బంగ్లాదేశ్ అక్రమ చొరబాటు దారులను వెంటనే తిరిగి పంపాలి ధర్నాలో భజరంగ్ దళ్ డిమాండ్
గౌహతి , 24/02/2014: బంగ్లాదేశ్ నుండి భారత్ లోకి చట్ట వ్యతిరేకంగా , అక్రమంగా చొరబడుతున్న చొరబాటుదారులను వెంటనే భారత దేశం నుండి వెనక్కి పంపాలని డిమాండ్ చేస్తూ ' భజరంగ్ దళ్ ' పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శన , ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది.
గౌహతి నగరం లోని దిఘాతిపూర్ వద్ద జరిగిన ఈ నిరసన ప్రదర్శన లో స్థానిక యువత పెద్ద ఎత్తున హాజరయ్యారు , బంగ్లాదేశ్ నుండి అక్రమ చొరబాటుదారులు అస్సాం లోని ఆనేక గ్రామాలను పూర్తిగా ఆక్రమించుకుని ఇక్కడి స్థానికులనే అనేక ఇబ్బందులకు గురిచేసి, వేధించి వారిని వేరే గ్రామాలకు తరిమి గ్రామాలకు గ్రామాలనే వారి అడ్డలుగా మార్చుకోవడం , వారికి ఓటు బ్యాంకు రాజకీయాలకు అలవాటు పడ్డ స్థానిక రాజకీయ నాయకులు సకల సౌకర్యాలను ఏర్పచడం అక్కడ పరిపాటిగా మారింది, దాదాపు 30-40 అసెంబ్లీ సేగ్మెట్లలో అక్రమ చొరబాటుదారులు ఎన్నికలలో విజేతలను నిర్ణయించేస్థాయిలో ఉండటం ఆందోళన కలిగించే విషయం. దేశం లోని ఆక్రమంగా ప్రవేశించిన బంగ్లాదేశీ చొరబాటు దారులను వెంటనే తిరిగి పంపివేయాలని భజరంగ్ దళ్ డిమాండ్ చేసింది , లేని పక్షంలో దేశ వ్యాప్త ఆందోళనకు సిద్దం అని స్థానిక భజరంగ్ దళ్ నాయకులు కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు .
బంగ్లాదేశ్ అక్రమ చొరబాటు దారులను వెంటనే తిరిగి పంపాలి ధర్నాలో భజరంగ్ దళ్ డిమాండ్
Reviewed by JAGARANA
on
8:15 PM
Rating:
No comments: