Top Ad unit 728 × 90

వార్తా హైందవం

recent

చెప్పేటందుకే నీతులు


మన దేశంలో మతస్వేచ్ఛకు భంగం వాటిల్లుతోందని అమెరికా పార్లమెంటు - కాంగ్రెస్ - ఉపసంఘం వారు మార్చి 2015లో ఆరోపణ చేసింది. మరి మతస్వేచ్ఛ మనదేశంలోనే భంగమౌతోందా? ప్రపంచంలో ఇతర దేశాలు శాంతియుతంగానే జీవిస్తున్నాయా?

ఐరోపా దేశాల క్రైస్తవ స్వభావంలో మార్పు రాకూడదని వాటికన్ నగర రాజ్యాధిపతులైన పోప్‌లు పదేపదే పిలుపులనిస్తుంటారు. ఇలా పిలుపులను ఇవ్వడం సర్వమత సమభావానికి, ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధం కాదా? అమెరికా కాంగ్రెస్ ఉపసంఘం వారు పోప్‌లను ఎందుకు విమర్శించరు? తమవి ప్రజాస్వామ్య దేశాలుగా గొప్పగా చెప్పుకునే ఐరోపా వారు కూడా పోప్ పిలుపులను ఏనాడూ తిరస్కరించలేదు. 

సౌదీ అరేబియాలోను ఇస్లాంమత రాజ్య కూటమికి చెందిన దేశాలలోను ఇస్లామేతర మతస్థులు ప్రాధమిక హక్కులకు కూడా నోచుకోరు. ఇది ఏరకమైన స్వాతంత్ర్యం? అమెరికా పార్లమెంటు ఉపసంఘం సౌదీ అరేబియాను ఎందుకని విమర్శించదు? 

అమెరికాలోని వివిధ రకాల ఉన్మాదులు, భారతీయ సంతతి వారిపై దాడి చేస్తున్నారు. వివిధ దేశీయులపై దాడి చేస్తున్నారు. తెల్లని బీభత్సకారులు నల్లని తమ దేశం పౌరులనే నిరంతరం హత్య చేస్తున్నారు. మరి అమెరికాకి ఎవరు నీతులు చెప్తారు? 

ఇలా తమదేశంలోనే వైవిధ్యాలను సహించే ప్రవృత్తిని పెంపొందించడంలో శతాబ్దాలుగా ఘోరంగా విఫలమౌతున్న అమెరికా భారతదేశానికి నీతులు చెప్పడం విడ్డూరంగా లేదూ? 

ఏ మతతత్వ శక్తులు భారత్ ని 1947లో ఖండించేయో అవే శక్తులు మరోసారి భారత దేశాన్ని బద్దలు కొట్టడానికి ప్రయత్నిస్తున్నాయి. ఇది అమెరికాకి కనబడలేదా?

భారతదేశంలో త్రిపురలో శాంతి కాళీ మహరాజ్‌ను, ఒడిస్సాలో లక్ష్మణానంద యతీంద్రస్వామిని మత మార్పిడి ముఠాలకు చెందిన బీభత్సకారులు హత్య చేసారు. కానీ అమెరికా వారి నివేదికలో హిందూ జాతీయ సంస్థల వారు అల్ప సంఖ్యాకులపై దాడులు చేస్తున్నట్టు నిర్ధారించడం ఏవిధంగా సమర్థనీయం?

అనాదిగా అమెరికాలో నివసిస్తున్న జాతులను ఐరోపా వారు నిర్మూలించడం చారిత్రిక వాస్తవం. ఇలా నిర్మూలించిన ఐరోపా వాసులు అమెరికాలో ప్రస్తుతం అధిక సంఖ్యాకులైన తెల్ల జాతివారు. ఇలాంటి వారు మత సహిష్ణుకత గురించి భారత్‌కు పాఠాలు చెబుతున్నారు. ఎంత విడ్డూరం?

భారత్‌లో శతాబ్దులకు పూర్వం వందశాతం ప్రజలు హిందువులు. ఈ స్వజాతీయ మత సహిష్ణుత కారణంగా దేశంలో నిరంతరం సర్వమత సమభావం నెలకొని ఉంది. అందువల్లనే విదేశాలనుంచి వచ్చిన మతాలు ఈ దేశంలో పరిఢవిల్లాయి. ఈ మతాల వారి సంఖ్య నిరంతరం పెరగడం పెరుగుతుండడం చరిత్ర. అల్ప సంఖ్యాక మతవర్గాల వారు ఈ దేశంలో హాయిగా జీవిస్తున్నారడానికి పెరుగుదల ప్రత్యక్ష ప్రమాణం.



అయినా అమెరికా కాంగ్రెస్ ఉపసంఘం మాత్రం పనిగట్టుకుని మరీ మనల్ని విమర్శించింది. 

మరి చెప్పేటందుకే నీతులు అంటే ఇదేనేమో? 
చెప్పేటందుకే నీతులు Reviewed by rajakishor on 8:33 AM Rating: 5

No comments:

All Rights Reserved by రాష్ట్ర చేతన © 2015 - 2016
Designed by JOJOThemes

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.