Top Ad unit 728 × 90

వార్తా హైందవం

recent

కొచ్చి : ప్రారంభమైన రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (RSS) అఖిల భారతీయ కార్యకారణి మండలి సమావేశాలు

కోచి అక్టోబర్ 25 : రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (RSS) అఖిల భారతీయ కార్యకారణి మండల్ భైఠక్ ( జాతీయ స్థాయి అత్యున్నత  విధాన నిర్ణాయక మండలి) సమావేశాలు  నేడు (25 అక్టోబర్) కొచ్చి లోని ప్రాంత కార్యాలయం భాస్కరీయం లో పూజ్య సర్ సంఘ్ చాలకులు  మాన్య శ్రీ మోహన్ జి భగవత్ గారి జ్యోతి ప్రజ్వలన తో ప్రారంభమైనాయి ఈ సమావేశాలు మూడు రోజుల పాటు కొనసాగనున్నాయి .
జ్యోతి ప్రజ్వలన చేస్తున మోహన్ జి ప్రక్కన భయ్యాజి జ్యోషి 
మాన్య శ్రీ మోహన్ జి భగవత్ మాన్య శ్రీ భయ్యాజి జ్యోషి సర్ కార్యవాహ గారితో కలసి జ్యోతి ప్రజ్వలన చేసి మూడు రోజుల సమావేశాలను  లాంచనంగా ప్రారంబించారు , ప్రారంబోత్సవ కార్యక్రమం అనంతరం సమావేశం గత సంవత్సర కాలంలో స్వర్గస్తులైన సంఘ పెద్దలు , జాతీయవాద నాయకులు , ప్రముఖులకు శ్రద్ధాంజలి ఘటించింది . వారిలో  సంత్ భద్రగిరి అచ్యుత్ నాథ్ ( ప్రముఖ హరికథ కళాకారుడు ) , శ్రీ గణేష్ గారు ( సంఘ ప్రచారకులు ) , శ్రీ రజిని రాయి( మాజీ పాండిచేరి గవర్నర్ ) , శివంతి అదితాన్ ( ప్రముఖ రాజకీయ వేత్త ) , శ్రీ రమేష్ ( భాజపా తమిళ్ నాడు కార్యదర్శి ) , శ్రీ వల్లయప్పన్ ( హిందూ మున్నాని నాయకులు ) , లాల్గుతి గోపాల్ అయ్యర్ జయరామన్ ( ప్రముఖ వయోలిన్ విద్వాంసులు ) , శ్రీ శ్రీనివాసన్ ( ప్రముఖ నేపథ్య గాయకులు ) తదితరులు ఉన్నారు .


ఈ సమావేశాలలో ప్రాశ్చాత్తికరణ దుష్ప్రభావాలు , దక్షిణ భారత దేశం లో పెరుగుతున్న దేశ ద్రోహ విధర్మీయా తీవ్రవాదం తదితర అంశాల పట్ల తీర్మానాలు జరిగే అవకాశం ఉంది.
పస్చిమాంద్ర ప్రాంతం నుండి  మాన్య శ్రీ ప్యేట వెంకటేశ్వర్ రావు (ప్రాంత సంఘ చాలక్), శ్రీ ఎక్క చంద్ర శేఖర్ గారు (ప్రాంత కార్యవహ), శ్రీ అన్నదానం సుబ్రహ్మణ్యం గారు (ప్రాంత సహా కార్యవహ), శ్రీ కచ్యం రమేష్ గారు( ప్రాంత సహా  కార్యవహ) , శ్రీ ఆలే శ్యాంకుమార్ గారు (ప్రాంత ప్రచారక్),శ్రీ దేవేందర్ జి(ప్రాంత సహా ప్రచారక్) గారు ఈ సమావేశాలకు హాజరయ్యారు .        

దేశంలోని అన్ని ప్రాంతాల సంఘచాలకులు , కార్యవాహలు , సహా కార్యవాహ లు , ప్రాంత ప్రచారకులు, ప్రాంత స్థాయి పదధికారులు లతో పాటు వివిధ క్షేత్రాలలో పనిచేస్తున్న భావసారూప్య సంస్థల ( సంఘ్ పరివార్ ) జాతీయ నాయకులు సుమారు 400 మంది ఈ సమావేశాలలో మూడు రోజుల పాటు పాల్గొంటారు 
భారతీయ కిసాన్ సంఘ్ ( వ్యవసాయ రంగం ) , వనవాసి కళ్యాణాశ్రం, అఖిళ భారతీయ విద్యార్థి పరిషద్ ( దేశంలోనే అతి పెద్ద విద్యార్థి సంఘం ) , భారతీయ మజ్దూర్ సంఘ్ ( ప్రముఖ కార్మిక సంఘం ) , విశ్వ హిందూ పరిషద్ ( ప్రపంచ వ్యాప్తంగా హిందూ సంఘటన కార్యం నిర్వహిస్తున్న సంస్థ ) , భారతీయ జనత పార్టి , విద్యా భారతి , విజ్ఞాన భారతి, క్రీడా భారతి, సంస్కృత భారతి, సంస్కర భారతి, సేవాభారతి,లఘు ఉద్యోగ భారతి, స్వదేశీ జాగరణ్ మంచ్, రాష్ట్ర సేవికా సమితి, దీనదయాల్ సంశోదన సంస్థాన్, భారత్ వికాస్ పరిషద్, ధర్మ జాగరణ్ సమితి, అఖిల భారతీయ శైక్షనిక్ మహాసంఘ్ తదితర సంస్థల ప్రతినిధులు ఈ సమావేశాలకు హాజరౌతున్నారు .
ఆయా సంస్థల కార్యక్రమాల పై రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ నివేదికలను స్వీకరించి , సమీక్షించడం జరుగుతుంది. భవిషత్ కార్యాచరణ , అవసరమైన జాతీయ విషయాల పట్ల తీర్మానాలు చేయడం జరుగురుంది .   
పాల్గొన్న వివిధ ప్రాంతాల ప్రతినిధులు 
   నేడు ప్రారంభమైన రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అఖిల భారతీయ కార్యకారణి మండల్ సమావేశాలు మూడు రోజుల పాటు జరిగి 27 అక్టోబర్ న ముగియనున్నాయి   
కొచ్చి : ప్రారంభమైన రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (RSS) అఖిల భారతీయ కార్యకారణి మండలి సమావేశాలు Reviewed by JAGARANA on 2:38 PM Rating: 5

No comments:

All Rights Reserved by రాష్ట్ర చేతన © 2015 - 2016
Designed by JOJOThemes

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.