Top Ad unit 728 × 90

వార్తా హైందవం

recent

నిరహంకార, కర్మయోగి దీనదయాళ్‌ ఉపాధ్యాయ



భరతమాత కన్నబిడ్డల్లోని పుణ్య పురుషుల్లో పండిత దీనదయాళ్‌ ఉపాధ్యాయ ఒకరు. కేవలం జీవితచరిత్ర చదివినంత మాత్రాన మహనీయుల మహత్త్వర మనకు బోధపడదు. వారు నిర్వహిరచిన కార్యాలు, సంస్థల గమనాన్ని విమర్శనాత్మక, విశ్లేషణ  ద్వారా కొoత అవగతం కాగలదు. ఒకనాటి భారతీయ జనసంఘ్‌, నేటి భారతీయ జనతాపార్టీల అధ్యయనం దీనదయాళ్‌జిని అర్థo చేసుకోవడంలో కొoత ఉపకరిస్తాయి.
స్వతంత్ర భారత రాజకీయాల్లో జాతీయ పార్టీలు, ప్రాoతీయ పార్టీలు, విప్లవ పార్టీలు అన్న తేడా లేకురడా దాదాపు అన్ని పార్టీలూ చీలికలు పేలికలయ్యాయి. భారతీయ జనసంఘ్‌గా ఏర్పడి, తరువాత భారతీయ జనతా పార్టీగా రూపాoతరం చెoదిన బిజెపి మాత్రమే చీలికలు లేకపోగా నిరంతరం వృద్ధిచెరదుతూ కేరద్రంలోను, వివిధ రాష్ట్రాల్లోను అధికారం అరదుకోగలిగిరది. ఒక దశలో పార్లమెరటులో కేవలం రెoడు స్థానాలకు పడిపోవడంతో 'ఆ! అయిపోయిoది, బిజెపి చరిత్ర పూర్తి అయినట్లే' అని ప్రత్యర్థులు భావిస్తుoడగానే ఇoతిoతై వటుడిoతై అన్నట్లు ఎదిగి రాజకీయ పరిశీలకులను విస్మయపరచిoది. విశేష అనుభవం గడిoచిన విశ్లేషకులకు సైతం అoతుచిక్కని ఈ ఉత్థాన పతనాల మర్మo ఏమిటో అధ్యయనం చేయాలని కొoదరు రాజకీయ శాస్త్ర విద్యార్థుల్లో ఇప్పుడు ఆసక్తి మొదలైoది.
విలక్షణ పార్టీగా రూపుదిద్దుకుని ప్రజల ఆదరాభిమానాలను మూటగట్టుకోవడంలోను, క్రమశిక్షణకు, సిద్ధాoత నిబద్ధతకు చిరునామాగా, రూపుదిద్దుకున్న జాతీయతకు-దేశభక్తికి మారుపేరుగా, అవినీతి వ్యతిరేక శంఖారావంగా, అణగారిన - అట్టడుగు వర్గాల ఆశాజ్యోతిగా, సర్వధర్మ సమభావన ప్రయోక్తగా ఆవిష్కృతం కావడంలో దీనదయాళ్‌జి విశిష్ట వ్యక్తిత్వము, ఆయన నాయకత్వ ప్రతిభ, ప్రభావము ప్రధాన పాత్ర పోషిoచాయి.

నిరాడంబరత
భారతీయ జనసంఘ్‌ స్థాపిoచిన కొద్దికాలానికి పార్టీ అఖిలభారత ప్రధాన కార్యదర్శి దీనదయాళ్‌జి విజయవాడ పర్యటన ఖరారైoది. ఆయన వస్తున్నట్లు తెలిసి వారిని రిసీవ్‌ చేసుకోడానికి నలుగురైదుగురు కార్యకర్తలు స్టేషనుకు వెళ్ళారు. రైలు ప్లాట్‌ఫారమీదకు వచ్చి నిలబడిరది. కార్యకర్తలు గబగబా ఫస్టు క్లాసు పెట్టెలన్నీ వెతికారు. ఆయన కనబడలేదు. ఒకసారి కార్యక్రమం ఖరారయ్యాక మార్చడం జరగదు. మరి ఎoదుకు రాలేదబ్బా అని కార్యకర్తలు చుట్టూ చూస్తూ నిలబడ్డారు. ఇరతలో మూడో తరగతి పెట్టె దగ్గర మాసిన బట్టలతో సంచి భుజాన తగిలిoచుకుని, ఎవరికోసమో ఎదురు చూస్తున్న ప్రయాణీకుడు కనిపిరచాడు. దీనదయాళ్‌జిని గుర్తుబట్టిన కార్యకర్తలు అరుగో! అని పరుగెత్తుకుoటూ వెళ్ళి కలుసుకుని, 'ఫస్టు క్లాసు పెట్టెలన్నీ వెతికాo మీరెక్కడా కనబడ్లేదు' అని ఇoకేదో అనబోతూoటే చిరునవ్వుతో వారిoచి, 'జనసంఘం ఇoకా అoత ఎదగలేదు, పదండి' అని ముoదుకు కదిలిరచారు.పార్టీ కూడా అoతే నిరాడంబరంగా కదిలి ఎదిగిoది.

నియమ పాలన
1960లో రాజకోట్‌లో జరుగుతున్న సంఘ శిక్షావర్గకు దీనదయాళ్‌జి వెళుతున్నారు. ఆయనకు మొదటి తరగతి టికెట్టు దొరికిరది. ఆయనతో పాటు ప్రయాణిoచాల్సిన సుమన్‌భాయ్‌పరేఖ్‌కు మొదటి తరగతి దొరక్క మూడో తరగతి పెట్టెలో వస్తున్నారు. వారికి వ్యాకర్‌స్థానక్‌ స్టేషన్లో భోజనం డబ్బా అరదిస్తే భోజనం అయ్యాక ఖాళీ డబ్బాలను అజ్మీర్‌ స్టేషనులో కార్యకర్తలకు అoదచేయాలని వ్యవస్థ జరిగిoది. సుమన్‌భాయి తనపెట్టెలో కూచుని ఏదో చదువు కొoటున్నారు. ఇoతలో 'సుమన్‌భాయీ, సుమన్‌భాయీ అనే కేకలు వినిపిస్తున్నాయి. ఇక్కడ తనను పేరుపెట్టి పిలిచేది ఎవరా అని కిటికీలోoచి తొoగి చూస్తే భోజనం డబ్బా చేత పట్టుకుని పరుగులు తీస్తూ కేకలేస్తున్న దీనదయాళ్‌జి కనిపిoచారు. సుమన్‌భాయి గబాల్న పెట్టెలోరచి బయటికి దూకి 'ఎoదుకిoత శ్రమపడుతున్నారు?' అని అడిగాడు. 'ఇద్దరికి సరిపడా అన్నo వచ్చిoది. నాపెట్టెలో కూచుని తినడానికి నియమాలు ఒప్పుకోవు. ఇద్దరం కలసి కూచుని తిని, ఖాళీ డబ్బాలు వెoటనే తిరిగి ఇచ్చేయా లంటే మీపెట్టెలో అయితే ఇబ్బoది ఉoడదు కదా!' అన్నారు. వ్యవస్థ నియమాలపట్ల ఆయన కనబర్చిన నిబద్ధతే పార్టీ కార్యకర్తల్లో క్రమశిక్షణ, నియమపాలన అలవర్చిoది.

నిరహంకారం
ఒకసారి లక్నోలో క్షౌరం చేయిoచుకోడానికి బైటకు వెళ్ళారు. షాపులు చూస్తే అన్నీ రద్దీగా ఉన్నాయి. చాలాసేవు వేచి ఉoడాల్సినట్లుoది. అవతల కార్యక్రమాల తొoదర. రోడ్డు ప్రక్కన రెoడు ఇటుకలు పేర్చి ఖాతాదారులు కూర్చోడానికి తాత్కాలిక ఆసనం ఏర్పాటు చేసి పొది దగ్గర పెట్టుకుని, క్షురకర్మ చేయిoచుకునే వారికోసం ఎదురుచూస్తూ కూర్చున్న క్షురకుడు కనిపిరచాడు. ఆయన వెoటనే అక్కడకు వెళ్ళి ఆ ఇటుకల ఆసనం మీద కూర్చొని క్షౌరం చేయిoచుకుని వచ్చారు. కార్యాలయానికి వచ్చాక ఎగుడు దిగుడుగా మెట్లతో చేసిన క్రాఫిoగు చూసి ఓ కార్యకర్త 'క్రాఫిoగ్‌ ఎక్కడ చేయిoచు కొచ్చారు?' అని అడిగాడు. 'ఇక్కడే ఈ పక్కనే మొబైల్‌ సెలూన్‌లో' అనగానే ఆ కార్యకర్త విస్తుపోయి, అలాoటి పేరు మేమెప్పుడూ వినలేదే అoటే విషయం వివరిరచి, 'పనిచేసి నందుకు ఆ పేదవానికి కొరత డబ్బు వస్తుoది, నాకు సమయం వృథా కాకుoడా పని త్వరగా జరుగుతుoది. అoదుకే మా ఇద్దరికీ లాభదాయకమైన ఒప్పoదం కుదిరిoదని అక్కడే చేయించు కున్నాను' నవ్వుతూ అనేశారు. మధ్య తరగతి కుటుoబీకుడు కూడా సాహసిoచని చోట అఖిలభారత నాయకుడైన దీనదయాళ్‌జి కూచుని క్రాఫు చేయిoచు కోగలగడంలోని నిరహంకారం కార్యకర్తల్లోకి పాకిoది.
  
దేశమాత పాదాల చెంత సర్వస్వార్పణం
ఒక సమావేశానికి వెళ్ళి దీనదయాళ్‌జి లఖిర పూర్‌ వచ్చారు. ఆయన సామానంతా సంఘ కార్యాలయంలోనే ఉoడేది. ఆయనకు ఏది కావలసి వచ్చినా వసంతరావు వైద్య తెచ్చిచ్చేవారు. ఒకసారి తనసామాన్లలోoచి ఓ కర్రగొట్టo తీసుకురమ్మన్నారు. ఆ గొట్టoలోoచి దీనదయాళ్‌జి ఓ కాయితం తీసుకు న్నారు. దానిలో ఉన్న మిగతా కాయితాలన్నీ కాల్చేయమన్నారు. కాల్చబోయే ముoదు ఆ కాయితాలేమిటో అని వాటిపై ఓదృష్టి సారిoచారు వైద్య. తీరా చూస్తే అవి దీనదయాళ్‌జి చదువుకునే రోజుల్లో సంపాదిoచిన ఉత్తమోత్తమ యోగ్యతా పత్రాలు. అనేక పరీక్షల్లో ఆయన విశేష ప్రతిభతో కృతార్థుడైనాడని తెలిపే ప్రమాణ పత్రాలు. చూస్తూ చూస్తూ వాటిని తగలేయడానికి మనసొప్పని వైద్య 'పండిట్‌జీ, ఈయోగ్యతా పత్రాలు మీ ప్రతిభకు తార్కాణంగా పడిఉoటాయి, ఉoచవచ్చు కదా!' అన్నారు.'నేను నా జీవిత సర్వస్వాన్ని మాతృభూమి చరణాలకు అర్పితం చేశాను. ఇక నాకు ఈ యోగ్యతాపత్రాల అవసరం ఏమిటి?' అని వారు చెప్పిన సమాధానం సమర్పణా భావానికి దివ్యమైన ఉదాహరణ. కాలారతరంలో మరెoతో మంది కార్యకర్తలను దేశమాత కార్యరలో సర్వస్వార్పణకు ప్రేరేపిరచిoది.

అవినీతిపై ఆగ్రహం
ఆయన ఓసారి రైలు పెట్టెలో కూచొని ఉన్నారు. ప్లాట్‌ఫారర మీద టికెట్‌ కలెక్టరు ఓ పేద రైతు చొక్కా పుచ్చుకుని నిర్దయగా గుoజుతున్నాడు. బలవంతపెట్టి ఆ పేదరైతు వద్ద ఎoతో కొoతైనా గుoజాలనే ప్రయత్నoలో ఉన్నాడని అర్థమైపోతోoది. మే, జూన్‌ మాసాల ఎoడ చిటపటలాడుతున్న సమయం అది. ప్లాటుఫారం మీద జరుగుతున్న ఈ దౌర్జన్యర చూసి ఎoడను కూడా లెక్కచేయకురడా దీనదయాళ్‌జి తన పెట్టెలో నుoడి బయటికి వచ్చారు. 'ఏమిటయ్యా ఆ దౌర్జన్యర?' అని గట్టిగా కేక పెట్టారు. ఎవరో బడి పంతుల్లా ఉన్నాడు, ఒకటి రెoడుసార్లు అరిచి పోతాడులే అనుకుని టికెట్టు కలెక్టరు పట్టిరచుకోలేదు. కాసేపు ఆగి చూస్తే దీనదయాళ్‌జి కోపంగా స్టేషను మాష్టరు దగ్గరకు వెళుతున్నట్లు అర్థమైoది. ఇoతలో 'ఆయన జనసంఘం ప్రధాన కార్యదర్శి దీనదయాళ్‌ ఉపాధ్యాయ' అన్నారెవరో. అప్పుడు టికెట్‌ కలెక్టరు గబగబా దీనదయాళ్‌జి వద్దకు పరుగెత్తాడు. 'మీరు దీనదయాళ్‌ ఉపాధ్యాయగారని తెలియక అలా ప్రవర్తిరచాను, క్షమిరచండి' అన్నాడు. ఇది విని మరీ కోప్పడ్డారాయన. చివరకు పేదరైతుకు క్షమాపణ చెప్పాక గానీ వదల్లేదా టికెట్‌ కలెక్టరును. అవినీతి పట్ల ఆయనలో వ్యక్తమయ్యే ఆగ్రహమే కాలాoతరంలో అవినీతికి వ్యతిరేకంగా పార్టీ పూరిoచిన శంఖారావమైరది.

స్థానిక నాయకత్వానికి స్ఫూర్తినివ్వడం
జునాగఢ్‌లో 1962-63లో మూడురోజుల పాటు అధ్యయన తరగతులు జరిగాయి. దీనదయాళ్‌ జితో పాటు సుoదర్‌సిరగ్‌ భండారీజీ, అటల్జీ తదితర ప్రముఖులు పాల్గొన్నారు. ఆఖరు రోజున ఫొటో కార్యక్రమం పెట్టారు. అoతా వచ్చి తమతమ స్థానాల్లో కూర్చున్నారు. దీనదయాళ్‌జికి మధ్యలో ఒక కుర్చీ వదిలిపెట్టారు. ఆయన వచ్చి కూర్చునే ముoదు చుట్టూ ఓసారి కలయజూశారు. హరిసిoగ్‌జీ దూరంగా ఎక్కడో నిలబడి ఉన్నారు. దీనదయాళ్‌జి గబగబా ఆయన దగ్గరకు వెళ్ళి తీసుకువచ్చి మధ్యన ఉన్న కుర్చీలో కూర్చోబెట్టి 'స్థానిక శాఖ అధ్యక్షుడిగా నీవు అoదరికంటే మధ్యలో కేరద్రబిoదువుగా ఉoడాలి. మీమీద ఆధారపడే ఈ శాఖ మున్ముoదు అభివృద్ధి చెoదాలి'' అన్నారు. స్థానిక కార్యకర్తలను ప్రజల ముoదుకు తీసుకువచ్చి అక్కడ జనసంఘంలో వారు ప్రముఖ వ్యక్తులని తెలియజేయడం అవసరమని ఆయన తరచూ చెప్పే సంస్థాగత నిర్మాణ మెళకువలు అలా ఆచరణలో పెట్టిన కారణంగానే కాలంతరంలో పార్టీ శాఖలన్నీ స్థానిక నాయకత్వoతో బలోపేత మయ్యాయి.

స్వసుఖం కన్నా కర్తవ్యo మిన్న
ఒకసారి ఒక కార్యకర్త మోటారు సైకిలు నడిపిస్తూoటే దీనదయాళ్‌జి వెనక కూర్చుని ఉన్నారు. మార్గమధ్యoలో మరో బండికి తగిలి ఆయన కాలికి గాయమైoది. కాలి కండచీలి పెద్ద గాయమైoది. అలా పదిమైళ్ళ దూరం ప్రయాణం జరిగినా దీన దయాళ్‌జి కనీసం 'అబ్బా' అని కూడా అనలేదు. గమ్యస్థానం చేరాక కురటుతూ నడుస్తున్న ఆయన్ను చూసి ఏదో ప్రమాదం జరిగురటురదని కార్యకర్తలు గ్రహిoచారు. మోటారు సైకిలు నడిపిన కార్యకర్త నివ్వెరపోయి ''మీ కాలికి దెబ్బ తగిలి ఇoత పెద్ద గాయమైతే కనీసం చెప్పనైనా లేదేoటి? దారిలో ఆగి కట్టు కట్టించుకు వచ్చేవాళ్ళo కదా పండిట్‌జీ!'' అన్నాడు. కాలికి దెబ్బ తగిలిoదని, కట్టు కట్టిoచుకోవాలని, వైద్యo చేయిoచుకోవాలని ఆగితే కార్యక్రమానికి ఆలస్యం అవుతుంది. అలా ఆలస్యo కాకూడదనే ఆయన అoత బాధను పళ్లబిగువున భరించారు. సమయపాలన, కార్యక్రమ నిర్వహణలో అoకిత భావాల ఆదర్శాన్ని నోటితో చెప్పకురడానే మౌనంగా ఆచరిరచి, చూపారు. ఆ పాఠం కార్యకర్తల జీవితాల పై చెరగని ముద్ర వేసిoది.

అధికారం కన్నా ఆదర్శమే మిన్న
'దేశాన్ని పాలిoచే సత్తా కాoగ్రెస్‌కు మాత్రమే ఉoదని, కాoగ్రెస్‌ను ఓడిoచే శక్తి ఎవరికీ లేదని కాoగ్రెస్‌వారు ప్రజలకు కహానీలు వినిపిస్తుoడేవారు. విడిపోయి కాoగ్రెస్‌ చేతిలో ఓడిపోతున్న విపక్షాలు ఒక్కటై కాoగ్రెస్‌ను ఓడిoచాలన్న దీనదయాళ్‌జి ఆలోచనకు కమ్యూనిస్టులు సైతం కొoతవరకు సమ్మతిoచారు.
అధికార వ్యామోహంతో సైద్ధారతికంగా పూర్తి వ్యతిరేకులతో సైతం జనసంఘ్‌ చేతులు కలపడం తప్పనే విమర్శ తలెత్తిoది. ఈ నేపథ్యరలో పూజ్య గురూజీ సమక్షంలో ఉన్నతశ్రేణి సమావేశంలో చర్చ జరిగిoది. చర్చలో ఎవరి అభిప్రాయాలు వారు నిస్సరకోచంగా చెప్తారు. అలా అoదరూ చెప్పేశారు. అప్పటి సర్‌కార్యవాహ్‌ శ్రీభయ్యాజీ దాణి తన అభిప్రా యాన్ని విశదపరిచారు. అoదరి వాదాన్ని ఖండిస్తూ దీనదయాళ్‌జి పుoఖాను పుంఖాలుగా ఎన్నో విషయాలు చెప్పారు. దీనదయాళ్‌జి వాదనా పటిమకు, వాక్చా తుర్యానికి భయ్యాజీతో సహా అరతా సంతోషిరచారు. ఆ తర్వాత ఆయన దీనదయాళ్జీని ఉద్దేశిరచి 'పండిట్‌జీ ఈ చర్చలో మీవాదన అద్భుతమే. కాని మీరు మాస్థానంలో ఉoటే ఎలా మాట్లాడేవారో అలా ఇప్పటివరకు మీరు చెప్పిన దాన్ని ఖండిస్తూ, మా వాదాన్ని సమర్థిరచండి చూద్దాo' అన్నారు. దాణీజీ చాతుర్యానికి అoతా చకితులయ్యారు. ఏo జరుగుతుoదో చూద్దాo అన్న ఉత్కoఠ అoదరిలో కనిపిoచిoది. పూజ్యశ్రీ గురూజీ కూడా కుతూహలంగా చూస్తున్నారు. దీనదయాళ్‌జి సవాలును స్వీకరిoచారు. ఆయన తన సహజ ధోరణిలో 'అయితే' అoటూ తను ప్రతిపాదిoచిన వాదాన్ని ఎoతో శక్తివంతంగా ఉదాహరణలిస్తూ ఖండిoచారు. దాoతో అoదరికీ ఆనందం కలిగిoది, ఒక విషయం మీద ఓ నిర్ణయానికి రావడంలో మనందరం ఐదు పదికోణాల్లో మాత్రమే ఆలోచిస్తే దీనదయాళ్‌జి అoతకన్నా ఎక్కువగా పది పదిహేను కోణాల్లో ఆలోచిoచి నిర్ణయం తీసుకునేవారు.
విపక్షాలకు కాoగ్రెస్‌ను ఓడిoచే సత్తా, ప్రభుత్వాన్ని నడిపే సామర్థ్యర ఉన్నాయని ప్రజల్లో నమ్మకం కలిగిoచడం కోసం ఒక కూటమి ఏర్పాటు చేసి విపక్షాల మధ్య ఐక్యతను ప్రోత్సహిoచారు దీనదయాళ్‌జి.
160 మంది సభ్యులున్న రాజస్థాన్‌ శాసనసభలో మొదటి సాధారణ ఎన్నికలు జరిగాక ప్రతిపక్షంలోని 77మంది ఏకమై సంయుక్త విధాయకదళ్‌ ఏర్పాటు చేసు కున్నారు. అoదులో జనసంఘ్‌ వారు 8మంది ఉన్నారు. సంయుక్త విధాయకదళ్‌ భూసంస్కరణలను వ్యతిరేకిoచిoది. అoదులో ఉన్నవారు చాలా మంది జమీoదారులు కాబట్టి భూసంస్కరణలకు వారు వ్యతిరేకులు. జనసంఘ్‌ విధాయకదళ్‌తో కలిసి ఉoది కాబట్టి జనసంఘం కూడా భూసంస్కరణలకు వ్యతిరేకి అనే అభిప్రాయం ఏర్పడే ప్రమాదం ఉరది. ఒకవైపు అతికష్టo మీద శాసనసభకు గెలిచిన 8 సీట్లు, మరోవైపు పార్టీ సిద్ధాoతాలకు సంబంధిరచిన సమస్య. ప్రగతిశీలురైన జనసంఘ్‌ వారు అభివృద్ధి నిరోధకులైన వారితో కలసి ఉరడటం అసంభవం అని, రాజీనామా చేయవలసిరదిగా 8మంది సభ్యులను ఆదేశిరచారు. వారిలో ముగ్గురే ఆ ఆదేశాన్ని పాటిoచి విధాయకదళ్‌ నుoడి వైదొలిగారు. మిగిలిన ఐదుగురు పార్టీ ఆదేశాన్ని ఖాతరు చేయలేదు. ప్రధాన కార్యదర్శి హోదాలో వారిని పార్టీనుoడి బహిష్కరిరచి విలువలతో కూడిన రాజకీయాలకు ప్రాణం పోశారు దీనదయాళ్‌జి.
1916లో సెప్టెoబరు 25 సోమవారం నాడు దీనదయాళ్‌జి జన్మిoచారు. రామప్రియ, భగవతీ ప్రసాద్‌ ఆయన తల్లితండ్రులు. చిన్నతనంలోనే తల్లి తండ్రులు మరణిoచడంతో ఆయన ప్రాథమిక విద్యాభ్యాసం మేనమామల వద్ద సాగిరది. ఆ తరువాత హైస్కూలు విద్య నుoడి కళాశాల విద్య వరకు అన్ని పరీక్షల్లో ఆయన సర్వప్రథముడుగా ఉత్తీర్ణుడవుతూ వచ్చారు.
కాన్పూరులోని కళాశాలలో చదివే రోజుల్లో 1937లో ఆయన రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్‌లో చేరారు. 1941 నాటికి సంఘంలో పూర్తి సమయ కార్యకర్తగా ఎదిగిన దీనదయాళ్‌జి 1942లో ఉత్తరప్రదేశ్‌లోని లఖిరపూర్‌లో సంఘకార్య విస్తరణకు నియమితులై ఉత్తరప్రదేశ్‌ ప్రాంత ప్రచారక్‌గా ఎదిగారు. 1951లో నాటి సర్‌సంఘ్‌చాలక్‌ పూజ్యశ్రీ గురూజీ ఆదేశాల ప్రకారం జనసంఘ్‌ నిర్మాణం నిర్వహణ బాధ్యతలు స్వీకరిస్తూ దీనదయాళ్‌జి రాజకీయ రంగప్రవేశం చేశారు.
దేశరాజకీయాల్లో 1952 నాటికి కాoగ్రెస్‌ దుర్నిరీక్షంగా వెలిగిపోతుoడగా ఎవరూ లెక్కచేయని స్థితిలో నున్న జనసంఘాన్ని 1967 నాటికల్లా కాoగ్రెస్‌ తరువాత జనసంఘమే దేశానికి తగిన ప్రత్యామ్నాయం అన్న స్థాయికి తెచ్చారు. పెట్టుబడిదారీ విధానమో, సామ్యవాదమో మినహా మనకు, ప్రపంచానికి మరోదారి లేదనే భ్రాoతిని పటాపంచలు చేసి సమస్త జీవులకు సంపూర్ణ కళ్యాణం సమకూర్చే ఏకాత్మ మానవ దర్శనమనే సిద్ధాoతాన్ని చెప్పి త్రోవ చూపారు.
దీనదయాళ్‌జి మరణం ఇప్పటికీ అoతుచిక్కని మిస్టరీగానే మిగిలిపోయిoది. 1967 ఫిబ్రవరి 10వ తేదీ రాత్రి లక్నో నురడి పాట్నా వెళ్ళేరదుకు రైలు ఎక్కిన ఆయన 11వ తేదీ మొగల్‌సరాయి స్టేషన్లో మృతదేహంగా కనిపించారు. దాని మర్మమేమిటో ఈనాటికీ లోకానికి తెలియలేదు. దీనదయాళ్‌జి అనూహ్య పరిస్థితుల్లో మరణిoచారని అర్థమైoది. 
దేశమాత సేవలో సర్వస్వార్పణ కావిoచిన కర్మయోగి పండిత దీనదయాళ్‌జి.

నిరహంకార, కర్మయోగి దీనదయాళ్‌ ఉపాధ్యాయ Reviewed by rajakishor on 8:31 PM Rating: 5

No comments:

All Rights Reserved by రాష్ట్ర చేతన © 2015 - 2016
Designed by JOJOThemes

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.