Top Ad unit 728 × 90

వార్తా హైందవం

recent

సంఘ సేవిక పంకజ



ఆగస్టు 2005లో నేను మా అమ్మ, నాన్నగార్లతో శ్రీ అమరనాథ్ యాత్రకు వెళ్ళేను. అట్నించి తిరిగి వస్తూ మేము ఆగస్టు 6, 2005న జమ్మూ చేరేము. అక్కడ మా బస ఆర్.ఎస్.ఎస్. కార్యాలయం "వీర్ భవన్"లో ఏర్పాటు చేయబడింది. 

మేము కార్యాలయంలో ఉండగానే పంకజ మమ్మల్ని చూడటానికి వచ్చింది. తనని నేనసలు గుర్తుపట్టనేలేదు. 1986లో మా పెద్దక్కయ్య పెళ్ళికి ముందు చూసేను. మళ్ళీ ఇప్పుడే. 

అప్పట్లో పంకజ సన్నగా, తెల్లగా, కోల ముఖంతో ఉండేది. రాష్ట్ర సేవికా సమితి కార్యకర్త. మాటల్లో ఒక అదురు, నడకలో ఒక వేగం. యోగ్ ఛాప్, దండ, ఛురిక, ఖడ్గ, ఆసనాలు వేయడం, కబడ్డీ, ఖోఖో ఆటలు - వీటన్నింటిలో ఎంత చురుకుగా ఉండేది!

మరిప్పుడు తనలో ఎంత మార్పు? శరీరంలో చామన ఛాయ. కొంచెం లావు. ముఖం గుండ్రంగా మారింది. మాటల్లో నిదానం. తన ఇన్నేళ్ళ జీవితంలో ఎన్ని ఒరిపిడులను చూసిందో!

జమ్మూలో పంకజ "సుశీలా సదన్" నడుపుతోంది. కాశ్మీరులో ఇస్లామిక్ తీవ్రవాదుల దాడులలో తల్లిదండ్రులను, సర్వస్వాన్నీ కోల్పోయిన పిల్లల పోషణకోసం ఇది ఏర్పాటు చేయబడింది.
ఇక్కడ "ఛిప్రా" అని ఐదేళ్ళ పాప ఉంది. రెండేళ్ళ క్రితం తీవ్రవాదులు ఈ పాప ఇంటిపై దాటిచేసి  చంపేసేరుట. ఈ పాపాయి శరీరంలో మూడు తూటాలు దూరేయి. అప్పటికి తన వయస్సు ఏడాదిన్నారే. పంకజ చూడటానికి వెళ్తే ఆసుపత్రి వారు ఉన్న పళంగా రక్తమోడుతున్న పసి పాపాయిని తన చేతుల్లో పెట్టేసారు. అప్పట్నించి పంకజే చూస్తోంది పాపాయిని. 

సుశీలా సదన్ లోనే సోమరాజు అని ఒకతను ఉన్నాడు. మూడేళ్ళ క్రితం (2002లో) తీవ్రవాదులు ఇతని కుటుంబంపై దాడి చేసి 24 మందిని చంపేసేరు. ఇతని శరీరంలోకి 23 తూటాలు దూసుకుపోయేయి. ఇతను స్పృహ తప్పి పడిపోతే ఇతని మీద మిగతావారి శవాలన్నీ పడిపోయేయి. ఇతను చనిపోయాదనుకుని తీవ్రవాదులు వదిలేసి వెళ్ళిపోయారు. తరువాత జవానులు శవాలను తొలగిస్తూ సోమరాజు కొనవూపిరితో ఉండటాన్ని గమనించి వెంటనే ఆసుపత్రికి తరలించేరు. నాలుగు రోజులపాటు ఇతనికి స్పృహ లేదు. యితడు బ్రతుకుతాడని ఎవరూ అనుకోలేదు. రెండున్నరేళ్ళ పూర్తీ విశ్రాంతి తరువాత సోమరాజు కోలుకున్నాడు. 

కాశ్మీరులో ముస్లింల ఆగడాలు చాలా ఎక్కువ. ఆడపిల్లల్ని ఎత్తుకుపోయి బలవంతంగా పెళ్ళిచేసుకుంటారు వారు. హిందూ, ముస్లిం, బౌద్ధ యువతులు (అక్కడి బౌద్దులలో స్త్రీ జనాభా ఎక్కువ) సుశీలా సదన్ కు వస్తుంటారు. వారికి సరైన వరుడిని చూసి పెళ్ళిచేసే బాధ్యతా పంకజదే. వారికి సంబంధించిన కోర్టు వ్యవహారాలను చూడటం, మిగతా ఏర్పాట్లను చూడటం - ఇవన్నీ తన పనే.

ఎక్కడి ఆంధ్రప్రదేశ్? ఎక్కడి జమ్మూ-కాశ్మీర్? అక్కడికి వెళ్ళిన పంకజ తనకంటూ జీవితాన్ని మిగుల్చుకోలేదు. కానీ, ఏడాదిన్నర పసిపాప నుంచి 18-20 ఏళ్ళ యువతి వరకు ప్రతి ఒక్కరికీ తనలో ఒక జీవితాన్ని చూపింది.



సంఘ సేవిక పంకజ Reviewed by rajakishor on 9:57 AM Rating: 5

No comments:

All Rights Reserved by రాష్ట్ర చేతన © 2015 - 2016
Designed by JOJOThemes

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.