బంగ్లాదేశ్: ఎన్నికల అనతరం జరిగిన అల్లర్లలో హిందువులే లక్ష్యంగా భౌతిక దాడులు - నిర్వాసితులైన హిందూ కుటుంబాలు
భీభత్స కారుల దాడిలో ద్వంసం అయిన ఒక గ్రామం |
బంగ్లాదేశ్ , 10/01/2014 : బంగ్లాదేశ్ లో ఈ నెల 5 వ తేదీతో ముగిసిన సార్వత్రిక ఎన్నికల ప్రసహనం తర్వాత అల్ప సంఖ్యాక వర్గాలైన హిందువుల పై జరుతున్న వరుస దాడులతో హిందువులు అల్లాడుతున్నారు , బంగాదేశ్ ఉత్తర, దక్షిణ ప్రాంతాలలోని జోసేర్, దేబిగంజ్, రాజ్శాయి,మొహిద్నర్హట్, శాంతిపూర్, ప్రాదాన్పుర, ఆలం నగర్ లతో పాటు మరికొన్ని గ్రామాలలో జరిగిన భీభత్సఖాండ లో దాదాపు 100 - 150 హిందువుల ఇల్లు ద్వసం చేయబడ్డాయి, వందలాది మంది హిందువులు నిరాశ్రయులయ్యారు.
బంగ్లాదేశ్ ప్రభుత్వ యంత్రాంగం, స్వయంగా ప్రధాని షేక్ హాసిన ఈ సంఘటనల పట్ల చట్ట పరమైన చర్యలు తీసుకుంటున్నామని చెబుతున్న అలాంటి చర్యలు తీసుకున్న దాఖలాలు కనిపించడం లేదు.హిందువులు సార్వత్రిక ఎన్నికలలో పాల్గొని తమ ఓటు హక్కును వినియోగించుకున్నందుకు ఇలాంటి దాడులకు ముష్కర మూకలు పాల్పడుతున్నట్లు సమాచారం.
బంగ్లాదేశ్ లో నవరి 5 న ముగిసిన సార్వత్రిక ఎన్నికల అనతరం అల్ప సంఖ్యాక వర్గాలైన హిందువులను లక్ష్యంగా చేసుకుని భౌతిక దాడులు జరుగుతున్నాయి
మతతత్వ వాదుల ఆధిపత్యం :
ముఖ్యంగా మతతత్వ వాదులు అతివాద గ్రూపులు ఎక్కువ ప్రభావవంతంగా ఉండే ప్రాంతాలలోనే ఎక్కువగా ఈ తరహ సంఘటనలు జరిగినాయి, కానీ ఈ సంఘటనలో కేవలం అల్ప సంఖ్యాకులైన హిందువులే లక్ష్యం కావడం ఆలోచించదగ్గ విషయం, ప్రముఖ పత్రిక వేత్త , సామాజిక కార్యకర్త శేయరార్ కబీర్ అభిప్రాయం ప్రకారం 'గత అనేక సంవత్సరాలుగా ఇక్కడ కేవలం హిందువులే లక్ష్యం కాబడుతున్నారు, ఈ ప్రసహనం బంగ్లాదేశ్ స్వాసంత్ర్యం పొందిన నాటి నుండి జరుగుతుంది, రాజకీయ స్వార్థం కోసం మాత్రమె ఈ హింస జరుగుతుంది అనడం లో ఎలాంటి సంశయానికి తావులేదు, 1947 నుండి జరుతున్న వరుస దాడులకు బయపడి అనేక లక్ష్యల హిందూ కుటుంబాలు భారత్ కు వరస వెళ్ళి పోయాయి'.
నిర్వాసితులైన హిందువులు |
బంగ్లాదేశ్: ఎన్నికల అనతరం జరిగిన అల్లర్లలో హిందువులే లక్ష్యంగా భౌతిక దాడులు - నిర్వాసితులైన హిందూ కుటుంబాలు
Reviewed by JAGARANA
on
9:29 AM
Rating:
No comments: