యూపి : తిరిగి హిందుత్వాన్ని స్వీకరించిన 5500 మంది మతం మారిన హిందువులు
ఉపేంద్ర బ్రహ్మచారి , ఆగ్రా 28/12/2013 : డిసెంబర్ 25 న ఉత్తర ప్రదేశ్ రాష్ట్రము లోని వివిధ ప్రాంతాలలో జరిగిన వేర్వేరు పునరాగమణ, శుద్ధి ( మతం మారిన హిందువులు తిరిగి హిందుత్వాన్ని స్వీకరించే క్రమం లో జరిగే విధి) కార్యక్రమాలో ఒక్క రోజే 5500 మందికి పైగా తిరిగి హిందుత్వాన్ని స్వీకరించారు .
క్రైస్తవ మిషనరీల విష ప్రచారాన్ని నమ్మి , ప్రలోభాలకు లోనై లేదా వివిధ కారణాల వలన మతం మారిన మన సహోదరులను తిరిగి మత పూర్వికుల మూల సంసృతిలోనికి తీకుకోచ్చే ప్రయత్నం లో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ , విశ్వ హిందూ పరిషద్ , బజరంగ్ దళ్ , ఆర్య సమాజ్ , హిందూ యువ వాహిని కార్యకర్తలు సంయుక్తంగా క్రిస్టమస్ రోజున ఈ కార్యక్రమాలను నిర్వహించారు .
ఉత్తర ప్రదేశ్ లోని ఆగ్రా, ఆలీగర్, కస్గంజ్, బరేలి, బడున్, బింజోర్, సహజన్పూర్, మణిపురి మరియు ఫిరోజాబాద్ లలో జరిగిన శుద్ది కార్యక్రమమలో దాదాపు 5500 మందికి పైబడి క్రైస్తవులు క్రైస్తవానికి స్వస్తి పలికి హిందుత్వాన్ని స్వీకరించారు,
ఆలీఘర్ లో విశ్వ హిందూ పరిషద్ , ధర్మ జాగరణ సమితి సంయుక్త నిర్వహణలో జరిగిన కార్యక్రమంలో గరిష్టంగా 2000 మంది పునరాగమణం ద్వారా హిందుత్వాన్ని తిరిగి స్వీకరించారు .
యూపి : తిరిగి హిందుత్వాన్ని స్వీకరించిన 5500 మంది మతం మారిన హిందువులు
Reviewed by JAGARANA
on
3:15 PM
Rating:
No comments: