మత హింస నిరోద బిల్లు పై దేశ వ్యాప్త ఉద్యమం : ప్రవీణ్ భాయి తొగాడియ
దేశం లోని మెజారిటి హిందువుల కు వ్యతిరేకంగా ఉన్న మత హింస నిరోధ బిల్లును విశ్వ హిందు పరిషత్ వ్యతిరేకిస్తుంది , ఈ బిల్లుకు వ్యతిరేకంగా దేశ వ్యాప్త ఉద్యమం నిర్వహిస్తాం - ప్రవీణ్ భాయి తొగాడియ
ప్రవీణ్ భాయి తొగాడియ |
కొత్త డిల్లి : హిందువుల రాజ్యాంగపర మౌలిక హక్కులను కాలరాసేదిగా ఉన్న మత హింస నిరోద బిల్లును విశ్వ హిందు పరిషద్ తీవ్రంగా వ్యతిరేకిస్తుందని ,దేశం లోని మైనారిటిల హక్కులనును రక్షించే ముసుగులో ఈ బిల్లు హిందువుల మౌలిక హక్కులను కాలరాసేదిగా ఉంది , కేంద్ర ప్రభుత్వం వెంటనే ఈ బిల్లు ప్రతిపాదనను వెనక్కు తీసుకోవాలి లేని యెడల దేశ వ్యాప్తంగా తీవ్ర ఉద్యమం నిర్వహిస్తామని విశ్వ హిందు పరిషద్ అంతర్జాతీయ కార్యద్యక్షులు మాన్య శ్రీ ప్రవ్చీన్ భాయి తొగాడియా ప్రకటించారు .
బిల్లు ఎందుకు హిందూ వ్యతిరేకం :
- బిల్లులో మెజారిటి అయిన హిందువులను నేరస్తులుగా , మైనారిటిలను బాదితులుగా చూపెట్టబడింది, ఇది సహజ న్యాయసూత్రాలకు వ్యతిరేకం ఈ కారణం గా దేశం లోని హిందువుల పై మత హింస చెలరేగిన సందర్భంలో దాడులు జరిగిన కనీసం మెజారిటి హిందువుల వాని వినిపించుకునే నాధుడే ఉండడు.
- అంతర్జాతీయ న్యాయ సూత్రాల ప్రకారం చట్టం అందరికి సమాన రక్షణ కలిగించాలి కాని ఈ బిల్లు మత హింస చెలరేగిన సందర్భంలో కేవలం ముస్లీంలకు మాత్రమె రక్షణ కలిగించేలా ఉంది.
- భారత దేశ న్యాయ సూత్రాల ప్రకారం ముద్దాయి న్యాయస్థానం లో నేర నిరూపణ జరిగే వరకుకూడా ముద్దయిగానే పరిగణించబడాలి, కాని ఈ బిల్లులో హిందువులు ఆరోపణ జరిగిన వెంటనే నేరస్తులుగా పరిగనించబడతారు , నాన్ - బెయిలబుల్ కేసులు మోపబడతాయి .
- నేరారోపణ జరిగిన వ్యక్తికీ తను ఆ నేరం చేయలేదని నిరూపించుకునే హక్కు ఉంది, కాని ఈ బిల్లు కారణంగా మత హింస చెలరేగిన సందర్భంలో హిందువులు ఆ ప్రాధమిక హక్కును కోల్పోతారు.
- ఈ బిల్లు ద్వారా కేంద్ర ప్రభుత్వం పూర్తిగా పొలిసు యంత్రాంగాన్ని న్యాయ వ్యవస్థను మైనరిటిల చేతిలో పెట్టె ప్రయత్నం చేస్తుంది, పొలిసు ఉన్నతాదికారులు సహితం కేసు పురోగతిని ప్రతివారం ఫిర్యాది కి తెలపాలనడం ఇందుకు నిదర్శనం.
- ఈ బిల్లు వలన హిందువులేవరు " ముస్లీం " అనే పదాన్ని కుడా ఉచ్కరించలేరు, ఎవరైనా ముస్లీం వ్యాపారవేత్త హిందూ వ్యాపారుల వలన తన వ్యాపారం జరగటంలేదు అని ఫిర్యాదు చేస్తే ఆ హిందూ వ్యాపారులు మత హింస నిరోద బిల్లు పరిధిలోకి వస్తారు.
ఈ బిల్లుకు వ్యతిరేకంగా పార్లమెంటుకు , కేంద్ర ప్రభుత్వానికి లేఖలు రాయాలని కోరారు, ప్రభుత్వ యంత్రాగాన్ని , న్యాయవ్యవస్థను మైనారిటిల చేతిలో పెట్టె ఈ బిల్లుకు వ్యతిరేకంగా దేశ వ్యాప్త ప్రజాస్వామిక ఉద్యమానికి సమాయత్తం కావాలని ఆయన పిలుపునిచ్చారు .
Source: www.samvada.org
మత హింస నిరోద బిల్లు పై దేశ వ్యాప్త ఉద్యమం : ప్రవీణ్ భాయి తొగాడియ
Reviewed by JAGARANA
on
8:14 AM
Rating:
No comments: