21వ శతాబ్దం భారత్‌దే - ఎస్సార్‌సీసీ విద్యార్థులనుద్దేశించి మోడీ ప్రసంగం
- దేశంలో మార్పు తీసుకురాగలం- దేశానికి గుజరాత్ అభివృద్ధి విధానం ఆదర్శం
- గుజరాత్ ముఖ్యమంత్రి నరేంవూదమోడీ
- ఎస్సార్‌సీసీ విద్యార్థులనుద్దేశించి ప్రసంగం
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 6: అంతర్జాతీయ శక్తిగా భారత్ తన బ్రాండ్‌ను తిరిగి నిలబెట్టుకునేందుకు కృషి చేయాలని గుజరాత్ ముఖ్యమంత్రి నరేంవూదమోడీ పిలుపునిచ్చారు. ఆశావాదంతో యువశక్తి పనిచేస్తే 21వ శతాబ్దం భారత్‌దేనని పేర్కొన్నారు. బీజేపీ ప్రధాని అభ్యర్థిగా ప్రచారం.. సమర్థుడైన పాలకుడిగా ప్రశంసలందుకుంటున్న తరుణంలో ఆయన బుధవారం ఢిల్లీలోని శ్రీరాం కాలేజీ ఆఫ్ కామర్స్ (ఎస్సార్సీసీ) విద్యార్థులను ఉద్దేశించి ప్రసగించారు. రాజకీయ నాయకులు, యువతను నవీన యుగపు శక్తిగా చూడాలని కానీ, కొత్త తరం ఓటర్లుగా కాదని పేర్కొన్నారు. కిక్కిరిసిన ఆడిటోరియంలో దాదాపు గంటసేపు సాగిన ఆయన ప్రసంగానికి ఆద్యం తం.. విద్యార్థులు, ఉపాధ్యాయ సిబ్బంది పలుమార్లు చప్పట్లతో హర్షధ్వానాలు తెలిపారు. అయితే, మోడీ రాకపై కళాశాల బయట వామపక్ష విద్యార్థి సంఘాలు తీవ్ర నిరసన తెలిపాయి. మోడీ తన ప్రసంగంలో నేరుగా కాంగ్రెస్‌పై, రాజకీయ నాయకులపై విమర్శలు చేయలేదు. అయితే అత్యంత ప్రగతిశీల, భవిష్యత్ దార్శనికత గల నాయకుడిగా తనను తాను అభివర్ణించుకోవడంపై దృష్టి సారించారు. గుజరాత్ అభివృద్ధి విధానం దేశానికి ఆదర్శమని పేర్కొన్నారు.
సుపరిపాలన లేకపోవడమే మన సమస్యలన్నింటికీ మూలమన్నారు. గాంధీజీ పేర్కొన్నట్టు సురాజ్య పాలన సాగిస్తేనే.. భారత్ అంతర్జాతీయశక్తిగా ఎదుగుతుందని పేర్కొన్నారు. సురాజ్యమంటే మంచి పరిపాలన, ప్రజా అనుకూల విధానాలని వివరించారు. సాధారణంగా ఒక సమస్య ఎదురైనప్పుడే దానిని పరిష్కరించడాకి మనం దృష్టి సారిస్తున్నామని, గత ఆరు దశాబ్దాలుగా అనుసరిస్తున్న ఈ విధానంతో దేశమంతటా నిరాశ అలుముకుందని, సమస్య నుంచి పారిపోవాలని ప్రతి ఒక్కరూ ఆలోచిస్తున్నారని పేర్కొన్నారు. అయితే భవిష్యత్‌ను ఊహించి.. పరిస్థితిలో మార్పు తీసుకురావడమే నాయకుడి కర్తవ్యమని, సానుకూల దృష్టితో, ఆశావాదంతో ఉన్న తాను ప్రస్తుత పరిస్థితిలో మార్పు తీసుకురాగలమని విశ్వసిస్తున్నట్టు తెలిపారు. ఇప్పటివరకు ప్రపంచమంతా భారత మార్కెట్‌పై దృష్టి సారించిందని, అయితే ప్రపంచాన్ని భారత్‌కు మార్కెట్‌గా చేయాల్సిన సమయం ఆసన్నమైందని పేర్కొన్నారు.
21వ శతాబ్దం భారత్‌దేనంటూ ఆయన ప్రకటించారు. ‘‘దీనిని సాధించే సత్తా మన యువతకు ఉంది. ఒకప్పుడు మనదేశాన్ని పాములు పట్టేవారికి, చేతబడులకు నెలవుగా చూసేవారు. ఇప్పుడు భారత ముఖచిత్రం మారింది. ఇందుకు యువతకు ధన్యవాదాలు చెప్పాల్సిందే. ఇప్పుడు మనం మౌస్‌లు పట్టేవారిగా మారిపోయాం’’ అంటూ సాఫ్ట్‌వేర్ రంగంలోని యువతను ఉద్దేశిస్తూ నవ్వులు కురిపించారు. ఓటుబ్యాంకు రాజకీయాలే దేశాన్ని నాశనం చేస్తున్నాయని పేర్కొన్నారు.
సౌజన్యం : నమస్తే తెలంగాణ
21వ శతాబ్దం భారత్‌దే - ఎస్సార్‌సీసీ విద్యార్థులనుద్దేశించి మోడీ ప్రసంగం
Reviewed by JAGARANA
on
8:06 AM
Rating:

Post Comment
No comments: