ఉగ్రవాది అఫ్జల్ గురుకు ఉరిశిక్ష అమలు
తీహార్ : పార్లమెంట్‌పై దాడి కేసులో ప్రధాన నిందితుడైన అఫ్జల్ గురుకు ఎట్టకేలకు కేంద్రం ఉరిశిక్ష అమలు చేసింది. అత్యంత గోప్యంగా ఈరోజు ఉదయం ఎనిమిది గంటలకు తీహార్ జైలులో అఫ్జల్ ను ఉరి తీశారు. ఉరిశిక్షను కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే ధ్రువీకరించారు. జనవరిలో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ క్షమాభిక్షను తిరస్కరించటంతో కేంద్రం శిక్షను అమలు చేసింది.
2001లో పార్లమెంట్ పై దాడి కేసులో నిజానికి 2002లోనే అఫ్జల్‌కు ఉరి ఖరారు చేశారు. అయితే అతను క్షమాభిక్ష కోరడంతో కేసు ఇప్పటిదాకా వాయిదా పడుతూ వచ్చింది. మరోవైపు ముందు జాగ్రత్త చర్యగా కాశ్మీర్ వ్యాలీలో భారీగా భద్రతా సిబ్బంది మోహరించారు. జమ్మూ కాశ్మీర్, శ్రీనగర్ లో కర్ప్యూ విధించారు.
సౌజన్యం : సాక్షి దిన పత్రిక
ఉగ్రవాది అఫ్జల్ గురుకు ఉరిశిక్ష అమలు
Reviewed by JAGARANA
on
12:13 PM
Rating:
Post Comment
No comments: