కన్యా కుమారి నుండి ప్రారంబమై 490 వ రోజున జమ్మూ చేరిన శ్రీ సీతారామ కలదియ 'భారత పరిక్రమ పాదయాత్ర'
భారత దేశాన్ని గురించి తెలుసుకోండి ! నిజమైన భారతీయులుగా బ్రతకండి !! దేశాన్ని తిరిగి విశ్వ గురువును చేయండి !!! అంటూ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ప్రముఖ ప్రచారకులు మాజీ అఖిల భారతీయ సేవా ప్రముఖ్ శ్రీ సీతారామ కదిలియ గారు చేపట్టిన " భారత పరిక్రమ పాదయాత్ర " దేశ దక్షిణ సరిహద్దు కన్యా కుమారి వద్ద 9 ఆగస్టు 2012 న ప్రారంభమై 490 వ రోజున దేశ ఉత్త్తర సరిహాద్దు రాష్ట్రము జమ్మూ చేరింది
జమ్మూ 12/12/2013: రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ మాజీ అఖిల భారతీయ సేవా ప్రముఖ్ జేష్ట్య ప్రచారక్ శ్రీ సీతారామ కలిదియ డిసెంబరు 10 వరకు పంజాబ్ రాష్ట్రము లో తన 33 రోజుల " భారత పరిక్రమ పాద యాత్ర" ను పూర్తీ చేసుకుని తేది 11/12/2013 భారత దేశ ఉత్తర సరిహద్దు రాష్ట్రమైయిన జమ్మూ కాశ్మీర్ చేరుకున్నారు.
జమ్మూ కాశ్మీర్ లో స్వాగతం పలుకుతున్న గ్రామస్తులు |
భారత దేశాన్ని గురించి తెలుసుకోండి ! నిజమైన భారతీయులుగా బ్రతకండి !! దేశాన్ని తిరిగి విశ్వ గురువును చేయండి !!! అంటూ దేశం లోని గ్రామీణ జీవన ప్రమాణ శైలి మెరుగుపరచే ఉద్యేశం తో కేరళ రాష్ట్రంలోని కన్యా కుమారి వద్ద 9 ఆగస్టు 2012 న ప్రారంభమైన " భారత పరిక్రమ పాదయాత్ర " లో భాగంగా శ్రీ సీతారామ కలదియ గారు దాదాపు 5500 కిలో మీటర్ల దూరాన్ని తన పాదయాత్ర ద్వారా పూర్తీ చేసారు.
కన్యా కుమారి నుండి ప్రారంబమై 490 వ రోజున జమ్మూ చేరిన శ్రీ సీతారామ కలదియ 'భారత పరిక్రమ పాదయాత్ర'
Reviewed by JAGARANA
on
8:07 AM
Rating:
No comments: