సంఘ శాఖలలో యువత ప్రాతినిత్యం గణనీయంగా పెరుగుతూ ఉంది : కోచి ABKM సమావేశాలలో లో మాన్య శ్రీ మోహన్ భాగవత్
కోచి 25/10/2013 : దేశం లో యువత రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సిద్దాంతాలు , కార్య పద్దతి పట్ల గణనీయంగా ఆకర్షితం అవుతున్నారు , సంఘ శాఖలలో 15 - 40 వయసు మధ్యలో ఉన్న యువత సంఖ్య పెరగటమే ఇందుకు నిదర్శనం అని పూజ్య సర్ సంఘచాలకులు మాన్య శ్రీ మోహన్ జి భాగవత్ కొచ్చి లో మూడు రోజుల పాటు జరుగుతున్న రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ అఖిళ భారతీయ కార్యకారణి మండల్ సమావేశాలలో అన్నారు .
మాన్య శ్రీ సురేష్ ( భయ్యాజి ) జ్యోషి సర్ కార్యవాహ సమావేశ ప్రారంభంలో ఈ సంవత్సర వార్షిక నివేదికను ప్రతినిధుల ముందు ఉంచారు . గత సంవత్సరం తో పోల్చుకుంటే ఈ యేడు దేశ వ్యాప్తంగా ఒక వెయ్యి 1000 క్రొత్త శాఖలు ప్రారంభం అయ్యాయి , అలాగే నిత్య సంఘ శాఖలలో పాల్గొనే తరుణ ( యువత ) సంఖ్య గణనీయంగా పెరిగింది , వివిధ ప్రాంతాల ప్రతినిధులు తమ వార్షిక నివేదికలు సమర్పించడం జరిగింది .
Source : NewsBharati.com
సంఘ శాఖలలో యువత ప్రాతినిత్యం గణనీయంగా పెరుగుతూ ఉంది : కోచి ABKM సమావేశాలలో లో మాన్య శ్రీ మోహన్ భాగవత్
Reviewed by JAGARANA
on
10:43 AM
Rating:
No comments: