృందం హృదయ పూర్వకంగా ప్రార్థిస్తుంది
మూలం : ఆంధ్ర భూమి
నెల్లూరు పర్యటనలో కంచి స్వామి శ్రీ జయేంద్ర సరస్వతికి తీవ్ర అస్వస్థత
Reviewed by JAGARANA
on
4:12 PM
Rating:
No comments: