ఆధ్యాత్మిక క్షేత్రాలలో భక్తులకు హిందూ హెల్ప్ లైన్ అన్ని విధాలుగా సహాయపడుతుంది : ప్రవీణ్ జి తొగాడియ
"సెలవులు , దీపావళి పండుగ సందర్భంగా అనేక కుటుంబాలు తీర్థయాత్రలకు దేశం లోని ప్రముఖ పుణ్య క్షేత్రాలకు వస్తూ ఉంటారు వారి తీర్థ యాత్రలలో ఎలాంటి అత్యవసర వైద్య,పర్యాటక ,న్యాయ,సేవలు అందిచడానికి హిందూ హెల్ప్ లైన్ సిద్ధంగా ఉంది" - ప్రవీణ్ భాయి తొగాడియా
సోమనాథ్ : దేశ వ్యాప్తంగా హజరైన హిందూ హెల్ప్ లైన్ (http://hinduhelpline.com/) పదదికారులు , రాష్ట్ర సంయోజకులు , జిల్లా సంయోజకుల జాతీయ స్థాయి సమీక్షా సమావేశం సోమ్నాథ్ లో జరిగింది , ఈ సమావేశానికి హిందూ హెల్ప్ లైన్ మార్గదర్శకులు , విశ్వ హిందూ పరిషద్ అంతర్జాతీయ కార్యదక్షులు మాన్య శ్రీ ప్రవీణ్ భాయి తొగాడియా గారు ముఖ్య అధితిగా విచ్చేసి హిందూ హెల్ప్ లైన్ వలెంటీర్లకు మార్గదర్శనం చేసారు .
ఈ వార్షిక సమావేశం లో హిందూ హెల్ప్ లైన్ మధ్యమంగా గత సంవత్సర కాలంగా జరిగిన సేవా కార్యక్రమాల సమీక్ష , ఇంకా విసృతంగా కార్యకలాపాలకు విస్తరించడానికి తెసుకోవాల్సిన చర్యలు తదితర అంశాల పట్ల సుధీర్గ చర్చ జరిగింది , హిందువు - హిందువు ఆత్మ బందువు అనే భావనతో అత్యవసర పరిస్థితులలో ప్రతి హిందువు మరో హిందువుకు సహాయం చేయాలనే ఉద్యేశం తో హిందూ హెల్ప్ లైన్ హిందువులకు అత్యవసర సమయం లో రక్తం , అంబులెన్స్ , రాత్రి వేళలో మందులు లాంటి వైద్య సేవలతో పాటు , తీర్థ యాత్రలలో రవాణ, వసతి , బోజన వివరాలు, అత్యవసర సమయంలో న్యాయ సహాయం తదితర అంశాలను క్రోడికరించుకుంటూ హిందూ హెల్ప్ లైన్ పని చేస్తుంది , హిందూ హెల్ప్ లైన్ గురించిన పూర్తీ సమాచారాన్నిwww.hinduhelpline.com ద్వార పొందొచ్చు హిందూ హెల్ప్ లైన్ 24 X 7 అత్యవసర పోన్ నెంబర్లు : 020 - 66803300 , 07588682181 .
ఎటువంటి అత్యవసర పరిస్థితులలోనైన నమ్మదగిన మీ ఆత్మ బంధువు ' హిందూ హెల్ప్ లైన్ '
ఆధ్యాత్మిక క్షేత్రాలలో భక్తులకు హిందూ హెల్ప్ లైన్ అన్ని విధాలుగా సహాయపడుతుంది : ప్రవీణ్ జి తొగాడియ
Reviewed by JAGARANA
on
1:15 PM
Rating:
No comments: