Top Ad unit 728 × 90

వార్తా హైందవం

recent

ఏకాత్మ మానవ దర్శనం

ఈరోజు (సెప్టెంబర్ 25) పండిత దీనదయాళ్ ఉపాధ్యాయ జయంతి. ఇది ఆయన శతజయంతి సంవత్సరం కూడా. ఈ సందర్భంగా క్రింది వ్యాసం చదవండి. 

మానవ జీవన లక్ష్యం ఉన్నతి, పరిణతి.

ప్రపంచం అనగానే మన స్ఫురణకు వచ్చేది ఏది? మానవజాతి. ఈ భూగోళంలో నివసిస్తున్న మనుషులే ప్రపంచంగా మనం భావిస్తాం. అంతేకాదు, ప్రపంచం అనగానే వేల సంవత్సరాలుగా సమూహాలుగా, జాతులుగా కొనసాగిన మానవ జీవన ప్రయాణం, ఈ ప్రయాణంలో మానవ జాతి గతిని నిర్దేశించిన ఆలోచనా సరళి, కట్టుబాట్లు, మతసాంఘికపరిపానా వ్యవస్థలు, ఆహారము, విద్య, కళలు, శాస్త్రా అభివృద్ధి, భాషలు, సాహిత్యం, సాంకేతిక పరిజ్ఞానం` ఇంకా ఎన్నో విధాలుగా సాగిన మానవ జీవన విస్ఫోటనము, వికాసము మన ముందు ఆవిష్కృతం అవుతుంది. ప్రపంచం అంటే మనుషుల మధ్య ఉద్వేగాలు, సంబంధాలూ అన్నీనూ.

వెయ్యేళ్ళ క్రితం సింహానికి ఇప్పటి సింహానికి, వెయ్యేళ్ళ క్రితం మఱ్ఱిచెట్టుకి ఇప్పటి మఱ్ఱిచెట్టుకి, వెయ్యేళ్ళ క్రితం కుక్కకి ఇప్పటి కుక్కకి తేడా లేదు, ఏరకంగా చూసినా. ఇది అన్ని జంతువులకు, చెట్లు, చేమలకు వర్తిస్తుంది. కారణం వాటి జీవనానికి ఒక క్ష్యం లేదు. వాటి పరిణతి ఒక పరిమితికే లోబడి వుంది. 

కానీ, మానవుని విషయం అలా కాదు. వెయ్యేళ్ళ క్రితం మనిషికి నేటి మనిషికి ఊహించలేని వ్యత్యాసం వుంది. అంతెందుకు, నిన్నటి మనిషికి నేటి మనిషికి ఎంతో వ్యత్యాసం వుంది. మానవ జీవనం నిరంతర పరిణామశీమైనది. 
చెట్లు చేమలు లేదా జంతువుల విషయంలో అవి ఆహారం సమకూర్చుకునే పద్ధతులు, పునరుత్పత్తి విధానం, అవి చేసే శబ్దాలు, ప్రకృతి ఉత్పాతాల నుండి తమను రక్షించుకునే పద్ధతులు, ఒకదానితో ఒకటి మసలుకునే పద్ధతులు, భయాలు, ఇతర లక్షణాలు అవి ఈ భూమిపై జీవరాశిగా ఉద్భవించినప్పుడు ఎలా వుండేవో ఇన్ని వేల, లక్షల సంవత్సరాల తరువాత ఇప్పటికీ అలానే వున్నాయి. ఎటువంటి పరిణామం లేదు.

జీవరాసులన్నీ యాంత్రిక జీవితాన్నే గడుపుతాయి. మనిషి ఒక్కడే అసాధారణంగా మార్పు చెందగలిగినవాడు. లక్ష సంవత్సరా క్రితం మనిషి ఆదిమానవుడు, లేదా ఆటవికుడు అంటున్నాం. మరి జంతువులు, చెట్లు, చేమల విషయంలో అలా లేదే. ఎందుకని? ఈ భూమిపై పరిణామశీత కలిగిన ఒకే ఒక్క ప్రాణి మనిషి.

లక్ష సంవత్సరాల పూర్వం మనిషి పచ్చి మాంసం తినేవాడు. శరీరాన్ని ఆకుతో కప్పుకునేవాడు. పెద్దపెద్ద కేకలతో, వింత శబ్దాలతో మరొకరితో సంభాషించేవాడు. తన పరోక్షంలోనున్న వారికి ఏదైనా తెలియజేయాంటే బొమ్మరూపంలో సంకేతాలను చిత్రించేవాడు. ఎక్కడికైనా వెళ్ళాంటే కాలినడకే గతి. నివాసానికి చెట్టు కొమ్మలనూ, కొండ గుహలనూ ఉపయోగించేవాడు.

కానీ లక్షల సంవత్సరాల మానవ జీవనయానంలో ఎన్ని పరిణామాలు చోటుచేసుకున్నాయి! మానవ జీవన పరిణామంలో ఎన్నో భాషలు పుట్టుకొచ్చేయి. కళలు ఆవిర్భవించేయి. మత, సాంఘిక, రాజకీయ వ్యవస్థలు ఆవిష్కృతమయ్యేయి. జ్ఞాన, విజ్ఞాన శాస్త్రాల విస్ఫోటనం జరిగింది. మానవ సంబంధాలలో కుటుంబ, సామాజిక, జాతి వ్యవస్థలు ఏర్పడ్డాయి. మనిషి ఆహారపుటలవాట్లు మారుతున్నాయి. ఆహారమే మారుతోంది. తను చూడగలిగిన వాటిపైన, చూడని, చూడలేని వాటిపైన మనిషి ఎన్నో రకాల నమ్మకాలు, సిద్ధాంతాలు రూపొందించుకుంటున్నాడు.

ఈ పరిణామం ఎక్కడో ఒకచోట ఆగుతోందా అంటే లేదే! తరానికి తరానికి, జాతికి జాతికి, ప్రాంతానికీ ప్రాంతానికీ మధ్య మాట్లాడే భాషలో మార్పు, తీసుకునే ఆహారంలో మార్పు, అవాట్లలో మార్పు, కట్టుబొట్టులో మార్పు, సంబంధబాధవ్యాలలో మార్పు, నమ్మకాలలో మార్పు, విద్యలో మార్పు, మతసామాజికరాజకీయ వ్యవస్థలలో మార్పు. మొత్తం మీద మనిషి వ్యక్తిగా, కుటుంబంగా, సమాజంగా తనని తాను అభివ్యక్తీకరించుకోవడంలో ఎంతో వైవిధ్యం. అందులో మళ్ళీ కాలంతో పాటు ఎన్నో మార్పు.

కారణం మనిషి నిరంతర పరిణామశీలి. భౌతికంగా గాని, బౌద్ధికంగా గాని, మానసికంగా గాని, వ్యక్తిగా, కుటుంబంగా లేదా సామాజికంగా గాని మనిషి ఎప్పుడూ ఒకే స్థాయిలో ఉండిపోవానుకోడు. ఎప్పటికప్పుడు మరింత ఉన్నత స్థాయికి చేరుకోవానుకుంటాడు. ఈ ప్రయత్నంలోనే మనిషిలో ఎన్నో మార్పులు, వైవిధ్యాలు. ఇదే మానవజాతి పరిణామశీలత. ఈ రోజు కన్నా మరింత మెరుగైన రేపటి కోసమే మనిషి నిరంతర ప్రయాణం.

అందుకే మానవజాతి లక్ష్యం ఉన్నతి, పరిణతి. ఈ పరిణతి యొక్క సాకారరూపమే ఏకాత్మమానవదర్శనం.

ఈ ఏకాత్మ మానవ దర్శనానికి ఆధారం ధర్మము.

మరి ధర్మమంటే ఏమిటి? ఏ రకమైన ప్రవర్తన వల్ల మానవజాతి, సమస్త ప్రాణులు, ఈ విశ్వమునందలి జడచేతనములన్నీ చిరకాలము సుఖంగా, సంతోషంగా జీవించగలుగుతాయో అటువంటి ప్రవర్తనయే ధర్మము.

అసలు ధర్మం ఎక్కడి నుంచి వచ్చింది? ఎప్పుడు ప్రారంభమైంది? దానికి సృష్టికర్త ఎవరు?

భూమి మీదున్న అన్ని జాతులకూ ఒక్కొక్క ధర్మం ఉన్నది వాటి వాటి స్వభావాన్ననుసరించి. ధర్మం లేని జాతి భూమి మీద లేదు. మరి వాటి ధర్మం ఎక్కడి నుంచి వచ్చింది? వాటి ధర్మానికి స్రష్ట ఎవరు?

ధర్మం గురించి తెలుసుకోడానికి ఆధునికయుగంలో తమవి నాగరిక జాతుగా చెప్పుకొంటున్నవారు చేసిన పరిశోధనలు ఏవీ సత్ఫలితాలనివ్వలేదు. ఎందుకంటే ఆ నాగరిక జాతుల ధర్మాలు చాలా ప్రాచీనమైనవి. వాటి ప్రాధమిక అవస్థలు ఈనాడు లేవు. అవి ప్రాధమిక అవస్థల నుండి పూర్తిగా మారిపోయేయి. ఈనాడు ఎక్కడా వాటి ప్రాధమిక లక్షణాలు కనిపించవు. కారణం తమని వ్యాప్తి చెందించుకోవడం కోసం శతాబ్దాల తరబడి ఇతరులపై దురాక్రమణలు చేస్తూండడంలో ఆ జాతు తమ స్వస్వరూపాన్ని కోల్పోయేయి. జాతిగతమైన తమ సహజ స్వభావానికి దూరమైనాయి.

ధర్మం గురించి తొసుకోవాలంటే మానవ సమాజాల పైపై స్వరూపాలను గాక మానవ జీవితపు లోతుల్లోకి వెళ్ళాలి. మానవ జీవితపు మూల స్వభావాన్ని తెలుసుకోవాలి.

శరీరం కన్న చైతన్యం పూర్తిగా భిన్నమైనది. మానవుడు చనిపోయిన తరువాత కూడా అతని శరీరం అలానే వుంటుంది. కాని అది ఏమీ చేయలేదు. అతని శరీరం నుండి ఒక ప్రధాన వస్తువు వెళ్ళిపోయింది. అందుకే ఆ శరీరం ఏ పనీ చేయలేకపోతున్నది. అంటే శరీరంలో జీవత్వానికి బలం కాక, శరీరం కన్నా భిన్నమైన జీవపదార్థం మరొకటి ఉన్నదన్నమాట.  అదే జీవము, ప్రాణము.

ఈ జీవము కేవం మనుష్యులలోనే కాక, చెట్లు చేమలలో కూడా ఉంటుంది. చెట్లుచేమలలో జీవం లేదా ప్రాణం ఉన్నంత వరకూ వాటికి ఆకులు వస్తాయి. పూలు పూస్తాయి. పండ్లు కాస్తాయి. వృద్ధి చెందుతాయి. ఆ జీవం లేకపోతే చెట్లు పుష్పించవు, ఫలించవు. ఎండిపోయి నశిస్తాయి. అయితే చెట్లుచేమలలో ఉన్న జీవ పదార్థంలో ఒక తేడా ఉన్నది. అదేమిటంటే చెట్లు కదలవు, మాట్లాడలేవు. తమ ఇష్టానుసారం ఏమీ చేయలేవు.

అందువల్ల మనుష్యుడు జ్ఞానమార్గంలో ఒక అడుగు ముందున్నాడు. కారణం ఏమిటంటే శరీరంలో జీవం కన్న మరొక పదార్థమున్నదని అదే చైతన్యమని, జ్ఞానమని చెప్తారు.

మనిషి చనిపోయినా, నిద్రిస్తున్నా, మూర్ఛలో ఉన్నా అతని శరీరం చైతన్యంలో ఉండదు. అందువల్ల శరీరము కంటె చైతన్యము భిన్నమైనదని గ్రహించాలి. మరి శరీరము లేనప్పుడు చైతన్యం ఉంటుందా? ఉంటే అది ఎక్కడ ఉంటుంది? ఎలా ఉంటుంది?

చైతన్యం మానవ శరీరం కంటె భిన్నమైనది కాబట్టి అది ఎక్కడైనా ఉండగలదు. ఎలాగైనా ఉండగలదు. ఏమైనా చేయగలదు. జీవుడు తన ఇష్ట ప్రకారం పనిచేయగలుగుతున్నాడంటే కారణం జీవునిలో చైతన్యం ఉంది. ఇది తెలుసుకోవడం ధర్మాన్ని తెలుసుకోవడంలో తొలి దశ. అంటే తనలోనే పనిచేస్తూన్న చైతన్యాన్ని తెలుసుకోవడం. తన అస్థిత్వం పట్ల మానవునికి కలిగే ఈ జ్ఞానమే ధర్మానికి మూము. 

ఈ చైతన్యాన్ని తెలుసుకోవడం అన్నది జంతువులలో లేదు. అందుకే వాటి జీవితం, ఎదుగుదల భౌతికావసరాులు తీరడం వరకే పరిమితమై వుంటాయి. కాబట్టి వాటికి తమలోని చైతన్యాన్ని గ్రహించలేవు. ఆ జ్ఞానం వాటికి వుండదు. జ్ఞానం లేనివాటికి ధర్మం ఏమిటి? అధర్మం ఏమిటి? 

ఆహార నిద్రా భయ మైధునంచ సామాన్యమేతత్‌ పశుభిన్నరాణాం
ధర్మేణ తేషాం అధికో విశేషో ధర్మస్య హీనాం పశుభిస్సమానాః 
తిండితినడం, నిద్రపోవడం, భయము, సంభోగము పశువులోను, మనిషిలోను సహజంగా వుండేవే. మరి మనిషి గొప్పతనం ఏమిటి? ధర్మము. ధర్మము పట్ల జ్ఞానమే, ధర్మాచరణయే మనిషిని పశువునుండి విభిన్నంగా, విశిష్టంగా చేస్తోంది. దర్మం పట్ల ఎరుక, ధర్మాచరణ లేని మనిషి పశుత్యుడే.

మనిషిలో ప్రేరణశక్తిగా పనిచేసే చైతన్యమే ఇతర ప్రాణులలో, జడపదార్థాలలో కూడా చరిస్తూంటుంది. ఇది తెలుసుకోవడం ధర్మాన్ని అర్థంచేసుకోవడంలో రెండవ దశ. అంటే తమలో గల చైతన్యమే ఇతర ప్రాణులలో, జడములలో వాటివాటి స్వభావానుసారం చరిస్తోందని తెలుసుకోవడం.

అలాగే విశాల అంతరిక్షంలో మేఘాలు, నక్షత్రాలు, గ్రహాలు, సూర్యుడు, చంద్రుడు, అగ్ని, జలము, వాయువు మొదలైనవి వాటివాటి స్వభావాన్ననుసరించే చరిస్తాయి. మన ఇష్టాన్ని బట్టి కాదు. మరి వీటన్నింటిలో ప్రబమైన శక్తిగా పనిచేస్తున్న చైతన్యాన్ని తెలుసుకోవాలి. అంటే వ్రాసేటప్పుడు నీ చేతిని కదిపే శక్తీ, భూమి చుట్టూ చంద్రుని తిప్పే శక్తీ ఒకటే అని తెలుసుకోవడం. ఆ శక్తికి మూలమైన చైతన్యాన్ని గ్రహించడం. ఇది ధర్మాన్ని గురించి తెలుసుకోవడంలో మూడవ దశ.

శక్తి వాహినిగా విశ్వమంతటా ఆవరించి, విశ్వమును ఒక క్రమంలో చరింపజేస్తున్న చైతన్యమే ధర్మసామ్రాజ్యము. మనిషి ఈ ధర్మసామ్రాజ్యంలోకి అడుగుపెట్టాలి. అంటే తన పట్లనే గాక సమస్త చరాచర జగత్తు యొక్క అస్థిత్వము పట్ల పరిపూర్ణమైన ఎరుకను కలిగియుండాలి. 

మానవ జీవితం ఎవరితోనూ సంబంధం లేని ఒంటరి ప్రయాణం కాదు. అది ఒక నిరంతర సమగ్ర వికాస ప్రక్రియ. మనిషి ఈ విశ్వములో సహజాంతర్భాగము. ఈ విశ్వములోని ప్రతి అంశతోనూ మానవ జీవితము పెనవేసుకొని వుంటుంది. అందుకే వ్యక్తి జీవితము వ్యష్టి-కుటుంబము-సమాజము-సమిష్ఠులుగా వికాసము పొంది పరమేష్ఠివైపు సాగే ప్రక్రియగా భారతీయ సంస్కృతి భావిస్తుంది. అంతేగాని కుటుంబము, సమాజము, సమిష్ఠుల పట్ల సంబంధం లేనిది కాదు మానవ జీవితం. అందుకే మానవునికి కుటుంబం పట్ల, సమాజము పట్ల, సమిష్ఠి అనగా సకల చరాచర జగత్తు పట్ల, తన పట్ల ఎంత బాధ్యత వుందో అంత బాధ్యత వుంది.

విశ్వమునందలి ప్రతి అంశ యొక్క మనుగడకు భంగము కాని విధంగా వుండాలి మన ఆలోచన, నడవడిక. ఇందుకు మనలో అంహింస, ప్రేమ, భక్తి వుండాలి. ఎందుకంటే ఇవే ధర్మమునకు మూలము. ఈ ధర్మము యొక్క జాగృతి మనలో కలిగినప్పుడు మనది అన్న అహంకార పరిధులను దాటి అన్నింటినీ సమానంగా ప్రేమించగలుగుతాం. అప్పుడు మనలో అహింస సహజంగా వికసిస్తుంది. అప్పుడు విశ్వమంతటా నిండియున్న చైతన్యము పట్ల మనలో భక్తి అంకురిస్తుంది. 

వ్యక్తి తన జీవన గమనంలో తనతోపాటుగా కుటుంబ, సమాజ, సమిష్టి అస్థిత్వాన్ని కాపాడుకుంటూ, తనతోపాటు వాటన్నింటి సమగ్ర వికాసానికి శ్రమిస్తూ (తన ఎదుగుదలకు వాటి అస్తిత్వాన్ని దెబ్బతీయకుండా) పరమేష్ఠిని చేరడమే మానవ జీవన పరమక్ష్యంగా భారతీయ సంస్కృతి చెప్తుంది. ఈ దివ్య జీవనమే అనాదిగా మన జాతి మనుగడను పరిపుష్ఠం చేస్తూ వస్తూన్నది. ఇదే మన సనాతన ధర్మము.

తనలో అన్నింటినీ, అన్నింటిలో తననీ చూడగలిగే ఈ ధర్మ జాగృతియే ఏకాత్మ మానవ దర్శమునకు భూమిక. ఈ దిశలో ఉన్నతిని, పరిణతిని సాధించడమే మానవ జీవన లక్ష్యం. సమస్త విశ్వము యొక్క శుభము ఇందులోనే ఇమిడియుంది.

ఏకాత్మ మానవ దర్శనం Reviewed by rajakishor on 1:00 PM Rating: 5

No comments:

All Rights Reserved by రాష్ట్ర చేతన © 2015 - 2016
Designed by JOJOThemes

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.