హిందువుగా జీవించు
భారతదేశ చరిత్రలో దేశ విభజన అత్యంత విషాదకరమైనది. స్వాతంత్ర్యం పేరుతో దేశ విభజన జరిగిన నాటి నుండి నేటి దాకా జమ్ము కాశ్మీరులో హిందువులపై ముస్లుం మూకల అమానుష దాడులు సాగుతూనే ఉన్నాయి.
జమ్ము దగ్గర సియోల్ కోట్ అనే ఊరు ఉంది. 1947లో ముస్లింలు ఒక ఇంటిపై దాడి చేసి అందరినీ చంపేశారు. అదృష్ట వశాత్తు ఒక పదేళ్ళ పాప వారి కంట పడకపోవడంతో బ్రతికి బయటపడింది. ఆ పాప పేరు సావిత్రి. కాశ్మీర్ మహారాజు శ్రీ హరిసింగ్ వద్ద దర్జీగా పనిచేస్తున్న ఒక ముస్లిం ఆ పాపను తీసుకువెళ్ళి పెంచి పెద్ద చేసాడు. తరువాత ఒక ముస్లింతో ఆ పాపకు నిఖా చేసాడు.
ముస్లింతోనే వివాహమైనా సావిత్రి తన హిందూనిష్ఠను వదలలేదు. నిత్యం పూజలు, వ్రతాలు చేస్తూండేది. ఇవన్నీ ఎందుకు చేస్తున్నావని భర్త అడిగితే ఆయన క్షేమం కోసమేనని చెప్పేది.
సావిత్రికి నలుగురు పిల్లలు. వారందరికీ తాము హిందువులమని ఎల్లప్పుడూ చెప్తూండేది. ఆమె కుమార్తెకు 14 సంవత్సరాల వయస్సు వస్తే ఆమె పెండ్లి మరొక ముస్లింతో చెయ్యాలని ప్రయత్నం చేసాడు. ఆ క్షణమే సావిత్రిలో ఎంతో మార్పు వచ్చింది.
అది డిసెంబరు నెల. హిమాలయ ప్రాంతంలో భయంకరమైన చలి ఉంటుంది. అయినా లెక్క చేయకుండా సావిత్రి తన పిల్లలతో రాత్రి రెండు గంటలకు బయలుదేరి జమ్ము వచ్చింది.
మరునాడు తెల్లవారు జామున లేచి ఎక్కడైనా భాగావాధ్వజం (కాషాయ ధ్వజం) ఉందేమో చూసిరమ్మని కొడుకుని పంపించింది సావిత్రి. ఆమె కుమారుడు ఊళ్ళో ఒకచోట భగవాధ్వజం ఎగురుతూండడం చూసాడు.
అది సంఘస్థాన్. ఆర్.ఎస్.ఎస్. శాఖా కార్యక్రమం జరిగే ప్రదేశం. వెంటనే ఆ పిల్లవాడు అక్కడున్న శ్రీ ఇంద్రేష్ కుమార్ తో తమ కుటుంబ పరిస్థితి గురించి చెప్పాడు. శ్రీ ఇంద్రేష్ అప్పుడు జమ్మూ విభాగ్ ప్రచారక్ (పూర్తిసమయ కార్యకర్త). ఆయన ఒక సంఘ కార్యకర్త ఇంట్లో ఆ కుటుంబానికి వసతి ఏర్పరచేరు. తరువాత ఆయన ఢిల్లీలోని రాష్ట్ర సేవికా సమితి కార్యకర్త సింధుతాయికి పరిస్థితి వివరించేరు. ఆమె సావిత్రి కుమార్తెకు ఒక హిందువుతో వివాహం జరిపించి , ఆ కుటుంబం సరిగా ఉండేటట్లు చూసేరు .
ఎటువంటి విపత్కర పరిస్థితుల్లోనైనా సావిత్రి తనలోని హిందూత్వ నిష్ఠను సడలనీయలేదు.
(ఇది రాష్ట్ర సేవికా సమితి ద్వితీయ ప్రముఖ సంచాలిక శ్రీమతి సరస్వతీ తాయి ఆప్టే చెప్పిన ఉదంతం.)
హిందువుగా జీవించు
Reviewed by rajakishor
on
4:42 PM
Rating:
No comments: