కరీనగర్ జిల్లా సారంగాపూర్ మండలం తుంగూర్ గ్రామంలో స్వామి వివేకానంద 150 వ జయంతోత్సవాలు
శ్రీ నాగరాజు గోల్కొండ - రాష్ట్రచేతన ప్రతినిది , కరినగరం,
కరీనగర్ రెవెన్యు జిల్లా సారంగాపూర్ మండలం తుంగూర్ గ్రామం లో తేది : 30.1.2013 రోజున స్వామి వివేకానంద 150 జయంతి వేడుకలు గ్రామస్థుల ఆధ్వర్యం లో ఘనంగా జరిగాయి . వివరాలు క్రింది విధంగా ఉన్నాయి .
![]() |
కార్యక్రమంలో ప్రసంగిస్తున్న SI శ్రీ నాగేశ్వర్ రావ్ గారు |
- కార్యక్రమం లో గ్రామస్థులు యువజనులు విద్యార్థులు పాల్గొన్నారు .సుమారు 500 ల మంది శోభాయాత్ర లో పాల్గొన్నారు . అనంతరం గ్రామ పశు వైద్య శాల ప్రాంగణం లో సభా కార్యక్రమం జరిగింది .
- ఇట్టి కార్యక్రమానికి మండల రక్షక భట నిలయం SI గారు శ్రీ నాగేశ్వర్ రావు గారు ముఖ్య అథితి గా వచ్చారు . వక్త గా శ్రీ చక్రాల రామాంజనేయులు, కరీనగర్ విభాగ్ ప్రచారక్ RSS గారు వచ్చారు .
- స్వామి వివేకానంద మరియు భారత మాత వేషధారణ తో పిల్లలు అలరించారు .
- యువజను లంతా గ్రామం లో ముందు రోజు కార్యక్రమం గురించి ప్రతీ ఇంటింటి కి వెళ్లి ప్రజలను ఆహ్వానించారు .
- గ్రామ లోని శ్రీ వివేకానంద పాఠశాల , ZPHS తుంగూరు విద్యార్థులు , వేదనిధి పాఠశాల లు పాల్గొన్నాయి .
- అలాగే గ్రామ ప్రముఖులు బట్టిపాటి మధుకుమార్ , ఆడెపు నర్సయ్య , గాజుల సత్యం , జెట్టి లక్ష్మన్ , మెడికల్ లింగన్న , చుక్క రమేష్ మాజీ సర్పంచ్ , ముదుగంటి రవీందర్ రెడ్డి, ఉన్నత పాఠ శాల ప్రధానోపాధ్యాయులు గార్లు పాల్గొన్నారు .
- ఇట్టి కార్యక్రమం లో శ్రీ నాగేశ్వర్ గారు మాట్లాడుతూ స్వామి వివేకానంద ప్రస్తుత తరుణం లో యువత కు అవసరమైన మార్గదర్శి అని అన్నారు .
- ప్రధాన వక్త శ్రీ చక్రాల రామనజనేయులు గారు మాట్లాడుతూ ...
- స్వామి కేవలం భారత దేశానికే గాక ప్రపంచానికి దారి చూపిన తత్వజ్ఞాని అన్నారు .
- కేవలం 39 ఏళ్ల వయస్సు లోనే అందులో చివరి 9 ఏళ్ల కాలం లో 1500 సంవత్సరాలకు సరిపడా జ్ఞాన భాండాగారాన్ని మనకు అందించి వెళ్లారని తెలిపారు .
- హిందూ ధర్మ విశిష్టతను పశ్చిమ యూరప్ దేశ ప్రజలకు విడమర్చి తెలిపారని అన్నారు .
- భారత స్వాతంత్ర సంగ్రామం లో ముందుండి సాగిన నేతాజీ , బాలగంగాధర్ తిలక్ , రవీంద్రనాథ్ టాగూర్ లకు ప్రేరణ గా నిలిచారని అన్నారు .
- యువతకు దేశ భక్తి , దైవభక్తి ఎందుకు అవసరమో తెలిపారు అన్నారు .
- ఎట్టి పరిస్థితుల్లో మన ఆత్మ విస్వాశాన్న్ని కోల్పోవద్దని స్వామి అన్నారని చెప్పారు
- నాడు నేడు ఎన్నటికీ స్వామిజీ మన లో జీవించే ఉంటారని అన్నారు .
కరీనగర్ జిల్లా సారంగాపూర్ మండలం తుంగూర్ గ్రామంలో స్వామి వివేకానంద 150 వ జయంతోత్సవాలు
Reviewed by JAGARANA
on
8:48 AM
Rating:

Post Comment
No comments: