1200 గ్రామాలు, 17 రాష్ట్రాలను తాకుతూ15000 KM పూర్తైన భారత్ పరిక్రమ పాద యాత్ర
పశ్చిమ బెంగాల్, 04/08/2015 : 60 కి పైగా వయస్సు ఉన్న రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ పూర్వ సేవా ప్రముఖ్ మాన్య శ్రీ సీతారామ కదిలాయ నేతృత్వంలో వహిస్తున్న " భారత్ పరిక్రమ పాద యాత్ర " ఈశాన్య రాష్ట్రాలను పూర్తీ చేసుకుని తిరిగి పశ్చిమ బెంగాల్ చేరుకుంది. గ్రామీణ భారత వికాసాన్ని ఉద్యేశ్యం లో పెట్టుకుని జరుగుతున్న ఈ యాత్రలో భాగంగా అనేక గ్రామాలలో వివిధ రూపాలలో అవగాహన కార్యక్రమాలు జరిగాయి. ఈ యాత్ర నిన్న అనగా తేది 03/08/2015, సోమవారం నాడు నోలోన్గిభారి గ్రామం, చూచిభిహర్ జిల్లా చేరుకోవడం తో యాత్ర 1090 వ రోజున 15,000 km మైలు రాయిని చేరుకుంది.
60 కి పైగా వయస్సు ఉన్న రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ పూర్వ అఖిల భారతీయ సేవా ప్రముఖ్ మాన్య శ్రీ సీతారామ కదిలియ 2012, ఆగస్ట్ నెలలో కన్యాకుమారి దగ్గర ప్రారంభమైన " భారత్ పరిక్రమ పాద యాత్ర " తన 1090 వ రోజున దాదాపు 15,000 km మైలు రాయిని చేరుకుంది, ఈ ప్రయాణంలో సుమారు 1200 కు పైచిలుకు గ్రామాలు, 17 రాష్ట్రాలకు తాకుతూ జరిగిన ఈ పాద యాత్ర లో గ్రామీణ వికాసం, జల వనరుల రక్షణ, గ్రామా స్వరాజ్యం తదితర అంశాల పట్ల అవగాహన కార్యక్రమాలు జరిగాయి.
1200 గ్రామాలు, 17 రాష్ట్రాలను తాకుతూ15000 KM పూర్తైన భారత్ పరిక్రమ పాద యాత్ర
Reviewed by JAGARANA
on
7:52 PM
Rating:

Post Comment
No comments: