Top Ad unit 728 × 90

వార్తా హైందవం

recent

పులితోలు కప్పుకుంటున్న కమ్యూనిస్టులు


A Janmashtami march organised by CPI(M) in Azhikode | A Sanesh

హిందుత్వం మాటెత్తితే చాలు మండిపడతారు మనదేశంలోని కమ్యూనిస్టులు. ఒంటిపై తేళ్ళు, జెర్రులూ పాకినట్లు గంగ వెర్రులెత్తి పోతారు. అలాంటిది ఇటీవల కేరళలో కమ్యూనిస్టు పార్టీ వాళ్ళు (CPM - M) కృష్ణాష్టమి వేడుకలను అత్యుత్సాహంతో జరిపారు. దేశంలోని హిందూత్వ శక్తులు బలపడుతూండ దాన్ని జీర్ణించుకోలేని కేరళ కమ్యూనిస్టులు జనాలని తమవైపు ఆకర్షించడానికి ఈ వేడుకలను ఘనంగా నిర్వహించారు. 

శ్రీకృష్ణాష్టమి సందడి అయిపోయిందిగా. ఇప్పుడు తాజాగా జాతీయ దినాల మీద పడ్డారు కమ్యూనిస్టులు. ఇకమీదట జాతీయ సైన్సు దినోత్సవం, జాతీయ పర్యావరణ దినోత్సవం, జాతీయ యువజన దినోత్సవం (వివేకానంద జయంతి), ప్రవాసీ దినోత్సవం, జాతీయ అమరవీరుల దినోత్సవం, జాతీయ గ్రంధపఠన దినోత్సవం వంటి సందర్భాలను ఘనంగా నిర్వహించాలని కేరళలోని అన్ని జిల్లాల పార్టీ శాఖలకు ఆదేశాలు వెళ్ళాయి. రాబోయే గాంధీ జయంతి (అక్టోబర్ 2, 2015) నుండి ఈ వేడుకలను నిర్వహించడం ప్రారంభిస్తారు. 

ఈ విషయమై మాట్లాడుతూ కమ్యూనిస్టు పార్టీ సీనియర్ నేత ఒకరు, "మతతత్వ శక్తుల ప్రభావాన్ని అదుపుచేయడానికి ఈ కార్యక్రమాలు చేపట్టవలసిన అవసరాన్ని గుర్తించాం. దేశంలోని లౌకిక శక్తులు బలపడవలసిన అవసరం ఉంది. అందుకే ఈ వేడుకలను జరపాలని నిర్ణయించాం. మమ్మల్ని జాతి వ్యతిరేకులని అంటున్నారు. కానీ మేము జాతీయవాదులమే" అని అన్నారు. 

దేశంలోని అన్ని రాష్ట్రాల పార్టీ శాఖలకు ఆదేశాలు వెళ్ళినా ఒక్క కేరళ కమ్యూనిస్టులు మాత్రం ఈ జాతీయ వేడుకలను అత్యుత్సాహంతో నిర్వహిస్తున్నారు. 

కేరళలోని హిందువుల వోట్లను భారతీయ జనతా పార్టీ కొల్లగొట్టకుండా చూడడానికి సిపిఐ(ఎం) ఆ రాష్ట్రంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించింది. అందులో భాగంగా కృష్ణ వేషధారులైన బాలలచే కారల్ మార్క్స్ ఫ్లెక్సీలతో ఊరేగింపు చేయించింది.  అయితే దీనిపై పెద్ద ఎత్తునే విమర్శలు వచ్చిపడ్డాయి. దాంతో సిపిఐ(ఎం) చూపు జాతీయ వేడుకలపై పడింది. గతంలోనే ఈ వేడుకలను జరపాలని అనుకున్నా ఇప్పుడు వాటి నిర్వహణలో మరింత శ్రద్ధ వహించాలని అనుకుంటున్నట్లు కమ్యూనిస్టులు భావిస్తున్నారు. ప్రస్తుతం సిపిఐ(ఎం) గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటోంది. ఈ పరిస్థితి నుంచి గట్టెక్కడానికి జాతీయభావాలను అరువు తెచ్చుకుంటోంది. 

దీనికి తోడూ తాజాగా భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) భారతీయ పురాణాలు, వేదాలపై పడింది. ఇటీవలే ఆ పార్టీ "భారతీయం" పేరుతో 'సంప్రదాయక భారతీయ విజ్ఞాన వ్యవస్థ, భారతీయ తత్వము, సంస్కృతి, వేద కాలము, ఉపనిషత్తులు' అన్న అంశంపై మూడు రోజుల పాటు సెమినార్ నిర్వహించింది. 

భారతీయ సంస్కృతి పట్ల, భారత జాతీయ వీరుల పట్ల కమ్యూనిస్టులకి ఏనాడూ గౌరవం లేదు. మన జాతీయ మహనీయులను వారు ఎప్పుడూ నీచంగానే విమర్శిస్తూ వచ్చేరు. 

గతంలో నేతాజీ సుభాష్ చంద్ర బోస్ ని 'హిట్లర్ బూట్లు నాకిన కుక్క' అన్నారు. 1997లో దేశవ్యాప్తంగా అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఎబివిపి) నేతాజీ శతజయంతి ఉత్సవాలు నిర్వహిస్తుంటే 'మేం మాత్రం తక్కువా?' అంటూ పశ్చిమ బెంగాలులో నేతాజీ చిత్ర పటాలను తమ భుజాలపై పెట్టుకుని ఊరేగింపులు చేసారు అక్కడి కమ్యూనిస్టు విద్యార్థి సంఘాల వారు. 

స్వామీ వివేకానందను స్త్రీలోలుడు అంటూ నీచంగా విమర్శించారు కమ్యూనిస్టులు. కానీ 1993లో వివేకానంద చికాగో దిగ్విజయ శత వర్ష వేడుకలు ప్రపంచ వ్యాప్తంగా ఘనంగా జరుగుతూంటే కన్యాకుమారిలో కమ్యూనిస్టులు వివేకానందుని చిత్రపటాన్ని పెట్టి వేడుకలు జరిపారు. ఈ సందర్భంలో ఒక తమాషా జరిగింది. వేడుకలు జరపాలంటే వారికి వివేకానందుని చిత్రపటం కావాలి. వెంటనే అక్కడ ఉన్న వివేకానంద కేంద్రానికి వెళ్ళారు. స్వామీజీది ఒక పటం కావాలన్నారు. కేంద్రం వారు నిరభ్యంతరంగా ఒప్పుకున్నారు. మరి వివేకానందుడు కాషాయ వస్త్రాలు ధరిస్తాడుగా! కమ్యూనిస్టులకది గిట్టదు. స్వామీజీ వస్త్రాల రంగును మారుస్తామన్నారు. వివేకానంద కేంద్రం వారు దానికి నిరాకరిస్తూ చిత్రపటాన్ని ఇవ్వలేదు. "కాషాయ వస్త్రాలలో కాకుండా వేరే వస్త్రాలలో వివేకానందుని ఊహించలేం" అన్నారు. చివరికి ఎలాగో ఒకలా ఊళ్ళో వెతికి స్వామీజీది ఒక చిత్రపటం సంపాదించేరు. అయితే ఆ పటంలో స్వామీజీ వస్త్రాలకు నీలం రంగు వేసేరు. కాషాయం కాకపొతే ఏదో ఒక రంగు ఉందిగా. కమ్యూనిస్టులకు ఎంతో ఇష్టమైన ఎరుపు రంగు ఉందిగా. మరి స్వామీజీ వస్త్రాలకి నీలం రంగునే ఎందుకు వేసారు? 

అలాగే గతంలో భారతమాతని వేశ్య అని నీచంగా తూలనాడిన ఈ కమ్యూనిస్టులే ఇప్పుడు భారతీయ సంస్కృతీ గురించి, వేదాల గురించి గొప్పగా కబుర్లు చెబుతున్నారు.

మరి ఈ కమ్యూనిస్టులే "మతతత్వ" వాదుల నుండి కాపాడటానికి రేప్పొద్దున్న రామజన్మభూమిని నెత్తికెత్తుకున్నా ఆశ్చర్యపోనక్కర్లేదు.

ఎంత పులితోలు కప్పుకున్నా గాడిద గాడిదేగా !!

పులితోలు కప్పుకుంటున్న కమ్యూనిస్టులు Reviewed by rajakishor on 7:56 AM Rating: 5

No comments:

All Rights Reserved by రాష్ట్ర చేతన © 2015 - 2016
Designed by JOJOThemes

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.