ఘర్ వాపసి : తిరిగి హిందుత్వాన్ని స్వీకరించిన 3000 మంది మతం మారిన హిందువులు
బాగల్ కోట్, కర్ణాటక 03/08/2015 : విశ్వ హిందూ పరిషద్ ధర్మ ప్రసార సమితి అధ్వర్యంలో నిర్వహించిన పునరాగమణ కార్యక్రమంలో 10 గ్రామాలకు చెందిన సుమారు 3000 మందికి పైగా గతంలో క్రైస్తవులుగా మతం మారిన హిందువులు తిరిగి తమ మాతృధర్మం అయిన హిందుత్వాన్ని స్వీకరించారు. తేది 02/08/2015 ఆదివారం నాడు జరిగిన ఈ కార్యక్రమంలో ప్రముఖ సాధు సంతులు ఆధ్వర్యంలో యజ్ఞ కార్యక్రమం నిర్వహించడం జరిగింది, సాధువులందరూ హైందవ సోదరా సర్వే న హిందు పతితో భవేత్ అంటూ తమ సంకల్పాన్ని నిజం చేసే శక్తిని ఆ సర్వశక్తి వంతుడైన పరమేశ్వరుడు విశ్వ హిందూ పరిషత్ రూపంలో తమకు అందించారని అన్నారు.
విశ్వ హిందు పరిషద్ కి చెందిన ధర్మ ప్రసార సమితి కార్యకర్తలు గత కొంత కాలంగా చేస్తున్న విశేష కృషి సత్ఫలితాలను ఇస్తుంది, గతంలో అనేక ప్రలోభాల కారణంగా, బలవంతంగా క్రైస్తవం స్వీకరించినప్పటికీ తమ నరనరాల్లలో ఉన్న తమ పూర్వీకుల రక్తం ఇంకా హిందూ ధర్మాన్ని మర్చిపోనియ్యలేదు.
మహా రాణా ప్రతాప్ వంశజులు తమ పౌరుషాన్ని కోల్పోకూడదు : మాన్య జుగల్ కిషోర్ జి
ఈ సమావేశానికి మాన్య జుగల్ కిషోర్ జి విహిప అంతర్జాతీయ కార్యదర్శి మార్గదర్శనం చేస్తూ ' ప్రకృతినే భగవంతుడిగా ఆరాధించే సంస్కృతీ కేవలం హిందూ దర్మంలోనే ఉంది, ప్రకృతిని రక్షిస్తేనే మానవాళి జీవనం సక్రమంగా సుఖమయం అవుతుంది అనే ధారలో మన ఆరదన విధానం ఇమిడి ఉంది, నేడు మౌలికమైన అంశాన్ని వదిలి ప్రకృతిని నాశనం చేస్తున్న నాగరికులం అని చెప్పుకుంటున్న విధర్మీయ ఆరాధనా విధానం ప్రకృతిని కేవలం భోగ విలాసాలకు వాడుకోవడం వలన జరిగే నష్టాన్ని ఇప్పటికే ప్రపంచం అనుభవిస్తూ ఉంది, అలాంటి ప్రకృతి హితమైన ఆరాధనా విధానంలోకి తిరిగి వస్తున్న మీకు నా హృదయ పూర్వక ఆహ్వానం తెలుపుతున్నాను. మన పూర్వీకులైన సేవాలాల్ మహారాజ్ మహారాణా ప్రతాప్, మహారాణా చత్రసాల్, మహారాణి గైన్డిన్య్లు వారసత్వాన్ని ప్రత్యక్ష వారసులం అయిన వనవాసిలు వారి ఆశయ సాధనకు కృషి చేయాల్సి ఉంది' అని అన్నారు.
ఈ కార్యక్రమంలో ప్రముఖ విశ్వ హిందు పరిషద్ నాయకులు మాన్య శ్రీ జుగల్ కిషోర్ జి, మాన్య శ్రీ సత్యం గారు కేంద్రీయ సహా కార్యదర్శి (ధర్మ ప్రసార్), స్థానిక విశ్వ హిందూ పరిషద్ నాయకుల పాల్గొన్నారు.
ఘర్ వాపసి : తిరిగి హిందుత్వాన్ని స్వీకరించిన 3000 మంది మతం మారిన హిందువులు
Reviewed by JAGARANA
on
12:13 PM
Rating:

Post Comment
No comments: