రాజ్యాంగ నిర్మాతల ఆలోచనలోనే రిజర్వేషన్ ఫలాలు బలహీనవర్గాలకు అందాలి : మోహన్ జి భాగవత్
క్రొత్త డిల్లి, 24/09/2015 : రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ పూజ్య సర్ సంఘ్ చాలక్ మాన్య శ్రీ మోహన్ జి భాగవత్ మాన్య దీనదయాళ్ జి జయంతి సందర్భంగా ఏకాత్మ మహావ దర్శనం అనే అంశం పై సంఘ్ అధికారిక వారపత్రికలు అర్గనైజర్ మరియు పాంచజన్య లకు ఇచ్చిన ఇంటర్ వ్యూ లో ఆయన చేసినట్లుగా మీడియాలో ప్రచారం అవుతున్న వార్తలపై రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అఖిల భారతీయ ప్రచార ప్రముఖ్ మాన్య శ్రీ డా మన్మోహన్ వైద్య పత్రిక ప్రకటన విడుదల చేసారు.
ఈ సందర్భంలో ఆయన మీడియా తో మాట్లాడుతూ ' పూజ్య సర్ సంఘ్ చాలక్ మాన్య శ్రీ మోహన్ జి భాగవత్ ప్రస్తుత రిజర్వేషన్ విధానం పై ఎలాంటి అవాంచనీయ వ్యాఖ్యలు చేయలేదు, వారు పాంచజన్య కు ఇచ్చిన ఇంటర్ వ్యూ లో భారత దేశ రాజ్యాంగ నిర్మాతలు ఏ ఉద్ద్యేశం తో అయితే రిజర్వేషన్ లు కల్పించారో, అదే ఆలోచన ధోరణిలో సమాజంలోని అన్ని బలహీన వర్గాలకు రిజర్వేషన్ ల ఫలాలు సక్రమంగా అందాలి, ఈ విషయంలో సమాజంలోని అన్ని వర్గాల మేధావులు కలసి కూర్చొని ఆలోచించాల్సి ఉంది అని మాత్రమే అని తన భావాన్ని వ్యక్తం చేసారు, దీని పై మీడియా లో అనవసర దుమారం రేగడం అవాంచనీయం ' అని అన్నారు.
రాజ్యాంగ నిర్మాతల ఆలోచనలోనే రిజర్వేషన్ ఫలాలు బలహీనవర్గాలకు అందాలి : మోహన్ జి భాగవత్
Reviewed by JAGARANA
on
9:34 AM
Rating:
Reviewed by JAGARANA
on
9:34 AM
Rating:

No comments: