Top Ad unit 728 × 90

వార్తా హైందవం

recent

సహనం లేనిది ఎవరికి?


జనవరి 2015లో మనదేశానికి వచ్చిన అమెరిక అధ్యక్షుడు బరాక్ ఒబామా భారతదేశంలో మత సామరస్యం కోరవడుతోందనీ, పరమత అసహనం పెరుగుతోందనీ విచారం వ్యక్తం చేసాడు. పరమత సహనం గురించి మనకేదో నీతి బోధ చేసాడు కూడా. అమెరికా పార్లమెంటు-కాంగ్రెస్- ఉపసంఘం వారు కూడా ఏప్రిల్ 2015లో మన దేశంలో మతస్వేచ్ఛకు భంగం వాటిల్లుతోందని ఆరోపణ చేసారు. 

నిజానికి పరమతాలూ ప్రవేశించక ముందే మనదేశంలో సంస్కృతీనాగరికతలు ప్రపంచ మానవాళికే ఆదర్శంగా విరాజిల్లుతూవున్నాయి. పరజాతీయులు, పరమతస్థులు ప్రవేశించాకే మనదేశంలో ఎన్నో విధ్వంసాలు, మానప్రాణ భంగాలు, దోపిడీలు జరగడం చారిత్రిక వాస్తవం. 

కొన్ని వందల ఏళ్ళుగా పరమతస్థుల దాడులను సహనంతో భరిస్తూ వారితో సహజీవనం చేస్తూనే ఉన్నారు హిందువులు. ధ్వంసమైన మన దేవాలయాలు, సంస్కృతీ చిహ్నాల శిథిలాలు పరాయివారి విలాస మందిరాల క్రింద పునాదులై అపవిత్రమౌతూంటే అది కళ్ళారా చూస్తూనే మౌనంగా రోదిస్తూ వారి పట్ల సహనంతోనే ఉంటున్నారు హిందువులు

స్వాతంత్ర్యం వచ్చి ఇన్నేళ్ళయినా ఇక్కడి జాతీయతత్త్వమైన హిండుత్వంపై ఎన్నో రకాలుగా దాడులు జరుగుతున్నా వాటన్నింటి పట్ల సహనంతోనే ఉంటున్నారు హిందువులు

పరమతస్థులు వారి వారి టి.వి. చానేల్లను పెట్టుకుని వాటి ద్వారా హిందూ సంస్కృతిని ఎన్నో రకాలుగా అవమానిస్తుంటే, అవహేళన చేస్తుంటే, హిందూ దేవీ దేవతలను కించపరుస్తూంటే హిందువులు సహనంతోనే ఉంటున్నారు

హిందువులను మతం మార్చడానికి ఎన్ని కుతంత్రాలు పన్నుతున్నారు? ఎన్ని దాడులు చేస్తున్నారు? ఎన్ని అత్యాచారాలకు ఒడిగడుతున్నారు? అయినా హిందువులు సహనంతోనే ఉంటున్నారు

హిందువులకు సహనం లేదని విమర్శించే పెద్దలు మరి పరమతాల పట్ల అసహనాన్ని వ్యక్తం చేసే ధోరణిని హిందువులలో ఎప్పుడైనా చూసేరా? నిదుల వల్ల వచ్చిన డబ్బును ఎర చూపి ఇతర మతాల వారిని మతం మార్చడం, వారిని హేళన చేయడం హిందువుల చరిత్రలోనే లేదు. ఏ హిందూ ఆధ్యాత్మిక చానెల్ కూడా పరమతాల పట్ల ఇసుమంత అగౌరవం కూడా ప్రదర్శించలేదు. 

వైవిధ్యం అనేది హిందూ సమాజంలో సహజ స్వాభావికమైనది. పరమత సహనం లేకపోవడం హైందవేతర మతాలకు స్వాభావికం. ఆ అసహనంతోనే వారు ఇతరులపై దాడులకు, విధ్వంసాలకు పాల్పడుతున్నారన్నది ప్రపంచ చారిత్రిక వాస్తవం. 

మనదేశంలోని మీడియా పరమత దేశాలకు కట్టు బానిస అయిపోయింది. వాటి ద్వారా తమ దేవీదేవతలు, విశ్వాసాలు, పవిత్ర గ్రంధాలు అత్యంత హేయంగా పరిహసింపబడుతున్నా హిందువులు సహనంతోనే ఉంటున్నారు

మరి వీటిని ఎవరైనా ప్రశ్నిస్తే ఈ దేశంలోని లౌకిక మేధావులు ఒక్కసారిగా అసహనంతో ఎగసి పడతారే? హిందువులకు సహనం లేదంటూ పెడబొబ్బలు పెడతారే? వీరితో అంతర్జాతీయ మీడియా కూడా గొంతు కలుపుతుందే? 

ప్రపంచంలో తమ మతమే గొప్పదని చెప్పుకుంటూ ఇతరులను అవమానించడం, వారిపై దాడులు చేసి విధ్వంసాలకు పాల్పడటం మానవతకే విరుద్ధమని నాగరికులమని చెప్పుకునే మేధావులకు తెలియదా? ఆ మాత్రం ఇంగితజ్ఞానం లేదా వారికి? 

ప్రపంచంలో ఎక్కడ ఏ చిన్న సంఘటన జరిగినా పసిగట్టే అమెరికా గూఢచర్య నేత్రానికి హిండుత్వంపై జరిగే దాడుల గురించి తెలియదా? ఇవేవీ తెలియకుండానే భారతదేశంలో చర్చిలకు కోట్ల డాలర్లు విరాళాలుగా కుమ్మరిస్తున్నారా? 



ఇప్పటికీ పరమతస్థులు తమ పట్ల ఎంత విధ్వంసక ధోరణిని ప్రదర్శిస్తున్నారో హిందువులకు తెలుసు. అయినా హిందువులు వారితో ప్రేమపూర్వక సహజీవనాన్నే కోరుతున్నారు. ప్రపంచంలో సహనానికి ఇంతకంటే గొప్ప ఉదాహరణ ఏముంది? 
సహనం లేనిది ఎవరికి? Reviewed by rajakishor on 7:43 AM Rating: 5

No comments:

All Rights Reserved by రాష్ట్ర చేతన © 2015 - 2016
Designed by JOJOThemes

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.