ముగిసిన RSS తెలంగాణ ప్రాంత శృంగ వాద్య ప్రశిక్షణ వర్గ
షాద్ నగర్, హైదరాబాద్, 04/08/2015 : రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ శరీరిక్ శిక్షణలో భాగంగా ఘోష్ వాద్య ప్రశిక్షణలో భాగంగా ఈ నెల 1-3 తేదిలలో భాగ్యనగర్ సమీపంలోని షాద్ నగర్ లో తెలంగాణ ప్రాంత శృంగ వాద్య ప్రశిక్షణ వర్గ జరిగింది. ఈ వర్గలో తెలంగాణ వ్యాప్తంగా ఉన్న సంఘ 23 జిల్లాల నుండి 27 కేంద్రాలకు సంబంధించి 242 మంది శృంగ వాదకులు పాల్గొన్నారు, ఈ వర్గ మూడు రోజుల పాటు శిక్షార్ధులు అనేక రచనలు అభ్యాసం చేసారు తెలంగాణ ప్రాంత శరీరక్ ప్రముఖ్ మాన్య శ్రీ నర్సింగ్ రావ్ గారు, ప్రాంత ఘోష్ ప్రముఖ్ మాన్య శ్రీ యాదగిరి గారు మూడు రోజుల పాటు వర్గాలో మార్గ దర్శనం చేసారు.
వర్గ సమరొహ్ లో మాన్య శ్రీ దానం సుధాకర్ గారు మార్గదర్శనం చేస్తూ ' ఘోష్ పథ సంచలన్ కి ఉపిరి వంటిది, ఘోష్ వాదకులందరూ శుద్ధ వాదనను అభ్యాసం చేయాలి, ఘోష్ లో రుచి ఉన్న స్వయం సేవకులను గుర్తించి వారిని ఘోష్ వాదన వైపు ప్రోత్సహించాలి, వొచ్చే జనవరి లో అఖిల భారతీయ స్థాయిలో జరిగే ' స్వరాంజలి ' అఖిల భారతీయ శ్రుంగ వాదకుల శిభిరానికి ఎక్కువ మొత్తం లో మన ప్రాంతం నుండి పథక్ లు పాల్గొనాలి ' అని అన్నారు
ముగిసిన RSS తెలంగాణ ప్రాంత శృంగ వాద్య ప్రశిక్షణ వర్గ
Reviewed by JAGARANA
on
1:36 PM
Rating:

Post Comment
No comments: