వివేకానంద అడుజాడలలో నడిస్తే వచ్చే దశాబ్దం భారత్ దే : ఉపాధ్యాయ, విద్యార్థి సమ్మేళనం లో శ్రీ అప్పాల ప్రసాద్
05-Feb-2013 , యోగేశ్వర్ ఖాందేశ్ , రాష్ట్ర చేతన ప్రతినిధి , ఇందూరు
Listen Full Speech Below :Download |
వేదిక పై ప్రసంగిస్తున్న శ్రీ అప్పాల ప్రసాద్ గారు , సంఘటన కార్యదర్శి . |
- స్వామీ వివేకానంద శార్దశతి జయతోత్సవాలలో భాగంగా ఇందూరు జిల్లా బిచ్కుంద సమారోహ సమితి అధ్వర్యంలో విద్యార్ధి , ఉపాద్యాయ సమ్మేళనం ప్రభుత్వ ఉన్నత పాటశాల ఆవరణలో జరిగింది .
- ఈ కార్యక్రమానికి 8 తరగతి నుండి డిగ్రీ విద్యార్థులు సుమారు 2500 మంది , 350 మంది ఉపాధ్యాయులు , 500 మంది ఇతరులు పాల్గొన్నారు .
- సభా ప్రాంగణం పూర్తిగా స్వామీ వివేకానంద సూక్తులతో అలకరించబడినది ,పూజకోసం వినియోగించిన నిలువెత్తు స్వామిజి చిత్ర పటం ప్రదాన ఆకర్షణ అయింది .
- శ్రీ అప్పాల ప్రసాద్ గారు ప్రసంగిస్తూ ప్రపంచంలో గొప్ప దేశాలుగా చెప్పబడే అనేక దేశాలు కాలగర్బంలో కలిసిపోయాయి కాని ఒక్క సనాతన భారత దేశమే ఇంకా అనేక బౌతిక దండయాత్ర లకు తట్టుకుని నిలబడి ఉంది , బౌద్ధిక దండయాత్ర లను ఎదుర్కొంటూ నిలదొక్కు కోవడానికి కారణం కేవలం మన దేశం లోని అమ్మ లే నని అన్నారు , మన భారత మాత సనతమైనప్పటికి వృద్ధురాలు కాదని , నిండుచూలాలని ప్రపంచంలో అత్యదికంగా యువత ఉన్న దేశం భారత దేశం , స్వామీ వివేకుని బాటలో నడిస్తే వచ్చే దశాబ్దం భారత దేశం పేరుదై ఉంటుందని అన్నారు ,
- అప్పాల ప్రసాద్ గారి ప్రసంగం ఆద్యంతం ఉర్రుతలుగించింది , ప్రసంగం తరువాత విద్యార్థులు , ఉపాధ్యాయులు వారి వద్ద ఆటోగ్రాఫ్ లు తీసుకోవడం ఇక్కడ విశేషం
- ఈ కారక్రమంలో సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ స్వామీ గారు , విభాఘ్ ప్రచారక్ శ్రీ వాసు గారు , జిల్లా ప్రచారక్ శ్రీ రాజలింగం గారు , శ్రీ కోట రాజులు గారు , మండల సమితి సభ్యులు శ్రీ రమేష్ రెడ్డి గారు , సీమ గంగారాం గారు , భానుదాస్ గారు , విట్టల్ గారు , శివకాంత్ గారు , ఎన్నవార్ జనార్ధన్ గారు , కులకర్ణి శ్రీకాంత్ గారు , హన్మండ్లు గారు , పాల్గొన్నారు .
వివేకానంద అడుజాడలలో నడిస్తే వచ్చే దశాబ్దం భారత్ దే : ఉపాధ్యాయ, విద్యార్థి సమ్మేళనం లో శ్రీ అప్పాల ప్రసాద్
Reviewed by JAGARANA
on
8:55 AM
Rating:
Post Comment
No comments: